అల్లూరి 127వ జయంతోత్సవం

కృష్ణదేవిపేటలో అల్లూరి జయంతి సందర్భంగా ‘అల్లూరి చిత్రకళా మందిరం ప్రారంభోత్సవం’

‘విప్లవజ్యోతి’ అల్లూరి సీతారామరాజు 127వ జయంతోత్సవం మరియు అల్లూరి చిత్రకళా మందిరం ప్రారంభోత్సవం జూలై 4వ తేదీ కృష్ణ దేవిపేట, అల్లూరి సీతారామరాజు స్మారక పార్క్ లో అల్లూరి చిత్రకళా మందిరాన్ని ఆంధ్రపదేశ్ శాసన సభాపతి, చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు, సి.ఎం. రమేష్ గారు, గాజువాక శాసనసభ్యులు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. సభాధ్యక్షులుగా జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు గారు వ్యవహరించగా, కార్యక్రమాన్ని మాదేటి రాజాజీ మెమోరియల్ ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి మాదేటి రవిప్రకాష్ గారు నిర్వహించారు. పడాల వీరభద్రరావు గారు చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా యస్.పి., ఎం.ఎల్.సి. పాల్గొన్నారు.

ఈ సభలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు గారు ఆరోజుల్లో దేశంకోసం తన జీవితాన్ని త్యాగం చేసి బ్రిటీష్ వారితో పోరాడి దాస్య శృంఖలాల విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన యోధుడిగా అల్లూరిని అభివర్ణించారు. లంబసింగి ని టూరిస్ట్ స్థలంగా అభివృద్ధి చేసి, అక్కడకు వచ్చిన యాత్రికులను కృష్ణదేవి పేటకు తీసుకు వస్తే ఈ పార్క్ అభివృద్ధి చెందుతుందని సలహానిచ్చారు. పార్కు అభివృద్ధికి స్పీకర్ గా తన వంతు సహకారం అందిస్తానని మాట ఇచ్చారు.

-కళాసాగర్ యల్లపు

మాదేటి రాజాజీ మెమోరియల్ ఆర్ట్స్ అకాడమీ: సుప్రసిద్ధ చిత్రకారుడు, ఒక మహోన్నత చిత్రకారుని కీర్తి సంపదను పదుగురికి పంచాలనుకొన్న యోచనాపరుడు. గురువు వరదా వెంకటరత్నం గార్కిఇచ్చిన మాట కోసం కృషి సల్పిన దక్షకుడు. దామెర్ల రామారావు మెమోరియల్ ప్రభుత్వ ఆర్ట్ గ్యాలరీ మరియు స్కూలు ప్రిన్సిపాల్ మాదేటి రాజాజీ ఉద్యోగిస్తు 10 జూలై 1990లో చనిపోయాక మిత్రుల దగ్గర, శిష్యుల దగ్గర పోటీల కొరకు పంపిన అనేక చిత్రాలను శ్రమనోర్చి సుమారు 70 చిత్రాలను సేకరించి మాదేటి రాజాజీ మెమోరియల్ ఆర్ట్స్ అకాడమీ పేరున 1993 నుంచి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. తెలుగుజాతి ఔన్నత్యాన్ని, తెలుగువారి కీర్తిని, తెలుగు వారి ప్రతాప పౌరషాన్ని తేటతెల్లం చేయటానికి విద్యార్థుల కోసం చరిత్ర తెలియని ప్రజల కోసం “పోరు పతాక అల్లూరి – శౌర్య ప్రతీక అల్లూరి” శీర్షికన 2018 నుంచి 2019 సంవత్సరం వరకు 18 చిత్రకారులతో అల్లూరి సీతారామరాజు ఉద్యమ ఘట్టాలను 4″×3” అడుగుల సైజులో కేన్వాసు పెయింటింగ్స్ చిత్రీకరించడం జరిగింది. అల్లూరి 121 జయంతిని పురస్కరించుకుని 2021లో విజయవాడ మధు మహాలక్ష్మి హాలులో ఎంపి గోపరాజు గంగరాజు ప్రారంభించారు. ఆ తర్వాత రాజమండ్రి, అల్లూరి పితూరి ఉద్యమ ప్రాంతాలైన రాజవొమ్మంగి, కృష్ణదేవిపేట, తదితర ప్రాంతాల్లో ప్రదర్శించడం జరిగింది. సుమారు ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఈ చిత్రాలు రూపొందించడం జరిగింది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయంలో లక్షా యాభై వేల రూపాయలు గ్రాంటు అయినప్పటికి అ తర్వాత ఎలక్షన్ కోడ్ కారణంతో అవి శాంక్షన్ కాలేదు. తదుపరి వచ్చిన ప్రభుత్వం ఆ ఊసును మరి తేలేదు. వైకాపా ప్రభుత్వం టిడిపి నాయకుల్ని కార్యకర్తలతో పాటు కళాసంస్థల్ని కళాకారుల్ని ఇబ్బంది పెట్టింది. కల్చరల్ డిపార్టుమెంటు నుంచి రావలసిన పెండింగ్ బిల్లులు కూడా మంజూరు చేయలేదు. కళల్ని ప్రోత్సహించే మన ప్రభుత్వం పాత బకాయలు చెల్లించాలని మా అభ్యర్ధన. ‘అజాదీ కా అమృత మహోత్సవం’ 75 ఏళ్ళ భారత సంగ్రామ చరిత్రలో ఒక నూతన అధ్యాయనం సృష్టించుకున్న తెలుగు పౌరషాన్ని న్యూఢిల్లీ లోని కేంద్ర లలిత కళా అకాడమీలోని ఆర్టు గేలరీలో అల్లూరి పోరాట ఘట్టాల దృశ్యాలను నలభై రోజుల పాటు ప్రదర్శించారు. లలిత కళా అకాడమీ ఏర్పడిన యాభై ఏళ్ళ చరిత్రలో తెలుగు వారికి దక్కిన అపురూప అవకాశం ఇది. దానిని కేంద్ర సమాచారశాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి ప్రోద్బలంతో నిర్వహించడం జరిగింది. హైద్రాబాద్లో క్షత్రియ సంఘం ఆద్వర్యంలో జరిగిన అల్లూరి 125 జయంతి ముగింపు ఉత్సవంలో అల్లూరి పోరాట ఘట్టాల చిత్రాలను భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ము ఆదంత్యం తిలకించి ప్రశంసలు కురిపించారు. ఏర్పాటు చేసిన ప్రతి ప్రదర్శన జన హార్షంతో విశేష అభిమానాన్ని కనపర్చారు.

సౌత్ జోన్ కల్చర్ సెంటర్ తంజావూరు 2022 లో నిర్వహించిన రాష్ట్రీయ సంకీర్తి మహోత్సవం రాజమండ్రి, హైద్రాబాద్ లో జరిగింది.
రాజమండ్రి లో ఏపి గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారు ప్రారంభించగ హైద్రాబాద్ లో ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు ప్రదర్శన ప్రారంభించి తిలకించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్లు శ్రీ బండారు దత్తాత్రేయులు గారు, శ్రీమతి తమిళసై, మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.

2022 గిరిజన సంస్కృతిక పరిశోధన మరియు శిక్షణ సంస్థ – విశాఖ వారు నిర్వహించిన గిరిజన గౌరవ దినోత్సవ ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఉపముఖ్యమంత్రి రాజన్నదొర ప్రారంభించారు.
అలాగే మన్యం పితూరి ప్రారంభించి వందేళ్ళ అయన సందర్భంలో పోస్టల్ శాఖ వారు ఆరు ప్రత్యేక కవర్లు ముద్రించగ అందులో నాలుగు ప్రత్యేక కవర్లను మా అనుమతితో మా చిత్రాలను ముద్రించడం జరిగింది.

కృష్ణదేవిపేట అల్లూరి స్మారక పార్కులో చిత్రకళా మందిరాన్ని జూలై 4 న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రారంభిస్తారు. ఈ చిత్రకళా మందిరంలో 18 చిత్రకారులు చిత్రించిన ఒరిజనల్ చిత్రాలకు నకలు 18”x24”అంగుళాల ఫోటో ప్రింట్లను మాదేటి రాజాజీ ఆర్టు అకాడమీ శాశ్వతంగా భద్రపరచటానికి బహుకరిస్తుంది.

గిరిజన సంస్కృతిక పరిశోధన మరియు శిక్షణా సంస్థ – విశాఖపట్నం వారు కేంద్ర ప్రభుత్వ నిధులతో లంబసింగులో నిర్మిస్తున్న గిరిజన సాంప్రదాయ సామాగ్రి మ్యూజియంలో ప్రదర్శించటానికి 9 చిత్రాలను ఒరిజనల్ చిత్రాలను అకాడమీ నుండి విక్రయించడం జరిగింది.

-మాదేటి రవిప్రకాష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap