
ఫిబ్రవరి 8, ఆదివారం రాత్రి హైదరాబాదు, బంజారా హిల్స్ ప్రసాద్ ఫిలిం ల్యాబ్ లో నిర్వహించిన కార్యక్రమంలో విశ్వేశ్వర రెడ్డి, అరుణ దంపతుల పుత్రిక ప్రవ్య ఆదిత్రి(పది సంవత్సరాల వయసు), సద్గురు ది స్కూల్ ఆఫ్ అర్ట్స్ లో పెయింటింగ్ లో శిక్షణ పొంది, నాలుగు అడుగుల ఎత్తు-ఐదు అడుగుల వెడల్పు(20 అడుగులు) గల కాన్వాస్ పై 12 నిమిషాల 44 సెకండ్ల లో శివుని పెయింటింగ్ ని చిత్రించి విశ్వగురు వరల్డ్ రికార్డు సాధించింది.
ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గా హానరబుల్ శ్రీమతి జస్టిస్ టి. మాధవి దేవి, తెలంగాణ రాష్ట్ర హై కోర్ట్ జడ్జి, గౌరవ అతిథులుగా రిటైర్డ్ ఎస్పీ శ్రీమతి ఎస్.యం. రత్న, డాక్టర్ గుండ్లురు సురేంద్రబాబు, డాక్టర్ మల్లిక్ సింగరాజు, డాక్టర్ విజయభాస్కర్, విశ్వ గురు వరల్డ్ రికార్డ్ ఫౌండర్ సీఈవో డాక్టర్ సత్య వోలు రాంబాబు, ఆ సంస్థ డైరెక్టర్ సత్యవోలు పూజిత మరియు డాక్టర్ ఏం.ఆర్.ఎస్. రాజు సమక్షంలో ప్రవ్య ఆదిత్రి తక్కువ టైంలో శివుని పెయింటింగ్ చిత్రించి అందరిని ఆశ్చర్యపరిచింది. తదంతరం అతిథులు విశ్వగురు వరల్డ్ రికార్డ్ ను చిరంజీవి కి ప్రవ్య అదిత్రి అందజేశారు.
