అల్లరి నరేష్ సెకండ్ విన్నింగ్  ‘నాంది ‘ కాబోతుందా…!

అల్లరి నరేష్ కొత్తగా కనబడుతున్నారు. కొత్త కథలతో ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తనలోని నటుడిని, ఆ నటుడిలోని వైవిధ్యాన్ని ప్రేక్షకులకి పరిచయం చేయాలనుకుంటున్నారు. ఒకవైపు ‘బంగారు బుల్లోడు’ లాంటి హిలేరియస్ ఎంటర్టైనర్-మరోవైపు ‘నాంది’ లాంటి ఇంటెన్సిటీ ఉన్న యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులని పలకరించడానికి రెడీ అవుతున్నారు. అఫ్ కోర్స్ – కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు చక్కబడిన తర్వాతే. జూన్ 30 ఆయన అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ‘అల్లరి’ నరేష్ తో చిట్ చాట్ మీ కోసం…

బర్త్ డే అంటే… కొత్త డ్రస్ వేసుకోవడమే అనేవారు మా నాన్నగారు. దానికి ప్రత్యేకత ఇచ్చేవారు కాదు. నాకు చిన్నప్పుడు బర్త్ డే అంటే చాలా సరదా ఉండేది. నాన్న అప్పుడు జంధ్యాలగారి దగ్గర కో-డైరెక్టర్ గా పనిచేసేవారు. జంధ్యాలగారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ రెండు టీమ్ లుండేవి. ఒకోసారి నాన్నగారికి నా పుట్టినరోజు టైమ్ లో వర్క్ ఉండేది కాదు. పైగా జూలైలో స్కూలు ఫీజులు కట్టాలి కాబట్టి ఇబ్బందిగా ఉండేది. అమ్మ నాకోసం స్కూల్ యూనిఫారమ్ ఒకటి కొత్తది దాచి ఉంచేది. ఆ యూనిఫారమ్ కే పసుపు బొట్టు పెట్టి, నాకు వేసి పంపించేది. అందరూ బర్త్ డే నాడు కలర్‌ఫుల్ బట్టలు వేసుకుని స్కూల్ కి వస్తుంటే నేనిలా యూనిఫారమ్ వెళ్ళడానికి ఏడ్చేవాడిని.
బర్త్ డేనాడు డెత్ సీన్… 2002 నుంచి షూటింగ్ లో బర్త్ డే చేసుకోవడం అలవాడు అయింది. 14 బర్త్ డేలు సెట్లోనే అయ్యాయి. ‘గమ్యం’లో నా డెత్ సీన్ బర్త్ డే రోజు తీశారు. మనకి పనే కదా ముఖ్యం! అయినా బర్త్ డే అంటే పర్టిక్యులర్ సెలబ్రేషన్స్ ఉండవు, మార్నింగ్ సెట్లో కేక్ కట్ చేయడం, ప్యాకప్ తర్వాత కొందరు ఫ్రెండ్స్ తో చిన్న పార్టీ అంతే!
‘బంగారు బుల్లోడు’ టైటిల్ అందుకే పెట్టాం !
‘బంగారు బుల్లోడు’ సినిమా విషయానికొస్తే ఇది విలేజ్ లో జరిగే కామెడీ.బంగారపు ఆభరణాలు తయారు చేసేవాడి క్యారెక్టర్ నాది. ఆ గోల్డ్ చుట్టూ తిరిగే కథ. చాలా టైటిల్స్ అనుకున్నాం. నిజానికి ‘బాబు బంగారం’ కరెక్ట్ టైటిల్. కానీ ఇప్పటికే వచ్చేసింది. అందుకే ‘బంగారు బుల్లోడు’ అనే టైటిల్ మాట్లాడుకుని పెట్టాం. అనిల్ సుంకర గారి సినిమా అంటే రీమిక్స్ సాంగ్స్ మస్ట్. బాలకృష్ణగారు, రలీనా టాండన్ గారు చేసిన ‘స్వాతిలో ముత్యమల్లే సాంగ్ రీమిక్స్ చేశాం.
కామెడీ ట్రెండ్ మారింది.. ఇంతవరకు నేను 55 సినిమాలు చేస్తే అందులో 90శాతం కామెడీ సినిమాలే! ఇదివరకు కోట శ్రీనివాసరావుగారు బాబుమోహన్ గారిని తంతే జనం నవ్వేవాళు * ఇప్పుడలా కుదరదు. ఇప్పటి ఆడియెన్స్ క్లీన్ కామెడీ ఇష్టపడుతున్నారు. చాలా సెన్సిటివ్ గా మారారు. మా నాన్నగారు ఒక మాట చెప్పేవారు. ‘కథలో కామెడీ ఉండాలి కానీ – కామెడీ కోసం కథ రాయకూడదు’ అనేవారు. ఇప్పుడు కరోనా గురించి కూడా మిమ్స్ వచ్చేస్తున్నాయి. వాట్సాప్లో, సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఆ మారిన ట్రెండ్ కి అనుగుణంగా ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ రావాలి. రైటింగ్ బడ్జెట్ పెంచాలి కామెడీ సినిమాకి ఒక్క రైటర్ రాసింది సరిపోదని నా ఫీలింగ్. నాన్నగారు కూడా ఏడెనిమిది రైటర్స్ తో రాయించి, ఫైనల్ వెర్షన్ తాను రెడీ చేసుకునేవారు. అందరికీ క్రెడిట్ ఇచ్చేవారు. డబ్బులు ఇప్పించేవారు. ఇప్పుడు రైటర్స్ సోలో క్రెడిట్ కావాలి. మరో రచయితతో పంచుకోం అంటారు. అంతేకాదు – 6 కోట్ల సినిమా బడ్జెట్ కి 25 లక్షల రూపాయలు కూడా రైటింగ్ టీమ్ కి ఖర్చు పెట్టడం లేదు. ఒక సినిమా బడ్జెట్లో కనీసం పదిశాతం అయినా స్క్రిప్ట్ – రైటింగ్ టీమ్ కి ఖర్చు పెట్టాలి. రైటర్లకి ఇవ్వాల్సినంత గౌరవం, క్రెడిట్స్, రెమ్యూనరేషన్ ఇస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయి.

