మోక్షజ్ఞతో ఆదిత్య 369 సీక్వెల్ ‘ఆదిత్య 999’

తనయుడు మోక్షజ్ఞతో ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ ని అనౌన్స్ చేయనున్న బాలకృష్ణ.

లెజెండరీ యాక్టర్ నందమూరి బాలకృష్ణ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు చిరునామా. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన 1991 నాటి సైన్స్ ఫిక్షన్ ‘ఆదిత్య 369’ బాలకృష్ణ ఐకానిక్ చిత్రాలలో ఒకటి. శ్రీకృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ పాత్ర ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. ఈ చిత్రం ఎవర్ గ్రీన్ క్లాసిక్‌.

ఒక ఎక్సయిటింగ్ డెవలప్మెంట్ లో డిసెంబర్ 6, 2024న ప్రసారం కానున్న Unstoppable With NBK (సీజన్ 4) ఆరవ ఎపిసోడ్ సందర్భంగా బాలకృష్ణ ఆదిత్య 369కి సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు. ఆదిత్య 999 మ్యాక్స్ పేరుతో ఈ సీక్వెల్ అఫీషియల్ గా వర్క్ లో వుంది, ఈ మోస్ట్ అవైటెడ్ టైమ్-ట్రావెల్ సాగాలో నెక్స్ట్ చాప్టర్ కోసం అభిమానుల్లో ఎక్సయిట్మెంట్ ని క్రియేట్ చేసింది.

‘ఆదిత్య 999 మ్యాక్స్‌’లో బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ లీడ్ రోల్ లో నటించనున్నారు. బాలకృష్ణ స్క్రిప్ట్‌లో నిమగ్నమై ఉన్నారు. సీక్వెల్ మోడరన్ సినిమాటిక్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తూ లెగసీని ముందుకు తీసుకెళుతోంది. ఈ సినిమాని హనుమాన్ దర్శకుడు ప్రశంత్ వర్మ డైరెక్ట్ చేయనున్నాడు.

Unstoppable With NBK అప్ కమింగ్ ఎపిసోడ్‌లో బాలకృష్ణ తన ఆదిత్య 369 అవతార్‌లో కనిపిస్తారు, సీక్వెల్ గురించి మరిన్ని వివరాలను వెల్లడించడంతో పాటు ఆదిత్య 999 మ్యాక్స్ మేకింగ్ సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్ అందిస్తుంది.

డిసెంబర్ 6, 2024న ఎపిసోడ్ ఆహాలో ప్రసారం అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap