సాంస్కృతిక బంధు శ్రీ సారిపల్లి కొండలరావు గారి సారధ్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో యువకళావాహిని నిర్వహణలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ 30వ ఉభయ తెలుగు రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు 11.9.24 & 12.9.24 తేదీలలో రెండు రోజుల పాటు రవీంద్రభారతి ప్రధాన మందిరంలోను మరియు మూడవ రోజు 13.9.24 చివరి రోజున తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి లోను జరుగుతాయి. 11.9.24 వ తేదీ సాయంత్రం 5.45 గంటలకు జ్యోతిప్రకాశనం కార్యక్రమంతో ఆహ్వాన నాటిక పోటీలు రవీంద్రభారతి లో ప్రారంభమౌతాయి. సాంస్కృతిక బంధు శ్రీ సారిపల్లి కొండలరావు గారు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారు, ప్రముఖ రచయిత్రి డాక్టర్ K.V. కృష్ణకుమారి గారు, ప్రముఖ నాట్యగురు, నటి శ్రీమతి ప్రసన్నరాణి గారు జ్యోతిప్రకాశనం కార్యక్రమంలో పాల్గొంటారు. 13.9.24 న నాంపల్లి లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయములో సరిగ్గా 6.00 గంటలకు చివరి ప్రదర్శన శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరి వారిచే ‘కౌసల్యా సుప్రజా రామా’ నాటిక ప్రదర్శింపబడుతుంది.
అనంతరం సాయంత్రం 7.15 గంటలకు జరిగే బహుమతి ప్రదానోత్సవ సభలో ప్రముఖ సినీ కథానాయకులు శ్రీ సుమన్ తల్వార్ గారికి డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు అభినయ పురస్కారాన్ని ప్రదానం చేయబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు గౌరవనీయ జస్టిస్ లక్ష్మణ్ గారు హాజరౌతారు. సభాధ్యక్షులుగా రిటైర్డ్ IAS అధికారి డాక్టర్ K.V. రమణ గారు, సభాప్రారంభకులుగా సాంస్కృతిక బంధు శ్రీ సారిపల్లి కొండలరావు గారు, విశిష్ట అతిధిగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారు, ఆత్మీయ అతిథులు ప్రముఖ రచయిత్రి డాక్టర్ K.V. కృష్ణకుమారి గారు, రామరాజు ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ రామరాజు శ్రీనివాసరావు గారు, కళ పత్రిక సంపాదకులు డాక్టర్ మహమ్మద్ రఫీ గారు, నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ హరీష్ లక్ష్మణ్ గారు పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని మీరందరు మూడు రోజుల పాటు తిలకించి మీ సూచనలు, అభిప్రాయాలు తెలియజేయగలరు – ఈ కార్యక్రమాలను CULTURAL TV LIVE లో వీక్షించవచ్చు.