‘నాంది ‘  కొత్త మలుపు… నేను బీభత్సమైన యాక్షన్ సినిమాలు చేయను. చేస్తే ఎవరూ చూడరు. ‘నాంది. యాక్షన్ పార్ట్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. వన్ టు వన్ ఫైగా ఉంటుంది. ఇదివరకు ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’ లాంటి సినిమాలు చేశాను. ‘నాంది” డైరెక్టర్ విజయ్ నా దగ్గరికి వచ్చి కథ చెప్పినప్పుడు – ఇంత సీరియస్ ఇంటెన్సిటీ ఉన్న కథ నాకు చెప్పావేంటి అన్నాను. ‘మహర్షి చూసిన తర్వాత మీరే ఈ క్యారెక్టర్కి బాగుంటారనిపించింది అన్నాడు విజయ్. కథ కూడా నాకు బాగా నచ్చింది. నాన్నగారి పేరు కూడా ముఖ్యం! మా నాన్నగారి బేనర్ ఇ.వి.వి. సినమా మీద ప్రయోగాలు చేయను. నాకోసం వాడుకోను. జవివి సినిమా బేనర్‌లో సినిమా అంటే మా ఫ్యామిలీ వెల్ విషర్స్ అందరూ నాన్నగారి స్టయిల్ లో ఉండాలి అని చెబుతుంటారు. డబ్బు ఒక్కటే కాదు నాన్నగారి పేరు కూడా ముఖ్యం! కామెడీ సినిమాలు హ్యాండిల్ చేయడం అంత సులభం కాదు. చాలా మందికి భయం. సొంత బేనర్ లో కామెడీ సినిమాలే చేస్తాను. అలాంటి కథల కోసమే వింటాను.

ఇప్పటి వరకు నటించిన 55 సినిమాలలో వినోదాన్ని పండించిన అల్లరి నరేష్ ఇకపై వినోదంతో పాటు ఉద్వేగభరితమైన కథాకథనాలను అందించాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది 64కళలు.కాం పత్రిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap