– ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సమితి, కొలుసు ఫైన్ ఆర్ట్ స్టూడియోస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్ట్ కాంప్ …
– 50 మంది మహిళా చిత్రకారిణులతో విజయవాడలో రెండు రోజులపాటు (మార్చి 1,2 మరియు 3) ఆర్ట్ కాంప్, మూడవ రోజు ప్రదర్శన…
మగవారికన్నా మగువలు ఏ విషయలంలోనూ తక్కువ కాదని ఆవకాశం వస్తే తమ ప్రతిభను చాటుకుంటామని మహిళలు ఋజువు చేశారు. ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సమితి, కొలుసు ఫైన్ ఆర్ట్ స్టూడియోస్ ఆధ్వర్యంలో ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ సంగీత కళాశాలలో రెండు రోజులపాటు శ్రమించి మహిళా చిత్రకారిణిలు వేసిన చిత్రాల ప్రదర్శన సోమవారం సాయంత్రం సంగీత కళాశాలలో ప్రారంభమైంది. ఈ ప్రదర్శన మంగళవారం కూడా కొనసాగుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల లోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన 50 మంది చిత్రకారిణులు తమ – మేధకు పదును పెట్టారు. విజయవాడ నగరం చారిత్రక ప్రాధాన్యం, కట్టడాలు, సాంస్కృతిక వారసత్వ సంపద, ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మిక అంశాలు, గౌతమ బుద్ధుని చారిత్రక వైభవం, దుర్గమ్మ తెప్పోత్సవం, ప్రవిత్ర సంగమం వద్ద హారతులు అంశాలను చిత్రీకరించారు. ఈ చిత్రకళా ప్రదర్శనలో మహిళలతో పాటు యువ చిత్రకారిణిలు ఎక్కువగా పాల్గొన్నారు.
మహిళాభ్యున్నతికి ప్రభుత్వం కృషి: చిత్రకళా ప్రదర్శనను విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించి, మాట్లాడుతూ మహిళల రక్షణకోసం దిశ లాంటి కఠిన చట్టాలను ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. సృజనాత్మక సమితి సీఈఓ ఆర్.మల్లికార్జునరావు మాట్లాడుతూ సాంస్కృతిక శాఖ పక్షాన కవులు, కళాకారులు, చిత్రకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. కల్చరల్ సెంటర్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుడు లంకా వెంగలరావు యాదవ్ తదితరులు ప్రసంగించారు. అనంతరం చిత్రకారిణులను అతిథులు సత్కరించి, ప్రశంసాపత్రాన్ని అందించారు. చిత్రకారుడు కొలుసు సుబ్రహ్మణ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు.
చిత్రకళారంగములో మహిళ మూర్తులతో కార్యక్రమము ద్వారా ప్రోత్సహం, మీ వ్యాసం తో ప్రోత్సాహించడం
మహిళలకు తగు ప్రాదాన్యత ఇస్తూ గౌరవించడం బాగుంది.
సరిలేరు మీకెవ్వరూ… అంటూ… అన్నీ రంగాలలోనూ…. పురుషులతో సమానంగా రాణిస్తున్న మహిళా సోదరీమణులకు చిత్రకళలో చక్కటి ప్రోత్సాహాన్ని అందిస్తున్న ఆంద్రప్రదేశ్ సృజనాత్మక సంస్థ వారికి… శ్రీ కొలుసు సుబ్రహ్మణ్యం గారికి అభినందనలు తెలియజేస్తూ… ఇంతటి మహత్తర కార్యక్రమం గురించి చక్కని వ్యాసాన్ని అందించిన వ్యాస రచియిత గారికి నమస్కరిస్తూ.. 🙏🙏
అంజి ఆకొండి
కాట్రేనికోన
చాలా మంచి కార్యక్రమం చేపట్టిన కొలుసు ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారికి నా అభినందనలు