తెలుగునాటరంగస్థలంపై.. ఔరా..!! ఈ రచనా చమత్కృతి ఏమియోగాని ప్రకృతి నధఃకరించుచు కురుసార్వభౌముఁడనైన నా మానసమును సైతమాకర్షించుచున్నదే!…
అంటూ రంగస్థలంపై, అడుగిడి, మయసభ, ప్రదర్శనలిస్తూ విరాజిల్లుతున్న నేటి రారాజు లందరికీ స్ఫూర్తి ప్రధాత అయి పద్యనాటక పరిమళాన్ని వెదజల్లే తన గళం…
అద్భుత హావభావ ప్రకటనా కౌశల్యంతో రంగస్థలాన్ని ఏలిన నటకేసరి, రంగస్థల రారాజు స్వర్గీయ ఆచంట వెంకటరత్నం నాయుడు గారికి, ఆయన నడయాడిన విజయవాడ నడిబొడ్డున, కృష్ణవేణీ నదీమతల్లి తీరాన, అమ్మలగన్న యమ్మ దుర్గమ్మ తల్లి నీడన, అందునా కళలకు నిలయంగా భాసిల్లుతున్న తుమ్మలపల్లి కళాక్షేత్ర ప్రాంగణంలో ఇంతటి గొప్పగా, ఆ(చంట) నటసింహం యొక్క ప్రతిరూపం అవిష్కరించబడటం..
రసజ్ఞులు రారాజుకు చేసే రాజసూయం..!!
రంగస్థల రారాజుకు సరైన నీ రాజనం…!!
ఇది కాబోతుంది అజరామరం..!!
తన గంభీర స్వరంతో.. స్పష్టమైన వాచకముతో, జంఝా మారుతీ వేగంతో, ప్రాసలతో, ప్రాంతీయ యాసలతో, పదవిన్యాసాలతో, వ్యంగోక్తులతో, చెవి మెలిపెట్టి, తొడపాశం పెట్టేటటువంటి చురకలతో, భావప్రకటనా సామర్థ్యంతో.. సుదీర్ఘ ఉపన్యాసాలతో అలరించే, ఏకైక తెలుగు బిడ్డ, బహు భాషా కోవిదుడు.. భారత మాజీ ఉపరాష్ట్రపతి (దేశానికి రాజు) గౌ. వెంకయ్య నాయుడు గారిచే రారాజు కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరపడం…
కాదా ఇది.. రాజు గారు రంగస్థల రారాజుకు జరిపే రాజసూయం..
ఈ రాజసూయానికి ఆహ్వానించబడ్డ అమాత్యులకు, మాననీయ ప్రజా ప్రతినిధులకు, నమోవాకములు..!!
ఈ రాజసూయానికి ఆహ్వానించబడి తెలుగునాట నలుమూలాల నుండి విచ్చేసే, వరిష్ట నటీనటులకు, స్వర్గీయ ఆచంటగారితో రంగస్థలాన్ని పంచుకున్న అదృష్టవంతులైన మహనీయులకు, నేటిరంగ స్ధలాన అగ్రనటీనటులుగా భాసిల్లుతున్న నటినటవరేణ్యులకు, గాయకులు, హార్మోనిస్ట్ గురువులకు, ఆచంట శిష్యులకు..
అటులనే ఈ రాజ సూయాన్ని విజయవంతం చేయడానికి ఎందరో నటులు…
నాటక సమాజ నిర్వాహకులు…
ఆచంట వారి అభిమానులు తెరవెనుక వుండి జరిపే అహర్నిశ అవిరళ కృషికి ప్రణామములు.. ఆ రంగస్థల రారాజు వారసులు.. నేటిరంగస్థల ఉగ్రరూప పాత్రల స్వరూపం.. ప్రఖ్యాత నటులు, సోదరులు బాలాజీ నాయుడు గారికి ఆశీర్వచనాలు..!! అభినందలు..!!
ఇంతటి బృహత్కార్యానికి వెన్నుదన్నుగా ఉన్న స్నేహాలయా (బొజ్జా) గౌరీ శంకర్ గారికీ, వారి మిత్రులు వెంకట్ గారికి ఇతర మిత్రబృందానికి, నా అభివాదములు..!! అభినందనలు…!!
జయహో ఆచంట…!!
నటనకు పెట్టిన కోట…!!
జయహో…!!దిగ్విజయహో..!!
–నూలు సాంబశివరావు