అమరావతి లో ‘అంతర్జాతీయ కవి సమ్మేళనం ‘

అమరావతి అంతర్జాతీయ కవి సమ్మేళనం-2020 కు ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభించిన మండవ, శివనాగిరెడ్డి.
మాలక్ష్మి గ్రూప్, కల్చరల్ సెంటర్ అఫ్ విజయవాడ, అమరావతి (CCVA) సంయుక్త ఆధ్వర్యంలో 2020 డిసెంబర్ 19, 20 తేదీల్లో జరిగే అమరావతి అంతర్జాతీయ కవి సమ్మేళనం-2020కు నమోదు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, మాలక్ష్మి గ్రూపు సంస్ధల సీఈవో సందీప్ మండవ విజయవాడ సిసివిఏ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సిసివిఏ గత ఐదేళ్లుగా విజయవాడలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బహుభాషా కవి సమ్మేళనానికి దేశవిదేశాల నుంచి అనూహ్య స్పందన లభించటంతో పాటు వరుసగా లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ ను కూడా సొంతం చేసుకొందని కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలియిజేసారు. దేశ విదేశాలలోని బహుభాషా కవులు నవంబర్ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకొని కవితలను పంపవచ్చని తెలిపారు. మాలక్ష్మి గ్రూపు సంస్ధల సీఈవో సందీప్ మండవ మాట్లాడుతూ కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ విడత ఆన్ లైన్ వీడియో కాన్ఫరెన్స్ విధానంలో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రచయితల నుండి వచ్చిన కవితల్లో 100 ఉత్తమ కవితల్ని ఎంపిక చేసి ఆయా కవులను అంతర్జాతీయ కవి సమ్మేళనంలో తమ కవితలను వినిపించటానికి ఆహ్వానిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న కవులు “సిసివిఏ.ఇన్” లో లాగిన్ అయ్యి తమ పూర్తి వివరాలను నమోదు చేయటం ద్వారా అమరావతి అంతర్జాతీయ కవి సమ్మేళనం -2020లో పాల్గొనాల‌ని తెలిపారు. మాలక్ష్మి సంస్ధ సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపడుతుందని పేర్కొన్నారు.

ఆసక్తి ఉన్న కవులు https://ccva.in/ లో లాగిన్ అయ్యి తమ పూర్తి వివరాలను నమోదు చేసుకొవచ్చు.

2 thoughts on “అమరావతి లో ‘అంతర్జాతీయ కవి సమ్మేళనం ‘

  1. మంచి కార్యక్రమం.
    అభినందనలు అందుకోండి
    శ్రీలక్ష్మి చివుకుల విజయనగరం

  2. Sir, ceva link registration form is not working properly, it very difficult and time taking, and at the end it is showing error.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap