మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని, నాణ్యమైన హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి రూపొందిన ఏకైక తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ (aha). ప్రారంభం నుంచి ప్రేక్షకులు అంచనాలకు ధీటైన కంటెంట్‌ను అందిస్తూ వారి హృదయాల్లో తిరుగులేని స్థానాన్ని దక్కించుకుంటుంది. బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్లు, షోతో ఇతర డిజిటల్ మాధ్యమాలకు “ఆహా గట్టి పోటీనిస్తోంది. తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న నాగచైతన్య ‘లవ్ స్టోరి’, అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ మోర్’, నాగశౌర్య “లక్ష్య’ చిత్రాలతో పాటు అమలాపాల్, రాహుల్ విజయ్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘కుడి ఎడమైతే’ ఆహాలోనే ప్రసారం కానుంది.
‘ఆహా’లో ప్రసారమైన ‘సామ్ జామ్’ వెబ్ షో సాధించిన తిరుగులేని విజయంతో మరిన్ని నాన్ ఫిక్షనల్ కంటెంట్ ‘ఆహా’లో ప్రేక్షకులను మెస్మైరైజ్ చేయడానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగా లక్ష్మీ మంచు హెస్ట్ చేయనున్న షో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం. ఆహాలో ప్రసారమైన ‘సామ్ జామ్’ వెబ్ షో సాధించిన తిరుగులేని విజయంతో మరిన్ని నాన్ ఫిక్షనల్ కంటెంట్ ఆహాలో ప్రేక్షకులను మెస్మైరైజ్ చేయడానికి సిద్ధమవుతోంది. అలాగే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన సూపర్‌స్టార్ రవితేజ, రానా, కార్తి, సమంత, తమన్నా, అల్లరినరేశ్, ఫహాద్ ఫాజిల్ నటించిన సూపర్ హిట్ చిత్రాలు, వెబ్ సిరీస్లైన ‘క్రాక్, సుల్తాన్, నాంది, లెవన్ అవర్, నెంబర్ వన్ యారి, ట్రాన్స్’ వంటి , డిఫరెంట్ కంటెంట్‌కు ‘ఆహా’ నిలయంగా మారింది. ఇలా ప్రతి శుక్రవారం తెలుగు ప్రేక్షకులకు సూపర్ హిట్ కంటెంట్‌ను అందిస్తోన్న ఆహా సబ్ స్క్రిప్షన్ ఏడాదికి రూ. 399 మాత్రమే.
ప్రేక్షకులకు సరసమైన విలువలోనే ఆహా తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ను అందిస్తోంది. అంతే కాదండోయ్… బ్లాక్ బస్టర్ సినిమాలను చూడాలనుకునే వీక్షకుల కోసం ఆహా జాతీయస్థాయిలో ఇతర డిజిటల్ మాధ్యమాలతో పోటీపడుతూ హక్కులను దక్కించుకుంటోంది. ఇది గీతా ఆర్ట్స్ మరియు మై హోం గ్రూప్ వారి జాయింట్ వెంచర్.