
భరతజాతి యశోగీతి పాడవోయి సోదరా
వీనుల విందుగా నాద సుధా ఝరులు జాలువార
వేదమాత నా ధరణి వేల సంస్కృతుల భరణి
యజ్ఞాలకు యాగాలకు ఆలవాలమైన ఆవని
వాల్మీకి వ్యాసులు పోతన నన్నయ్యాదుల
సారస్వత పరిమళాల వారసత్వమును చాటుచు
ఆత్మబోధనందించే గీతాచార్యుడు నాడే
గౌతమ బుద్ధుని యానము శాంతి మార్గమును చాటే
అద్వైతం పంచే ఆదిశంకరులు నలుదిశల
సనాతనమే సకల ధర్మ సంగమ సుక్షేత్రమని
జాతిపిత గాంధీజీ నెహ్రూ సర్ధార్ పటేల్
శాంతి సత్యాగ్రహాలు ఆయుధముగా ఉద్యమించె
సమర స్ఫూర్తిని నింపగ సమిధలైరి ఎందరో
ఆ మహనీయుల ప్రాణత్యాగాలే రాగాలుగా
నెత్తురు మరిగిన పాక్ ముష్కరుల కోరలు విరిచి
హద్దులు దాటే చీనీ మూకలను చెదరగొట్టి
కన్నభూమి రుణము దీర్చ కడవరకు ప్రాణమొడ్డి
జైహిందని మన జవాను కదనమందు కదలాడగ
సమభావమే మన ధ్యేయము సమధర్మమే మన మార్గము
సౌభ్రాతృత్వముతో సామరస్యమును చాటుచు
సార్వ భౌమత్వానికి సామాన్యులు వారసులని
విశ్వస్ఫూర్తికి నాందిగా జయభేరిని మోగించి
– డా. రుద్రవరం సుధాకర్
చాలా బాగుంది పాట
అద్భుతంగా రాశారు
Thanq Bnim Gary😊
Very nice lyrics , nicely described
Very inspiring really very nice lyrics
Beautiful beyond words 🤩
Never read any of your poetry that didn’t inspire me. Beautifully composed and expressed as always. Proud to be your daughter.
Bharatajāti yaśōgīti pāḍavōyi sōdarā
Vīnula vindugā nāda sudhā jharulu jāluvāra
Vēdamāta nā dharaṇi vēla sanskr̥tula bharaṇi
yagñālaku yāgālaku ālavālamaina āvani
vālmīki vyāsula pōtana nannayyādula
sārasvata parimaḷāla vārasatvamunu chāṭuchu
Ātmabōdhanandin̄chē gītāchāryuḍu nāḍē
gautama bud’dhuni yānamu śhānti mārgamunu chāṭē
advaitaṁ pan̄chē ādiśaṅkarulu naludiśhala
sanātanamē sakala dharma saṅgama sukṣhētramani
Jāthipitha gāndhījī, nehrū, sardhār paṭēl
śānti satyāgrahālu āyudhamugā udyamin̄che
samara sphūrthini nimpaga samidhalairi endarō
ā mahanīyula prāṇatyāgālē rāgālugā
Netthuru marigina pāk muṣhkarula kōralu virichi
haddulu dāṭē chīnī mūkalanu chedaragoṭṭi
kannabhūmi ruṇamu dīrcha kaḍavaraku prāṇamoḍḍi
jaihindani mana javānu kadhanamandu kadhalāḍaga
Samabhāvamē mana dhyēyamu samadharmamē mana mārgamu
saubhrātr̥tvamuthō sāmarasyamunu chāṭuchu
sārva bhaumatvāniki sāmān’yulu vārasulani
viśhvasphūrthiki nāndigā jayabhērini mōgin̄chi
-Dr. R. Sudhakar.
Beautiful beyond the words