ఎక్స్ రే సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవం

విజయవాడలో ‘ఎక్స్ రే ‘ 39వ వార్షిక కవితా పురస్కారాలు
ప్రధాన పురస్కార గ్రహీత (పదివేల రూపాయల నగదు) బడుగు వీర వెంకట్రావు
కవులు తమ కవిత్వంతో సమాజంలో మార్పు తీసుకురావాలని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. 25-12-19, బుధవారం రాత్రి విజయవాడలోని ఐ. ఎం. ఎ. హాలులో ఎక్స్ రే 39వ వార్షిక కవితా పురస్కారాల సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చే సిన అనిల్ కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో వచ్చే మార్పులకు కవులే ప్రధాన భూమిక పోషించాలని సూచించారు. ప్రజా సంక్షేమంలో భాగస్వాములు కావాలని కోరారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. కవి సమాజాన్ని నిత్యం అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. సాహితీ అతిథి, ఎక్స్ రే పురస్కారాల న్యాయనిర్ణేత, విప్లవ కవి నిఖిలేశ్వర్ మాట్లాడుతూ.. కవి నవ సమాజ నిర్దేశకుడని, ఆయనే తన కవిత్వంతో సమాజంలో మార్పు తీసుకువస్తారని అన్నారు. కవి క్రాంతిదర్శి అని అభివర్ణించారు. తెలుగు అనే సమాధి మీద ఇంగ్లీష్ పూలు పూయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.
అవార్డు గ్రహీతలు వీరే ఎక్స్ రే సాహిత్య ప్రధాన పురస్కారాన్ని పదివేల రూపాయల నగదును కృష్ణాజిల్లా ఆరుతీగలపాడు గ్రామానికి చెందిన బడుగు వీర వెంకట్రావుకు  అందించారు. ఆయనతో పాటు శాంతయోగి యోగానంద (తిరుపతి), పద్మావతి రాంభక్త (విశాఖపట్నం ), షేక్ ఖాజా మొహిద్దీన్ (కర్నూలు), పలందాస్ వెంకటేష్ గౌడ్ (మెదక్), లండ సాంబమూర్తి (శ్రీకాకుళం), చొక్కర తాతారావు (విశాఖపట్నం ), కొండిమల్లారెడ్డి (సిద్దిపేట), ఎస్.కె.డి. ప్రసాదరావు (నూజివీడు)లకు వెయ్యిరూపాయల నగదుతో  ఎక్స్ రే పురస్కారాలను అందించారు. అనతరం అవార్డ్ అందుకున్న కవులందరూ తమ కవితలను ఆహుతులకు చదివి వినిపించారు. కార్యక్రమంలో ‘ఎక్స్ రే ‘ అధ్యక్షులు కొల్లూరి, ఉపాధ్యక్షులు అశోక్ కుమార్ , దేవినేని కిషోర్‌కుమార్, సోమేపల్లి వెంకట సుబ్బయ్య, గోళ్ల నారాయణరావు, శీరం రామారావు, ఎక్స్ రే సాహిత్య సేవాసంస్థ ప్రధాన కార్యదర్శి బి. ఆంజనేయరాజు, సిహెచ్. వి. సుబ్బయ్య, కిరణ్ తో పాటు అనేకమంది సమకాలీన కవులు,రచయితలు పాల్గొన్నారు.

SA:

View Comments (2)