‘అభినయ’ కు మరపురాని విజయం

అభినయ నాటక పరిషత్ కి గత 15 సంవత్సరాల కంటే కూడా ఈసారి మరింత కష్ట పడాల్సివచ్చింది. ఎక్కడో హైదరాబాద్ లో వుండే నేను గుంటూరు జిల్లాలో ఉన్న పొనుగుపాడు గ్రామానికి వెళ్లి అక్కడ పరిషత్ చేసి రావడమంటే సామాన్య విషయం కాదు. ప్రేక్షకులు తప్ప మిగతావి అన్నీ బయటనుండి తీసికెళ్లాల్సిందే. నేను పరిషత్ కి ముందు కేవలం 3 రోజులు మాత్రమే అక్కడ తిరిగి మిత్రులని పరిషత్ దాతల్ని కలవడం జరిగింది. కానీ మా పరిషత్ అధ్యక్షులు వంకాయలపాటి బలరామకృష్ణయ్య గారి సహకారం మరువలేనిది. అలాగే మా వెన్నంటివున్న వడ్లమూడి శివరామకృష్ణయ్య గారు, అంతే కాదు డా.మర్రి పెద్దయ్యగారు, వంకాయలపాటి సూర్యనారాయణ గారు, కొల్లి బ్రహ్మయ్య గారు, మిత్రులు గుంటుపల్లి కృష్ణారావు, క్రోసూరి సుబ్బారావు, గుంటుపల్లి రమణబాబు, వలి మాస్టర్, గుర్రం సత్యం, యర్రం చినకోటేశ్వర రావు, ముద్దా ఆంజనేయ ప్రసాద్, కొంగర మల్లిఖార్జున్ ఇంకా అనేకమంది మిత్రుల సహకారం మరువలేనిది. పరిషత్ ప్రారంభమైయ్యే రోజు మధ్యాహ్నం 2 గంటలవరకు వర్షం అందులో ఓపెన్ ఆడిటోరియం తాత్కాలికంగా ఏర్పాటుచేసిన వేదిక అనుకోకుండా వర్షం వచ్చే సమయంలో వేదికపైనున్న నేను నాతోపాటు మరికొందరు తడిసి ముద్దవడం జరిగింది. హైదరాబాద్ నుండి వచ్చిన రెండు సమాజాల వారు ఏమిచేద్దామని నావైపు చూశారు. మేము కుచ్చోనివున్న 200 మంది పట్టే చిన్న ఆడిటోరియం ఉంది. అవసరమైతే ఇక్కడే అడదాం వర్షం, వరద వచ్చిన పరిషత్ ఆగేదే లేదు. మీరు నాటిక ఆడే వెళతారని చెప్పాను.

గంటలో వర్షం తగ్గింది ఓపెన్ ఆడిటోరియంలో అక్కడక్కడ ఉన్న నీరుని తోడేశం క్రింద రాతిడస్ట్ ఉండటం వలన బురదలేదు. సాయంత్రానికి ఆ ప్రదేశమంతా నీళ్లు చల్లినట్లుగా ఉంది. తొలిరోజు విజయవంతమైంది. రెండవరోజు ఉదయమే కారుమబ్బులు కమ్ముకొచ్చి వర్షం మొదలైంది. వాతావరణ శాఖ మూడు రోజుల వర్షం చెబుతుంది.
మరలటెన్షన్.. కానీ మధ్యాహ్నం వరకు వర్షం తగ్గింది. సాయంత్రానికి ఆహ్లాదకరమైన వాతావరణం మూడవరోజు ఎలాంటి ఇబ్బందిలేదు. పొనుగుపాడులో ప్రేక్షకులకు కోదవేలేదు. కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య నాటిక పోటీలు విజయవంతంగా ముగిశాయి. కళాకారులందరికి డవ్ కండిషనర్, పేప్ సోడెంట్ మౌత్ వాష్ ఇవ్వడం జరిగింది. ప్రధమ, ద్వితీయ బహుమతులే కాకుండా 13 ఉత్తమ బహుమతులకు వెయ్యి రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. కోవిడ్ పెరుగుతున్న సమయంలో ఆర్ధికంగా సహకరించి రాలేకపోయిన అతిధుల్ని కలవడానికి పరిషత్ అయిపోయిన మరుసటిరోజు (15/01/2022)చిన్ననాటి మిత్రులు గుంటుపల్లి రమణబాబు, కొంగర శ్రీనివాసరావు, గుంటుపల్లి కృష్ణారావు, కొంగర మల్లికార్జున్ తో కలిసి నరసరావుపేట బయలుదేరాం. ముందుగా మిత్రుడు, రాజకీయ నాయకులు నల్లపాటి రామచంద్ర ప్రసాద్(రాము) నికలిసి షాల్ మెమోంటోతో సత్కరించాం. అశ్వనీ నర్సింగ్ హోమ్ డా. ఎ. రామలింగారెడ్డి గారిని, కొండవీడు ఇ.ఎన్.టి. హాస్పిటల్ డా. జగన్మోహన్ రెడ్డి గారిని, విజయ రెసిడెన్సీ కపిలవాయి విజయకుమార్ గారిని, తేజ నర్సింగ్ హోమ్ డా.బొట్ల రఘుప్రసాద్ గారిని షాల్ మెమోంటోతో సత్కరించటం జరిగింది. చివరగా పొనుగుపాడు గ్రామ వాసి మిత్రుడు, న్యాయవాది కోయ బాలాజీ శ్యామ్ ని షాల్ మెమోంటోతో సత్కరించి గ్రామానికి పయనమైయ్యం. ఆ సందర్భంగా ఈ చిత్రాలు.

-అభినయ శ్రీనివాస్

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap