అల్లూరి తైలవర్ణ చిత్రకళా ప్రదర్శన

జూలై 4న అల్లూరి 125వ జయంతి సందర్భంగా ‘తైలవర్ణ చిత్రకళా ప్రదర్శన’ను ప్రారంభించిన ఎంపి మార్గాని భరత్ రామ్.

‘విప్లవజ్యోతి’ అల్లూరి సీతారామరాజు 27 సం.రాల ప్రాయంలో వీరమరణం పొందగా, అందులో 13 సం.రాలు రాజమహేంద్రవరం గోదావరి గట్టు ప్రాంతంలో నివశించి, ఇక్కడే మున్సిపల్ పాఠశాలలో చదువుకోవడం, ఆ కాలంలోనే పుష్కరాల రేవు వద్ద నిర్మాణమైన పాతరైలు వంతెన (హేవలాక్ బ్రిడ్జి)కు అల్లూరి పేరు పెట్టడానికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసువెళ్ళగలనని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు, వైసిపి పార్లమెంట్ చీప్ మార్గాని భరత్ రామ్ అన్నారు. శుక్రవారం జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం, మాదేటి రాజాజీ ఆర్డు అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన అల్లూరి 125వ జయంతి వారోత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరంలోని దామెర్ల ఆర్డు గ్యాలరీలో ఏర్పాటుచేసిన అల్లూరి జీవిత తైలవర్ణ చిత్రకళా ప్రదర్శనను పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపి భరత్ రామ్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ రాజమహేంద్రవరం కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసే విధంగా పాతరైలు వంతెనను రహదారి మార్గంగా అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే ధవిళేశ్వరంలో సుమారు రెండు ఎకరాల భూమిలో భారీ ఎత్తున అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేసి అందులో రాజమహేంద్రవరం చరిత్రకు సంబంధించిన దామెర్ల ఆర్డు గ్యాలరీ, రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం, కాటన్ మ్యూజియం ఇతర ప్రధానమైన చరిత్రకు సంబంధించినవన్నీ ఒకే చోట నిక్షిప్తం జరిగేటట్లు ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఎంపి భరత్ రామ్ అల్లూరి చిత్ర ప్రదర్శనతోపాటు దామెర్ల ఆర్డు గ్యాలరీలో వున్న చిత్రాలను తిలకించడం జరిగింది. మరో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాజమహేంద్రవరం రూరల్ వైసిపి కో-ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు రాజమహేంద్రవరం మున్సిపల్ పాఠశాలలో చదువుకోవడం నగరానికే గర్వకారణమన్నారు.

Art Exhibhition

జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ అల్లూరి చరిత్ర ఇనుమడించే విధంగా పాతరైలు వంతెనకు గాని, రాజమహేంద్రవరం విమానాశ్రయానికిగాని అల్లూరి పేరు పెట్టాలని, పార్లమెంట్ లో అల్లూరి విగ్రహం ఏర్పాటుకు కృషిచేయాలని ఎంపి భరత్ రామ్ ను కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అల్లూరి జీవిత తైలవర్ణ చిత్రాల ప్రదర్శనను మాదేటి రాజాజీ ఆర్డు అకాడమీ వ్యవస్థాక ప్రధాన కార్యదర్శి మాదేటి రవిప్రకాష్ ఎంపి భరత్ రామ్ కు చూపించి, వాటి కోసం వివరించారు. ఈ సందర్భంగా ఎంపి భరత్ రామ్ మాదేటి రవిప్రకాషను ప్రత్యేకించి అభినందించారు. ఈ సందర్భంగా ఎంపి భరత్ రామ్, చందన నాగేశ్వర్, పడాల వీరభద్రరావులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం కోశాధికారి బళ్ళా శ్రీనివాస్ (మయూరి శ్రీను), ఉపాధ్యక్షులు పుచ్చల రామకృష్ణ, ప్రభుత్వ పాలిటిక్నికల్ కళాశాల ప్రిన్సిపాల్ వంకా నాగేశ్వరరావు, చిత్రకారుడూ, రచయిత వెంటపల్లి, గంగరాజు, సీత, ఎ.బి. కృష్ణశర్మ, వైసిపి నాయకులు పోలు విజయలక్ష్మి, మజ్జి అప్పారావు, కానుబోయిన సాగర్, మారిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జూలై 2 నుండి 4 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది.

Alluri Sitaramaraju art exhibhition- artist K.S. Vas
Alluri 125 th Birthday artist Uday Kumar
artist Vempatapu
artist Tara Nagesh
SA: