7వ ప్రపంచ సాహితీ సదస్సు

(అక్టోబర్ 10-11 ‘Youtube’ లో ప్రత్యక్ష ప్రసారం)….

అమెరికాలోని వంగూరి చిట్టెన్ రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10-11 తేదీలలో 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు జరుగనున్నది. హ్యూస్టన్ (అమెరికా) లండన్ (యూకే) జోహనెస్ బర్గ్ (దక్షిణాఫ్రికా) ఇండియా, సింగపూర్, మెల్ బోర్న్ (ఆస్ట్రేలియా) నగరాలలో ఆయా దేశాల కాలమానం ప్రకారం మొత్తం 15 వేదికల నుంచి 24 గంటల పాటు ఏకధాటిగా నిర్వహింపడే ఈ సదస్సును భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 10 శనివారం మధ్యాహ్నం గం. 1.30 ని. లకు భారత ఉపరాష్ట్రపతి శ్రీ యం. వెంకయ్యనాయుడు గారు ప్రారంభిస్తారు.

7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రారంభ వేదిక
(అక్టోబర్ 10, మ. గం. 1.30 ని. లకు)
నిర్వహణ: వంగూరి చిట్టెన్ రాజు
ప్రార్థన: మా తెలుగు తల్లికి మల్లెపూదండ…
జ్యోతి ప్రజ్వలన , భారత దేశం, దక్షిణాఫ్రికా, సింగపూర్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, అమెరికా తదితర దేశాల తెలుగు ఆడపడుచులు
స్వాగత వచనాలు: ప్రపంచ సాహితీ సదస్సుల నేపధ్యం, ఆశయాలు – వంగూరి చిట్టెన్ రాజు
సందేశం: ‘గౌ. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు
వక్తలు పద్మభూషణ్’ డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
అధికార భాషా సంఘం అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
శ్రీ కె.వి. రమణాచారి, IAS – సాంస్కృతిక శాఖ సలహాదారులు, తెలంగాణా ప్రభుత్వం
శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ – పూర్వ ఉప సభాపతి, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
సి. మృణాళిని – విశ్రాంతాచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం
డా. ఆవుల మంజులత – పూర్వ ఉప కులపతి, తెలుగు విశ్వవిద్యాలయం
శ్రీ దేశపతి శ్రీనివాస్ – గేయ రచయిత, గాయకులు, ఉపాధ్యాయులు
శ్రీ తనికెళ్ళ భరణి – సినీ నటులు, కవి, రచయిత

ముగింపు వేదిక (మ. గం. 1.30 ని. లకు)
నిర్వహణ: జొన్నలగెడ్డ మూర్తి (Southport, UK)
వేదిక సాంకేతిక నిర్వహణ: శేషగిరి నల్లబోతు, సురేష్ ఉపాధ్యాయుల (ఇంగ్లండ్)
వక్తలు – ప్రసంగాలు వేదిక ప్రారంభం: డా. అచ్చయ్య కుమార్ రావు (మలేషియా)
శ్రీ జ్యోతి (మలేషియా) – కవిత
ప్రియశ్రీ (మలేషియా) – కవిత
హానుష నాగేంద్ర రావు (Shah Alam, Malaysia) – కవితా పఠనం
తెన్నేటి వసుంధర (Hanumakonda) – జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచనలు, విశిష్టత
పెద్ది సాంబశివరావు (తెనాలి) – తెలుగు నిఘంటువులు
కస్తూరి అలివేణి (హైదరాబాద్) – భారతీయ సాహిత్యం లో తెలుగు సాహిత్యం
తెన్నేటి విజయ చంద్ర (వరంగల్) – తెలుగు సాహిత్యం లో చమత్కార చంద్రికలు
కొంపెల్ల శర్మ (హైదరాబాద్) – మునిమాణిక్యం గారి దాంపన్యోపనిషత్తు
మల్లికా భరద్వాజ్ గొల్లపూడి (Bangalore) – ఇదీ శ్రవంతి కథ
విజయ అత్తలూరి (Hyderabad) – ఎం.ఎన్. రాయ్ జీవితం
ఆచార్య కొలకలూరి మధు జ్యోతి (India) – ఆధునిక స్త్రీ సాహిత్యం
పొత్తూరి సుబ్బారావు (హైదరాబాద్) – సాహిత్య పత్రికల మనుగడ
ఎన్. లక్ష్మీ అయ్యర్ (రాజస్తాన్) – తెలుగు రామ భక్తి సాహిత్యం
ముద్దు వెంకట లక్ష్మి (బెంగుళూరు) – శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారి ” కోతికొమ్మచ్చి”
7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ముగింపు: స్వర వీణాపాణి – మాతృదేశ వందనం
__________________________________________________________________________
జూమ్ వీడియో లో జరుగుతున్న ఈ తెలుగు సాహితీ సదస్సు యూ ట్యూబ్, ఫేస్ బుక్ తదితర మాధ్యమాల ద్వారా ప్రపంచంలో ఏ దేశం నుంచి అయినా ప్రత్యక్ష ప్రసారం లో చూసి, తమ అభిప్రాయాలని అప్పటికప్పుడు తెలియజేయవచ్చును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap