ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణాజిల్లా రచయితల సంఘం- కాకరపర్తి భావనారాయణ కళాశాల, విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో…
2024 డిసెంబరు 28, 29 శని, ఆదివారాలలో కె.బి.యన్. కళాశాల విజయవాడ-1
ప్రపంచ తెలుగు మహాసభల (1975) స్వర్ణోత్సవాల సందర్భంగా 2024 డిసెంబరు 28, 29 తేదీలలో విజయవాడ కొత్తపేట కాకరపర్తి భావనారాయణ కళాశాల ప్రాంగణంలో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగనున్నాయి. ఉభయ రాష్టాలు మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులను, సాహితీ ప్రముఖు లందరినీ తప్పక పాల్గొన వలసిందిగా ఆహ్వానిస్తున్నాము. యువకవుల వికాసవేదికగా అవతరించిన మినీ కవితకు ఇది స్వర్ణోత్సవ సందర్భం కూడా!
ఈ మహాసభలలో వివిధ అంశాలపై ప్రసంగాలు, సదస్సులు, కవిసమ్మేళనాలు, ఎంపిక చేసిన 100 మంది యువకవులతో “ఆలపిస్తాం హాయిగా” ప్రత్యేక కవితా్వైభవ సభ, ఎన్నో ఇతర సాహితీ కార్యక్రమాలు ఉంటాయి.
యువ రచయితల సమ్మేళనం: యువతరంలో తెలుగు జాతీయతా భావాన్ని ప్రోదిచేసే లక్ష్యంతో ఈ మహాసభలలో ప్రత్యేకంగా “యువ రచయితల సమ్మేళనం” నిర్వహిస్తున్నాము. పాత్రికేయ దిగ్గజం శ్రీ రామోజీరావు, యువతలో సాహిత్యాభినివేశానికి కృషిచేసిన శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ, శ్రీ అద్దేపల్లి రామమోహన రావు, శ్రీ కావలి బొర్రయ్య వంటి ప్రముఖుల పేర్లతో వేదిక లుంటాయి. యువతీ యువకులలో దాగి ఉన్న ప్రతిభా వ్యుత్పత్తులను ప్రదర్శించే అవకాశం ఉంటుంది. యువతలో సాహితీ ప్రతిభకు సానపట్టే అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.
40 యేళ్ళ లోపు వయసు ఉన్న యువరచయితల కోసం వివిధ సాహిత్య ప్రక్రియలపై కార్యశాలలు (వర్క్ షాపులు) ఉంటాయి.
1) పద్యరచన 2) వచన కవిత, మినీకవిత 3) కథ, నవల 4) గేయాలు, గజల్స్ 5) దృశ్య శ్రవ్య నాటకాలు 6) వ్యాస రచన, పరిశోధన, గ్రంథ పరిరక్షణ 7) బాల సాహిత్యం 8) అనువాద ప్రక్రియ 9) సాంకేతిక పరిఙ్ఞానం, సోషల్ మీడియా వినియోగం మొదలైన అంశాలపై ఆయా రంగాలలో ప్రసిద్ధులైన సాహితీ మూర్తులు, సాంకేతిక నిపుణులు శిక్షణనిస్తారు. హాజరైన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు, ఉత్తీర్ణతా పత్రాలు ఉంటాయి.
- ఈ మహాసభలలో రచయితలు, విద్యార్థులు కూడా ప్రతినిధులుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. కృష్ణాజిల్లా రచయితల సంఘం మరియు ప్రపంచ తెలుగు రచయితల సంఘం జీవిత సభ్యులుకూడా ప్రతినిధులుగా నమోదు చేసుకోవాలి. ప్రతినిధులకు మాత్రమే ఈ మహాసభలలో ఏ అంశంలో నయినా పాల్గొనే అవకాశం ఉంటుంది.
- ప్రతినిథి రుసుము 500/- రూపాయలు. రుసుము చెల్లించేందుకు ఆఖరు తేదీ: 2024 సెప్టెంబర్ 30. చెల్లింపులను UPIద్వారా 9391238390 నంబరుకు పంపండి. స్క్రీన్ షాట్, పేరు, చిరునామా, ఫోన్ నెంబర్లను వాట్సాప్‘లో పంపండి. చెక్కు/డిడి పంపే వారు ప్రపంచ తెలుగు రచయితల సంఘం-విజయవాడ పేర పంపవచ్చు.
- విద్యాలయాల ధృవీకరణ పత్రం ఉన్న విద్యార్థులు రుసుము చెల్లించ కుండానే ప్రతినిథిగా నమోదు కావచ్చు.
- ప్రతినిధులందరికీ రెండు రోజులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఉపాహారం, భోజనాలు, టీ, శ్నాక్స్ ఉంటాయి.
- ప్రతినిధులు వసతి స్వంతంగా ఏర్పాటు చేసుకో వలసి ఉంటుంది. విద్యార్థులకు ఉచిత డార్మెటరీ సౌకర్యం ఉంటుంది.
మరిన్ని వివరాలకు: గుత్తికొండ సుబ్బారావు, 9440167697 డా. జి.వి. పూర్ణచందు 9440172642 దామెర్ల నరసింహారావు: 9885660972
కార్యాలయం:27-14-45, మొదటి అంతస్తు, సత్నాం టవర్స్, బకింగ్ హాం పేట పోష్టాఫీస్ ఎదురు, గవర్నర్ పేట, విజయవాడ-520002: సెల్: 9391238390