నేను ఒక మంచి  పాఠకుణ్ణి  – రావెళ్ల

నేను ఒక మంచి  పాఠకుణ్ణి  – రావెళ్ల

January 31, 2019

“రావెళ్ల” పేరుతో గత 15 సంవత్సరాలుగా కార్టూన్లు గీస్తున్న డాక్టర్ రావెళ్ల శ్రీనివాస రావు కార్టూన్లు, బాల సాహిత్యం, కథా రచన, కవిత్వం మొదలైన రచనా ప్రక్రియల్లో రాణిస్తున్నారు. మన కార్టూనిస్టులు శీర్షికన ఈ నెల వారి పరిచయం వారి మాటల్లోనే  చదవండి. రావెళ్ల పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పేరు రావెళ్ల శ్రీనివాసరావు 6-10-1968 న గుంటూరు…

వెండితెర‌పై సిరివెన్నె‌ల గీతం

వెండితెర‌పై సిరివెన్నె‌ల గీతం

సినిమా పాట అంటేనే.. మనల్ని వెంటాడే ఓ కమ్మని మాధుర్యం. అందులో తల్లి ఒడిలో లాలన, ఆలనతో పాటు ప్ర్రేమానురాగాలూ, మానసిక సంఘర్షణలూ ఉంటాయి. మనసును ఉత్తేజపరిచే అనిర్వచనీయమైన అనుభవాలూ ఉంటాయి. అందుకే సినిమా పాట మనలో చాలామందికి నిత్యనూతనంగా మారుమోగే ఓ జీవన సవ్వడి. సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలూ అందుకు మినహాయింపు ఏమీకాదు. కానీ, ఇంకా అతని…

‘నవ్వకపోవడం ఒక రోగం’ అన్న జంధ్యాల

‘నవ్వకపోవడం ఒక రోగం’ అన్న జంధ్యాల

నవరసాల్లో అందరూ అధికంగా మెచ్చేది… ఆస్వాదించేది ‘హాస్యం’. నిజానికి తెలుగు చలనచిత్రసీమలో వున్నంతమంది హాస్యనటులు మరేచిత్రసీమలోనూ లేరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా జంధ్యాల దర్శక పగ్గాలు చేపట్టాక హాస్యం మూడు పాత్రలు ఆరు రీళ్లుగా పురోగమించింది. సినీ రచనలో ఒక భావుకుడిగా, హాస్య స్రష్టగా ప్రేక్షక హృదయాల్లో సముచిత స్థానం సంపాదించాడు జంధ్యాల. చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా స్థిరపడదామని అనుకున్న…

“బాలానందం” పదవ వసంతంలోకి ….

“బాలానందం” పదవ వసంతంలోకి ….

పిల్లలకు ఒక చాక్లెట్ ఇస్తే ఆనందం.. అదే వారికి ఏదైనా ఒక విద్యను నేర్పించి నేర్చుకున్న ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇచ్చి, బాగా చేశావని ప్రశంసించి ఒక చిన్న పెన్ను బహుమతిగా ఇచ్చిన వారికి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఆ ఆనందం పేరు బ్రహ్మానందం. సరిగ్గా బాలానందం కళావేదిక కళారంగంలో చిన్నారులకు అవకాశాలు ఇస్తూ వేదికను…

తెరమరుగైన తెలుగు సినిమా పత్రికలు

తెరమరుగైన తెలుగు సినిమా పత్రికలు

తెలుగు ప్రజలకు ఇది కొత్తేమీ కాదు. గతంలో ఎన్నో సినీ పత్రికలు మూత పడ్డాయి. లాభసాటి అనే కారణం కానే కాదు. అదంతే!! పాఠకుడికి తెలియని కారణాలు ఎన్నో… ఎన్నెన్నో. అద్భుతంగా నడచిన ‘జ్యోతి చిత్ర’ ఎందుకు మూత పడింది? అద్భుతమైన సరళితో నడచిన ‘హాసం’ ఎందుకు అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు ‘సితార’ పరిస్థితీ అంతే. ప్రచురణ కర్తలు…

జాతీయస్థాయి “సోమేపల్లి’ చిన్న కథల పోటీ విజేతలు”

జాతీయస్థాయి “సోమేపల్లి’ చిన్న కథల పోటీ విజేతలు”

“రమ్యభారతి’ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన తెలుగు చిన్న కథల పోటీలలో 11వ జాతీయస్థాయి “సోమేపల్లి సాహితీ పురస్కారాల’ కోసం దేశం నలుమూలల నుండి గతంలో కంటే అత్యధికంగా 157 కథలు పరిశీలనార్థం వచ్చాయి. వాటిలో అనకాపల్లికి చెందిన కోయిలాడ రామ్మోహనరావు రాసిన ‘సార్ధకత’ కథకు ప్రథమ సోమేపల్లి పురస్కారం లభించింది. అలాగే బండి ఉష (ఖమ్మం) రాసిన “పండగొచ్చింది’కు…

విశ్వఇన్ఫోటెక్ ‘తెలుగు యూట్యూబ్’ ఛానల్

విశ్వఇన్ఫోటెక్ ‘తెలుగు యూట్యూబ్’ ఛానల్

అంతర్జాలం ఆవిష్కరణతో ప్రపంచం సరిహద్దులు చెరిగిపోయి, భూగోళం ఓ కుగ్రామంగా మారిపోయింది. యూట్యూబ్ ప్రవేశం తో ఇది మరింత మందికి చేరువైంది. యూట్యూబ్ కేవలం సినిమాలు, రాజకీయాలే కాకుండా కొత్త విషయాలు తెలుసుకోవడానికి, కొత్త కోర్సులు నేర్చుకోవడానికి, విద్యార్దులకే కాకుండా ఔ త్సాహికులకు ఎంతో ప్రయోజనకరంగా అవతరించింది. నాడు తరగతి గదుల్లోనూ, పుస్తకాలు చదివి నేర్చుకొనే విద్యలనేకం నేడు…

విద్యార్థి లోకానికి “లక్ ఫెస్టివల్” విజయవాడ బుక్ ఫెస్టివల్

విద్యార్థి లోకానికి “లక్ ఫెస్టివల్” విజయవాడ బుక్ ఫెస్టివల్

విజయవాడ నగరంలో జనవరి 1 నుండి 11 వరకు ప్రతీ సంవత్సరం కొలువుదీరే పండుగ విజయవాడ బుక్ ఫెస్టివల్.. ఈ సంవత్సరం విజయవాడ బుక్ ఫెస్టివల్ సోసైటికి ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, ఎన్టీఆర్ ట్రస్ట్  తోడై సుమారు 270 సాల్స్ తో నిర్వహించడం ఓ ప్రత్యేకత అయితే, 30 వ విజయవాడ పుస్తకమహెూత్సవాన్ని గాంధీ గారి మనుమడు…

ప్రాచీన ఆధునికతలకు మేలి మేళవింపు: గిరిధర్ గౌడ్

ప్రాచీన ఆధునికతలకు మేలి మేళవింపు: గిరిధర్ గౌడ్

(జనవరి 4 న అఖో, విభో సంస్థ ‘సరి లేరు నీ కెవ్వరు ‘ విశిష్ట చిత్రరచనా పురస్కారం తో రాయన గిరిధర్ గౌడ్ ను తెనాలి లో సత్కరిస్తున్న సందర్భంగా..) ప్రాచీన భారతీయ చిత్రకళకు ఆధునికతను అద్దుతూ, దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన గ్రామీణ చిత్రకారుడు రాయన గిరిధర్ గౌడ్, శివుని వాహనం నంది పై…

జీవిత కాలం సరిపోదేమో – ఎం. ఎం. మురళీ

జీవిత కాలం సరిపోదేమో – ఎం. ఎం. మురళీ

ఎం. ఎం. మురళీ గత రెండు దశాబ్దాలుగా అభిరుచి తో కార్టూన్లు గీస్తూ, కార్టూన్-కవిత్వం-కథారచన వంటి విభిన్న రంగాలలో రాణిస్తున్నారు. మన కార్టూనిస్టులు శీర్షికలో ఈ నెల పరిచయం వారి మాటల్లో చదవండి… ఎం. ఎం. మురళీ పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు మల్లారెడ్డి మురళీ మోహన్. మా సొంత ఊరు శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట…