గుంటూరు జిల్లా పొనుగుపాడులో అభినయ నాటక పరిషత్-2022 రెండో రోజు(13/01/2022) కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా యార్లగడ్డ ఎక్స్పర్టు మేనేజింగ్ డైరెక్టర్ యార్లగడ్డ వీర శేఖర్ రావు, గౌరీ శంకర్ ట్రేడింగ్ కంపెనీ డైరెక్టర్, అభినయ థియేటర్ ట్రస్ట్ ట్రస్టీ గుంటుపల్లి కృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం అధ్యక్షులు రాధాకృష్ణ, మెట్రోవార్త ఎడిటర్ క్రోసూరి సుబ్బారావు, ప్రజానాట్యమండలి జిల్లా సభ్యులు వలి మాస్టర్, డా. కాకుమాను నాగేశ్వరరావు తదితరులు పాల్గొని పొనుగుపాడు గ్రామంలో 16 సంవత్సరాల నాటి పరిస్థితులు నిర్వహించడం ఎంతో శ్రమ ఖర్చుతో కూడుకున్నవి అయినా ఇన్ని సంవత్సరాలుగా నిర్వహించడం అద్భుతమైన విషయంగా వారు ప్రస్తావించారు.
అలాగే ఈ కరోన సమయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ పరిషత్ నిర్వహించడం చాలా గొప్ప విషయం అని వారు అన్నారు.
ఈ కార్యక్రమాన్ని వ్యవస్థాపకులు అభినయ శ్రీనివాస్ నిర్వహించారు.
అనంతరం నాటిక ప్రదర్శనలు జరిగాయి.
“లచిందేవి లైను తపింది” హాస్య నాటిక మొదటి ప్రదర్శన కళా నికేతన్ వీరన్న పాలెం వారి నాటిక, ‘లచ్చిందేవి లైను తప్పింది’ హాస్య నాటిక డబ్బు కోసం మనిషి ఆరాటం దానికోసం, ఎంతకు దిగజారి పోతారో తెలి యజేస్తుంది. ఈ రోజుల్లో సెల్ ఫోన్ మెసేజ్ ద్వారా ఎంతమంది మోసపోతున్నారో ఈ నాటిక తెలియచేస్తుంది. చివరకు దురాశే దుఖ్ఖమునకు చేటు అని ఈ నాటిక ప్రభోదిస్తుంది.
“అగ్నిగర్భ” నాటిక రెండవ నాటిక కళాలయ, గుంటూరు వారి ‘అగ్ని గర్భ’ అమ్మ ప్రేమ మమకారం విలువలను తెలియచేస్తూ.. నేడు జరుగుతున్న అనేక సమస్యలకు ఈ నాటిక ప్రతిబింబం. చిన్న చిన్న అపోహలతో అమ్మను వృద్ధ ఆశ్రమాలకు తరలిస్తే ఆ బిడ్డలు పడే మనోవేదనని ఈ నాటిక తెలియజేస్తుంది.
అభినయ నాటక పరిషత్-2022 ఫలితాలు:
అభినయ థియేటర్ ట్రస్ట్ నిర్వహణలో గుంటూరు జిల్లా పొనుగుపాడులో జరిగిన అభినయ నాటక పరిషత్ -2022
16వ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటికల పోటీల ఫలితాలు 2022 జనవరి 12,13,14 తేదీలలో గద్దె వెంకటేశ్వర్లు స్మారక కళావేదిక శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి ఓపెన్ ఆడిటోరియంలో జరిగిన పరిషత్ లో న్యాయనిర్ణేతలు నుసుము నాగభూషణం,గెద్ద వరప్రసాద్, మానాపురం సత్యనారాయణ గార్లు వ్యవహరించారు.
ఫలితాలు :
1.ఉత్తమ లైటింగ్ :లక్ష్మణ రేఖ దాటితే నాటిక,
2.ఉత్తమ సంగీతం: వసంతం నాటిక,
3.ఉత్తమ ఆహార్యం: సాక్షి నాటిక,
4.ఉత్తమ రంగాలంకరణ: అగ్ని గర్భ నాటిక,
5.ఉత్తమ సహాయ నటి: లక్ష్మణరేఖ దాటితే లో కుసుమ పాత్రధారిణి సురభి దీప్తి,
6.ఉత్తమ సహాయనటుడు: థింక్ నాటికలో సంతోష్ పాత్రధారి సతీష్ కుమార్,
7.ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్: వసంతం నాటికలో చంద్రశేఖర్ పాత్రధారి చెరుకూరి సాంబశివరావు,
8.ఉత్తమ హాస్యనటుడు:థింక్ నాటికలో జీలకర్ర పాత్రధారి రామకృష్ణ,
9.ఉత్తమ ప్రతినాయకులు: వసంతం నాటికలో భూషణ రావు పాత్రధారి పున్నయ్య చౌదరి,
10.ఉత్తమ నటి: అగ్ని గర్భ నాటికలో రాజేశ్వరి పాత్రధారి లక్ష్మి,
11.ఉత్తమ నటుడు: లక్ష్మణ రేఖ దాటితే నాటికలో విశ్వనాధ్ పాత్రధారి ఎస్. ఎమ్.బాషా,
12.ఉత్తమ దర్శకుడు: లక్ష్మణ రేఖ దాటితే నాటిక దర్శకుడు ఎస్. ఎమ్. బాషా,
13.ఉత్తమ రచన: థింక్ రచయిత మంజునాథ,
14.ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: మిత్ర క్రియేషన్స్, హైదరాబాద్,తెలంగాణ లక్ష్మణ రేఖ దాటితే నాటిక,
15.ఉత్తమ ప్రదర్శన:సిరిమువ్వ కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్,తెలంగాణ థింక్
-అభినయ శ్రీనివాస్
చాలా రోజుల విరామం తరువాత నాటక పోటీలు …
సంతోషం…
అభినందనలు…