జాతీయ గిరిజన నృత్య ఉత్సవం విశాఖపట్నం Andhra University కన్వేన్షన్ సెంటర్ లో శుక్రవారం( జూన్ 10) ప్రారంభమైంది. ఈ ఉత్సవం మూడు రోజులపాటు జరుగుతుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు పోరాట ఘట్టాలను దృశ్య రూపం చేసిన మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ స్టాల్ ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి – గిరిజన సంక్షేమ శాఖామాత్యులు పి. రాజన్న దొర సందర్శించి 18 చిత్రకారులు వేసిన చిత్రాలను ఆయన తిలకించారు. ఆయన వెంట గిరిజన సంక్షేమశాఖ అధికారులు, శాసనసభ్యులు పాల్గొన్నారు.
సుమారు 14 రాష్ట్రాల నుంచి గిరిజన నృత్య కళాకారులు తమ నాట్యాలతో అలరింపచేస్తారు. నగదు పారితోషక బహుమతులు వరసగా ప్రధమ ద్వితీయ, తృతీయ స్దానాలకు లక్ష, డబ్బై అయిదు వేలు, యాభై వేలు విజేతలకు అందచేస్తారు.
శుక్ర, శని, ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు నృత్య ప్రదర్శనలు జరుగుతాయి.
గిరిజన దాస్య శృంఖలాలు తెంచటానికి బ్రిటిష్ వారిపై యుద్దం చేసిన అల్లూరి సీతారామరాజు పోరాట ఘట్టాలు చిత్రాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో మాదేటి రవిప్రకాష్, రవికాంత్ పాల్గోన్నారు.