-ఢిల్లీలో లలిత కళా అకాడమీలో అల్లూరి ఆర్ట్ ఎగ్జిబిషన్ ను కిషన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు.
-“అజాది అమృతోత్సవం“లో అల్లూరి సాహస గాథలకు రూపమిచ్చిన 18 మంది తెలుగు చిత్రకారుల చిత్రాల ప్రదర్శన.
అల్లూరి సీతారామరాజు, కొమురం భీం వంటి వీరులకు తగిన ప్రాధాన్యత దక్కలేదని, వారికి తగిన గౌరవం దక్కేలా చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 1947లో దేశంలోని చాలా ప్రాంతాల్లో స్వాతంత్ర్యవేడుకలు జరిగాయని, అయితే తెలంగాణ మాత్రం మరో ఏడాదిపాటు స్వాతం త్ర్యం కోసం ఎదురు చూడాల్సి వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో మూడు రంగుల జెండాను ఎగురవేయడానికి ఎవరైనా ప్రయత్నస్తే.. నిజాం సైన్యం వారిని తుపాకీ గుండ్లకు బలిచేసేదని చెప్పారు. స్వాతంత్ర్యం కోసం ఆనాడు తెలంగాణలో జరిగిన వీరగాథలు, రజాకార్ల అకృత్యాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
75 ఏండ్ల స్వాతంత్ర్య వేడుకల్ని పురస్కరించుకొని ఆదివారం ఢిల్లీలో లలిత కళా అకాడమీ, నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ (ఎస్ఎంఏ) నిర్వహించిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజుకు అంకితమిస్తూ, విప్లవకారుల పేరిట ‘కథా క్రాంతి వీరోంకి’ పేరుతో షాహిది దివాస్, చంపారన్ సత్యాగ్రహ, జలియన్ వాలాబాగ్ పై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎస్ఎంఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మాన్యుమెంట్ ఆఫ్ విక్టరీ అండ్ వాలోర్’ ఫొటో ప్రదర్శనను ఆవిష్కరించారు. ఈ ప్రదర్శనలో వరంగల్‌లోని కాకతీయ కళాతోరణం, 1857 స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీష్ వాళ్లపై పోరాడి శౌర్యానికి ప్రతీకగా నిలిచిన ఝాన్సీ లక్ష్మీబాయి కోట, మహ్మద్ ఖిల్జీ నేతృత్వంలో సుల్తాన్లపై సాధించిన విజయానికి గుర్తుగా ఉన్న విజయస్థంభాన్ని ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సహాయ మంత్రులు అర్జున్ మేఘావాల్, మీనాక్షి లేఖి, లలిత కళా అకాడమీ చైర్మేన్ డా. ఉత్తం పచారే, లలిత కళా అకాడమీ కార్యదర్శి వి. రామకృష్ణ, ఆంధ్ర ప్రదేశ్ నుండి మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ అధ్యక్షులు భూతి మధుసుధనరావు, వ్యవస్థాపక కార్యదర్శి మాదేటి రవి పాల్గొన్నారు.
ప్రదర్శన ఏర్పాటులో మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపక కార్యదర్శి మాదేటి రవి ప్రకాష్ కృషి మెచ్చుకోతగ్గది. ఐదు రోజులపాటు ఈ ప్రదర్శన కొనసాగుతుంది.
-కళాసాగర్
ఈ చిత్ర ప్రదర్శన పాల్గొనే చిత్రకారులు:
పి.ఎస్. ఆచారి, రాజమహేంద్రవరం
ఎన్.ఎస్. శర్మ, రాజమహేంద్రవరం
ఎస్. విజయకుమార్, హైదరాబాద్
వై. సుబ్బారావు, రాజమహేంద్రవరం
యం. ఉదయ్, పాలకొల్లు
తారా నగేష్, రాజమహేంద్రవరం
కె.ఎస్. వాసు, భీమవరం
వెంపటాపు, తణుకు
కె. నూకరాజు, రాజమహేంద్రవరం
టి.వి, విజయవాడ
నడిపల్లి శ్రీధర్, విజయవాడ
ఎన్.వి.పి.యస్.యస్. లక్ష్మి, రాజమహేంద్రవరం
కె. రాజు, రాజమహేంద్రవరం
డా.పి. బాపిరాజు, రాజమహేంద్రవరం
హంపి, రాజమహేంద్రవరం
జి. దుర్గారావు, రాజమహేంద్రవరం
తాడోజు కిరణ్, రాజమహేంద్రవరం
యం. రవిప్రకాష్, రాజమహేంద్రవరం
Inspirble art and history exhibition
Nice article.
బ్రిటిష్ వారి నెదిరించి పోరాడిన స్వాతంత్ర సాయుధ పోరాట యోధుల్లో అద్వితీయుడు మన* అల్లూరి సీతారామరాజు *ఈ చిత్రకళా ప్రదర్శనలో పాల్గొన్న మన చిత్రకారులు అభినందనీయులు. 👌👍🙏🇮🇳Bomman