ఔత్సాహికులకు ‘యాడ్ ఫిల్మ్స్ మేకింగ్ ‘లో వర్క షా ప్

హైదరాబాద్ రవీంద్రభారతి లో రెండు రోజులపాటు “యాడ్ ఫిల్మ్స్ మేకింగ్ వర్క షాప్”

యాడ్ ఫిల్మ్స్ అంటేనే ఒక ఆకర్షణ, అవి సినిమాకు సమాంతరంగా ప్రచారం పొందుతున్నాయి. యాడ్ ఫిల్మ్స్ నిర్మాణంలో పాల్గొనే వారంతా కూడా ఇంటలెక్చువల్స్ అన్న భావం మీడియాలో ప్రచారంలో ఉంది. అయితే సినిమా రంగానికి ఆకర్షితులైనంతగా, యాడ్ ఫిల్మ్స్ కి ఆకర్షితులవ్వడంలేదు. యాడ్ ఫిల్మ్స్ నిర్మాణం మామూలు సినిమా నిర్మాణం లాగానే ఉంటుంది. విజయవంతమైన యాడ్ ఫిల్మ్స్ నిర్మించిన దర్శకులు, రచయితలు, కూడా సినిమా రంగానికి రెడ్ కార్పెట్ తో ఆహ్వానించబడ్డారు. యాడ్ ఫిల్మ్స్ మేకింగ్ ఒక రకంగా సినిమా రంగ ప్రవేశానికి దగ్గరి దారి అనవచ్చు. యాడ్ ఫిల్మ్స్ రంగంలో కూడా దర్శకులు, రచయితలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉంటారు. ఒక మంచి విజయవంతమైన యాడ్ ఫిల్మ్ నిర్మాణంలో పాల్గొన్న వారికి ఇతర మీడియాలో కూడా అవకాశాలు లభిస్తాయి. తెలంగాణ వచ్చిన తరువాత బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారలమ్మ జాతరల సందర్బంగా రూపొందించబడ్డ పాటల ఆల్బమ్ లు చారిత్రక ప్రదేశాల్లో నిర్మించబడ్డ డాక్యుమెంటరీలు, సినిమాలు ఇవన్నీ కూడా కళాకారులకు, సాంకేతిక నిపుణులకి ఆర్థికంగానే కాకుండా, సినిమా రంగ ప్రవేశానికి కూడా అవకాశాన్ని కల్పించాయి ఔత్సాహికులు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలని అని బాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ గారు తెలియజేసి, ఈ వర్క్ షాప్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రచయిత, దర్శకుడు విజయేద్రప్రసాద్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంలో ఇటువంటి అవకాశాలను మరింత మందికి అందించాలన్న లక్ష్యంతో ‘బాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం’ మరియు ‘జీ.యన్.ఆర్ (G.N.R)యాడ్స్ సౌజన్యంతో ఈ నెల ఆగస్ట్ 23, 24 తేదీలలో “యాడ్ ఫిల్మ్స్ మేకింగ్ వర్క షాప్”ను రవీంద్రభారతి, పైడి జయరాజ్ ప్రివ్యు థియేటర్లో సాయంత్రం 5 గం.ల నుండి 8 గం.ల వరకు నిర్వహించబోతున్నాము .
• ఈ వర్క షాప్ లో కేవలం 60 మంది ఔత్సాహికులకు మాత్రమే అవకాశం .
• ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారికి ప్రవేశం.
• మిగితా వివరాలకు మరియు రిజిస్ట్రేషన్ కొరకు 9014198366, 7661085248, 9392462676 నెంబర్లను సంప్రదించగలరు .

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap