“మన అమరావతి” చిత్రకళా ప్రదర్శనకు ఆహ్వానం
*2026 జనవరి, ప్రపంచ తెలుగు మహాసభలలో చిత్రకళా ప్రదర్శన
*చిత్రాలు పంపడానికి ఆఖరితేదీ: 15 డిసెంబర్ 2025
ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో 2026 జనవరి 3, 4, 5 తేదీలలో మూడు రోజుల పాటు శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ ప్రాంగణం, అమరావతి, గుంటూరులో “మన అమరావతి” అనే పేరుతో ఒక అద్భుతమైన చిత్రకళా ప్రదర్శన నిర్వహించబడుతోంది. ఈ ప్రదర్శనలో తెలుగు సంస్కృతి, తెలుగు భాషా వైభవం, ఆంధ్రప్రదేశ్ కీర్తి, పర్యావరణం మరియు ప్రకృతి సౌందర్యం వంటి అంశాలను ప్రతిబింబించే “చిత్రకళా కృతులను” ప్రదర్శించేందుకు వర్ధమాన మరియు ప్రముఖ చిత్రకారులను ఆహ్వానిస్తున్నాము. కృత్రిమ మేథ-Artificial Intelligence (AI)) ద్వారా రూపొందించిన చిత్రాలు అంగీకరింపబడవు. ఈ ప్రదర్శనలో పాల్గొనే ప్రతీ కళాకారునికి ప్రశంసా పత్రము, మరియు మహాసభల అభినందన పతకం అందజేయబడుతుంది. చిత్రకారులు తమ చిత్రాలను వాటర్ / ఆక్రిలిక్ / ఆయిల్ కలర్స్ మీడియంలలో ఏదైనా చిత్రించవచ్చు. చిత్రకారులు తమ చిత్రాలను క్రింది చిరునామాకు 15 డిసెంబర్ 2025 నాటికి పంపాలని డా. గజల్ శ్రీనివాస్ కోరారు. చిరునామా: ఎస్. విజయ్ కుమార్ సమన్వయకర్త- చిత్రకళా ప్రదర్శన మన అమరావతి” 202, సత్యవతి హెూమ్స్, కనకమేడల కన్వెన్షన్ ఎదురుగా, మెయిన్ రోడ్, యస్వీయన్ కాలనీ, గుంటూరు – 522006, ఫోన్ నంబర్ : 98495 03860.
మీరు గీసిన చిత్రాలు పరిమాణం: కనిష్టంగా 12″ X 15″ గా, గరిష్ఠం 24″ X 30″, వుండాలని ఏదైనా ఫ్రేమ్ చేసి ప్రదర్శనకు సిద్ధంగా ఉండాలనీ కోరారు. ప్రదర్శనలోని చిత్రాలు విక్రయం జరిగితే, అందిన మొత్తాన్ని నేరుగా ఆయా కళాకారులకు అందజేయనున్నట్లు, తెలుగు సాంస్కృతిక గౌరవాన్ని ప్రతిబింబించే ఈ మహత్తర కళా ప్రదర్శనలో తెలుగు చిత్రకారులందరూ పాల్గొనవలసినదిగా కోరుకుంటున్నామని కార్యదర్శి ధవేజి, ముఖ్య సమన్వయకర్త పి. రామచంద్ర రాజు, సహ సమన్వయ కర్త వి. విద్యాసాగర్ లు కోరారు.

చాలా మంచి gesture. ఈ అవకాశాన్ని మన రాష్ట్ర చిత్రకారులందరూ అందిపుచ్చుకోవాలి. ఏ సైజ్ లో వేయలో కూడా తెలిపితే బావుండేది.
Thank you sir