రాజమండ్రిలో ‘అల్లు’ కాంస్య విగ్రహం

అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి

రాజమండ్రిలో శుక్రవారం(01-10-21) ‘అల్లు రామలింగయ్య 100వ జయంతి’ సందర్భంగా స్థానిక ‘అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాల’లో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల నూతన భవనం కోసం చిరంజీవి రూ.2 కోట్లు నిధులను కేటాయించారు. అల్లు అరవింద్‌ ఆర్ధిక సహకారంతో అల్లు రామలింగయ్య విగ్రహాన్నిఏర్పాటు చేసారు. అల్లు కుటుంబసభ్యులు, మాజీ ఎంపి మురళీమోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. రాజమండ్రితో తనకు అనుబంధం ఉందని, అసలు తను తొలిగా మేకప్‌ వేసుకుందే రాజమండ్రిలో అని పేర్కొన్నారు.’అల్లు రామలింగయ్యకు, నాకు గురు శిష్యుల అనుబంధం ఉంది. అల్లు రామలింగయ్య బహుముఖ ప్రఙ్ఞాశాలి. నటుడిగా కొనసాగుతూనే ఆయన హోమియోపతిపై పట్టు సాధించారు. నిత్య విద్యార్థిలానే అల్లు రామలింగయ్య ఎంతో కష్టపడ్డారు. ఎంతో మంది సేవ చేశారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కోట శ్రీనివాసరావు, మురళీ మోహన్‌ వంటి సినీ ప్రముఖులు సహా ఎంతోమందికి ఆయన చికిత్స అందించారు.
ఓసారి నేను కడుపునొప్పితో బాధపడుతుంటే ఆయన హోమియోపతి చికిత్సతో దాన్ని పూర్తిగా నయం చేశారు. ఇంతవరకు నాకు మళ్లీ ఆ సమస్య ఎదురుకాలేదు. ఇప్పటికీ నాతో పాటు నా పిల్లలు, వాళ్ల పిల్లలు కూడా హోమియోపతిని ఫాలో అవుతున్నాం’ అని చిరంజీవి పేర్కొన్నారు.
రాంబాబు ఏ.

SA: