గిరీష్ కర్నాడ్ వేషం నేను వేశాను- ఏ.బి ఆనంద్

పెరటికాయ కూర కూరకు పనికిరాదు అని నానుడి కానీ ఆరోగ్యానికి అది అవసరం. గిరీష్ కర్నాడ్ దేశ ప్రజలకు తెలిసినవాడు. నాటక రచయితగా, దర్శకుడిగా, నటుడిగా ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు మరెవ్వరికి లేవు. హయ వధనే అన్న కన్నడ నాటకాన్ని సాంకేతిక విలువలతో అద్భుతంగా రాశారు. అది బెంగలూరులో ప్రసారమై జాతీయ స్థాయిలో పేరు పొందినది. దేశంలో ఉన్న ఆకాశవాణి కేంద్రాలు అన్నిటిలోనూ ఆయా భాషలలో ప్రసారమైంది విజయవాడలో తెలుగులో ప్రసారమై కడప, విశాఖపట్నం, హైదరాబాద్, మద్రాస్ కేంద్రాల నుంచి కూడా రిలే చేయబడింది. కన్నడంలో ఆ నాటకానికి రచయిత, నిర్వహణ, నటుడు ఆయన. తెలుగులో ఆ వేషం నేను వేశాను నిర్వహణ రమా మోహన్ రావు గారని మంచి మృదంగ కళాకారుడు మణి గారి శిష్యుడు కన్నడంలో దానిని గిరీష్ కర్నాడ్ వేదికపై కూడా ప్రదర్శించారు.

జంధ్యాల దర్శకత్వంలో రాజమండ్రిలో ఆనందభైరవి షూటింగ్ జరుగుతున్న సమయంలో సి. రామ్ మోహన్ రావు గారి ద్వారా నా నాటకాన్ని విన్నారు. ఆనందభైరవి సినిమా శత దినోత్సవ సందర్భంగా జంధ్యాల నన్ను, నండూరి సుబ్బారావు గారిని మద్రాసు పిలిపించి రాత్రికి నాటకాన్ని తయారు చేసే ప్రదర్శన అంటే అప్పటికప్పుడు సుబ్బారావు గారు హాస్య నాటికను రాసి మాతో పాటు శ్రీలక్ష్మి, సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు రిహార్సల్స్ చేసి ప్రదర్శించాం. ఆ కార్యక్రమానికి గిరీష్ కర్నాడ్ గారు తన భార్యతో వస్తున్నారని తెలిసి నేను, జంధ్యాల, సి. రామ్ మోహన్ రావు ఆహ్వానించడానికి వెళ్లాం. గిరీష్ కర్నాడ్ గుమ్మం వరకు వచ్చి జంధ్యాల గారూ మీరు అంగీకరిస్తే నా శ్రీమతిని కూడా తీసుకు వస్తాను అన్నాడు. అదేమిటి ఈ కార్యక్రమం మీది మీరు ఏం చేసినా మాకు ఆనందమే అని నన్ను పరిచయం చేస్తే నో.. నో.. హి ఇస్ నాట్ ఆనంద్ మై హయవధనే అని నన్ను దగ్గరికి తీసుకుని కౌగిలించుకొని వారి శ్రీమతికి పరిచయం చేశారు. నా పాత్ర వీరు వేశారు నాకన్నా అద్భుతంగా చేశారు అని చెప్పేసరికి నమస్కరించారు అదీ ఆయన సంస్కారం. రమా మోహన రావు గారు పాత్రల ఎన్నిక నన్ను చేయమన్నాడు. ప్రధాన పాత్ర నేను తీసుకుని ప్రతినాయకుని పాత్రకు ఎన్నిక చేసి (మాతో పాటు చుండూరు మధుసూదన్ రావు, కందుకూరు చిరంజీవి రావు, జగన్నాథరావు ఆఫ్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్, కనకదుర్గ, సి. రామ్ మోహన్ గారు కూడా పాల్గొన్నారు).

ప్రసారం చేస్తే మంచి అభినందనలు వచ్చాయి. ఆ నాటకం ప్రసారం అయిన తర్వాత మూడు నెలలకు మైసూర్ లో రిఫ్రెషేడ్ కోర్స్ కు నన్ను పంపించాడు. అక్కడ కన్నడంలో నాటకాలలో మంచి అనుభవం ఉన్న పెద్దలను పిలిచి మాకు ఉపన్యాసాలు ఇప్పించారు. ఒకాయన ఉపన్యాసం ఇస్తూ హాయవధన నాటకాన్ని గురించి చాలా అసహ్యంగా మాట్లాడాడు. దేశ ప్రజలందరికీ నచ్చిన ఆ నాటకం మీకు ఎందుకు నచ్చలేదు అనేసరికి ఆయనకు కోపం వచ్చింది. మనిషికి గుర్రం తలకాయ ఉంటుందా అనేది ప్రశ్న, పుట్టుకతో అలా వచ్చింది కాదు శాపవశాన వచ్చింది. అలాంటి కథలు, జానపదాలు మీద ఎన్ని విని ఉంటారు వాటన్నిటినీ విమర్శిస్తునారా అనే మానసిక విశ్లేషణ చేసి ఆ పాత్రను గురించి చెప్పాను సరే ఆ విషయాన్ని గురించి చర్చ మానేద్దాం అని కూర్చున్నాడు. అదే మరో రాష్ట్రం నుంచి ఎవరైనా రాసి ఉంటే అతను ఎంత మెచ్చుకునేవాడు అసూయ మనిషిని ఎంతైనా దిగజారుస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ.

ఏ.బి ఆనంద్,
ఆకాశవాణి.

SA:

View Comments (1)