64కళలు.కాం కు సోషల్ మీడియా అవార్డ్

ఆంధ్ర ప్రదేష్ ప్రభుత్వం, కె.ఎల్.డీమ్డ్ విశ్వవిద్యాలయం మరియు జిజ్ఞాస సంస్థ సమ్యుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ సోషల్ మీడియా ఫెస్టివల్ విజయవాడలో కె.ఎల్. యూనివర్సిటి వేదికగా రెండు రోజులపాటు జూన్ 29,30 న జరిగింది. లాగిన్ టెక్నాలజీస్, ఈ డిజిటల్ టెక్నాళజీస్,శానూష్ మీడియా, శ్రీవిక్రమ ప్రకాష్ ఆర్ట్స్ అకాడమీ సంస్థల సహకారంతో రెండు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలలో మన రాష్ట్రంతో పాటు సౌతిండియాలోని తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, ఒరిస్సా, రాష్ట్రాల నుంచి వివిధ సోషల్ మీడియా విభాగాలలో పేరొందిన సోషల్ మీడియా యూత్ స్టార్స్ (సామాజిక మాధ్యమాల యువ నాయకులు 250 మంది) పాల్గొన్నారు.
సోషల్ మీడియాలో ఒక్కొక్కరికి 20 వేల మంది ఫాలోవర్స్ (అనుసరణీయులు) ఉన్న వారికి మాత్రమే ఈ అవార్డులు ప్రదానం చేసారు.
మరో 50 మందికి  సామాజిక మాధ్యమాలను సమాజ పురోభివృద్ధికి వాడే వారిని ఎంపిక చేసి సోషల్ మీడియా స్టార్స్ అవార్డ్స్ అందజేసారు.
64కళలు.కాం తెలుగులో గత ఎనిమిదేళ్ళుగా కళారంగానికి చేస్తున్న సేవలను గుర్తించి ప్రకటించిన ఈ అవార్డ్ ను పత్రిక ఎడిటర్ కళాసాగర్ అందుకున్నారు. ఇంకా ప్రముఖ కార్టూనిస్ట్ హరి కృష్ణ ” సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్” (SOCIAL MEDIA INFLUENCER) అవార్డ్  వేద గంగోత్రి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ జీవీఎన్ఆర్ఎస్ఎస్ వర ప్రసాద్, కృష్ణ జిల్లా కన్స్యూమర్ కోర్ట్ జడ్జ్ శ్రీ ఆర్.మాధవ రావు, సినీ హీరో శ్రీ తనీష్ ప్రముఖుల చేతులమీదుగా అందుకున్నారు. సోషల్ మీడియాలో హరి కృష్ణ కార్టూన్లకు వేలలో ఫాలోవర్స్ వున్న కారణాన  ఈ అవార్డు వారికి దక్కింది.
సోషల్ మీడియా-సుస్థిర ఉద్యోగ అవకాశాలు, సోషల్ మీడియా – వ్యక్తి లేదా సంస్థ బ్రాండ్ నిర్మాణం, సోషల్ మీడియా – సామాజిక చైతన్యం, సోషల్ మీడియా – నాలెడ్జి సొసైటీ, సోషల్ మీడియా- సమాచార విప్లవం వంటి అంశాలపై ప్రతి విభాగంలోనూ రెండు రోజులపాటు 8 సదస్సులు, వర్క్ షాపులు నిర్వహించారు. ఈ సదస్సులో చేసిన తీర్మానాలను, అభిప్రాయ సేకరణ తో కలిపి సమాజాన్ని జాగృతం చేయడమే ముఖ్య లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సదస్సులకు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, మీడియా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ప్రొఫెసర్లు, సామాజిక వేత్తలు, సాహితీవేత్తలు, ఔత్సాహికులు, ఉద్యోగులు,యువకులు, విద్యార్థులు, సోషల్ మీడియా నిపుణులు హాజరయ్యారు.
సోషల్ మీడియా కాంపిటీషన్స్: సోషల్ మీడియా పై ఆసక్తి కలిగిన వారికోసం ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఇన్స్ స్టాగ్రామ్ లో (హగ్గింగ్ హెరిటేజ్), ఫేస్ బుక్ లో(సెల్ఫీ విత్ సోషల్ మెసేజ్), యూట్యూబ్ లో(షేర్ యువర్ నాలెడ్జ్) టిక్ టాక్ లో(మోడ్రన్ సాంగ్ ఇన్ ట్రెడిషనల్ డ్రెస్) వంటి నాలుగు రకాల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసారు. కార్యక్రమాల మధ్యలో నాట్యాచార్యులు పవన్ కుమార్ శిష్య బృందంతో కుచిపూడి, జనపద నృత్యాలు, సాంప్రదాయ గరగలు, డప్పు వాయిద్యాలు ఆహుతుల్ని అలరించాయి.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు ప్రుధ్వీ, హీరో తనీష్, నటి సురేఖవాణి, పి.టి.ఓ. ఐ.జి. సత్యనాయణ, విజయవాడ కల్చరల్ సెంటర్, సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, గంగోత్రి వరప్రసాద్, ఎఫ్ఫెట్రానిక్స్ యం.డి. రామకృష్ణ, టెక్ గురు నల్లమోతు శ్రీధర్, దారా కరుణశ్రీ, జిజ్ఞాస సంస్థ వ్యవస్థాపకులు భార్గవ్, ఈ- డిజిటల్ సంస్థ నిర్వాహకులు సాయి రమేష్, లాగిన్ సంస్థ నిర్వాహకులు జనార్ధన్ , విక్రమ ప్రకాష్ జర్నలిస్ట్ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.

– బి.ఎం.పి. సింగ్

(మరికొన్ని ఫొటోలు ఫోటో గాలరీలో చూడగలరు.)

Photo Gallery

2 thoughts on “64కళలు.కాం కు సోషల్ మీడియా అవార్డ్

  1. చాలా సంతోషం ! మీ కృషి అభినందనీయం !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap