ప్రజాపాటకు పట్టాభిషేకం

సంస్కృతి సమస్థ అమరావతి పరిరక్షణ సమితి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్ట్ 3, ఆదివారం గుంటూరు, బ్రాడీపేట కొరటాల భవన్లో ప్రజా పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ప్రజా గాయకుడు పీ.వీ. రమణ ను ఆ కళామతల్లి నిండు ఆశీర్వాదాలు ఆశీర్వదించింది 25 సంవత్సరాల క్రితం విద్యార్థుల సమస్యలపై గలమెత్తిన గొంతు కార్మిక సమస్యల కళాశాలల సమస్యల విద్యుత్తు కార్మికుల సమస్యలపై ఇలా ఎన్నో ఉద్యమాల రూపంలో ఊపిరి పోస్తూ ప్రయాణిస్తున్న ప్రయాణంలో అమరావతి పరిరక్షణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడేలా రమణ గొంతు గల మెత్తింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న పోరులో ఉద్యమ పాటలతో హోరెత్తించారు. ఇలా తన 25 సంవత్సరాల ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఈ సుదీర్ఘ ఉద్యమాలలో పాల్గొంటూ తనను తనలో ఉన్నటువంటి శక్తి సామర్ధ్యాలను గుర్తించి సంస్కృతి సమస్త వారు మరియు అమరావతి పరిరక్షణ సమితి వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ అవార్డుని అందజేశారు. ప్రశంశాపత్రాన్ని మరియు సువర్ణ కంకణాన్ని మాజీ మంత్రి వర్యులు నక్కా ఆనందబాబు చేతుల మీదుగా అందించి సత్కరించారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు పి.వి. మల్లికార్జున్ రావు గారు వ్యవహరించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా తెలంగాణ ప్రముఖ కవి జయరాజు గారు విచ్చేసి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి గాయకుణ్ణి అందించినందుకు రమణ తల్లిదండ్రులకు ఆయన ధర్మపత్నికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఒక కళాకారుడు ఎన్నో కష్టాలను బాధలను అనుభవిస్తూ ఆ కళాకారున్ని గుర్తించి ఇలా అవార్డులతో సువర్ణ కంకణముతో సన్మానించి సత్కరించటం నాకెంతో ఆనందంగా ఉందని అన్నారు గుంటూరు కలలకు ప్రసిద్ధి కళాకారులు కవులు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. వారి మధ్యన ఇలా ఉండటం వారికి ధన్యవాదాలు తెలియజేసుకోవడం నాకెంతో ఆనందదాయకం అని అన్నారు. ఏ.సీ. కళాశాల మాజీ ప్రిన్సిపల్ పోలే ముఖ్యం గారు మాట్లాడుతూ పి.వి. రమణ ఏసీ కాలేజీలో నా శిష్యుడు రమణను అందరూ మామూలుగా పాటలు పాడుతూ ఉంటాడు. చదువు అంతగా అభినయట్లేదని చాలామంది అనుకుంటారు, కానీ ఎంఏ తెలుగు పీహెచ్డీ పూర్తి చేసి ఉద్యోగం కూడా వస్తే వెళ్లకుండా పాటనే నమ్ముకొని ప్రయాణం చేస్తున్నాడు నా శిష్యునకు ఈరోజు గద్దర్ అవార్డు సువర్ణకంకణముతో సత్కరిస్తుంటే నా మనసు పులకరించి ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నానని అన్నారు. నక్క ఆనంద్ బాబు గారు మాట్లాడుతూ రమణతో పది సంవత్సరాలుగా నా ప్రయాణం కొనసాగుతుందని రమణ పాటలు ఎంతో మాధుర్యంగా ఉద్యమాలలో చక్కగా ఊపిరి పోస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. అటువంటి రమణకు గద్దర్ అవార్డు ఇవ్వటం సువర్ణ కంకణం నా చేతుల ద్వారా బహుకరణ చేయించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రజలందరూ చైతన్యవంతులను చేయటానికి సమాజానికి ఇలాంటి వారు ఎంతో అవసరం అని నా తరపు నుంచి ప్రభుత్వం తరఫునుంచి సహాయ సహకారాలు అందించడానికి నేను ముందుంటానని అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ ప్రజా గాయకుడైన గద్దర్ అవార్డును ప్రముఖులకు నటీనటులకు సినిమా పరిశ్రమలో ఇవ్వటం జరుగుతుంది. అలాంటి అవార్డుని గుంటూరులో ప్రజా గాయకుడైన పీవీ రమణకు ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు రమణ పడిన కష్టానికి తగిన ఫలితం లభించిందని అన్నారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ నేను 25 సంవత్సరాల క్రితం పాటను మొదలుపెట్టాను. నాతోటి స్నేహితులు కొందరు మద్యానికి బానిసై మరణానికి చేరువయ్యారు. నేను ఈ గుంటూరుకు వచ్చి పాటనే నమ్ముకొని పాటే ప్రాణంగా జీవిస్తూ ఎన్నో కష్టాలకు బాధలను అవమానాలను భరిస్తూ ఈ స్థాయికి ఎదిగి ఇంతగా నన్ను ప్రోత్సహించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు.

అలాంటి వారిలో బాలచందర్ గారు ముఖ్యులు అలాగే నక్కా ఆనందబాబు గారు ఇలాగా నాకు గురువులు ప్రోత్సహించిన వారు చాలామంది ఉన్నారు అని చెప్పేసి వారి పేర్లను వేదిక మీద ప్రస్తావిస్తూ వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఇలా జరగటం ఎంతో చాలా ఆనందంగా ఉందని మునుముందు నా ప్రయాణం ఇలాగే కొనసాగిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంతోమంది ప్రసిద్ధ కవులు కళాకారులు గాయకులు పాల్గొన్నారు. పలు రకాల సంఘాలు అభిమానులు కళాభిమానులు అందరూ రమణను శాలువాలతో పూలమాలలతో సన్మానించి సత్కరించుకున్నారు.

మల్లికార్జున ఆచారి

Share via
Copy link
Powered by Social Snap