‘అందాల రాముడు ‘ కి 47 ఏళ్ళు

పాత తరం తెలుగువారికి ఓ మాయా బజార్..మిస్సమ్మ.. గుండమ్మకథ
మొదలైన సినిమాలు ఎంత ఇష్టమో..నట సమ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు సినిమా కూడా అంతే ఇష్టం..బాపు..రమణల నుంచి మరో వినోదాత్మక చిత్రం. 1973 సెప్టెంబర్ 12న విడుదలయింది అందాల రాముడు చిత్రం. ఈ ఏడాదికి 47 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. బుద్ధిమంతుడు తర్వాత అక్కినేని.. బాపు… రమణల కాంబినేషన్ లో వచ్చిన సినిమా అందాలరాముడు. ఓ రైలు బోగీలో ప్రయాణించే రకరకాల ప్రయాణీకుల కథలతో ముళ్లపూడి వెంకటరమణ రాసిన జనతా ఎక్స్ ప్రెస్ ఆధారంగా రైలు బోగీలు.. మూడుస్థాయిల బోట్లతో అందాల రాముడు కథ రాశారు రమణ. ఈ సినిమా షూటింగ్ కోసం బోట్లు సపరేట్ గా డిజైన్ చేయించి రెడీ చేశారు. ఆ బోట్లలోనే అధికశాతం షూట్ చేశారు. వాడికి బాగా డబ్బు చేసింది.. యజమానికి తల బద్ధకం ఇలాంటి అద్భుతమైన మాటలు ముళ్ళపూడి రాశారు.

ఆ సినిమా ప్రభావం చాలా మంది ఫిలిం మేకర్స్ మీద ఉంది. కథాపరంగా సంబంధం లేకపోయినా గోదావరిలో పడవల నేపథ్యంలో శేఖర్ కమ్ముల.. గోదావరి సినిమా రూపొందించారు. అలాగే అందాల రాముడులో అల్లు రామలింగయ్య పాత్రని అక్కినేని తీ.తా. అని ఏడ్పిస్తుంటారు. తీ. తా. అంటే తీసేసిన తాసిల్దార్. అంతేకాదు అల్లు పాత్ర పడవ ఆగిన ప్రతిచోటా ఊళ్ళోవాళ్ళకి అయిదు రూపాయిలు ఇచ్చి, వందరూపాయల చిల్లర పట్టుకురమ్మంటాడు. ఈ ట్రాక్ బల్సా.. సినిమాలో పవన్ కళ్యాణ్… బ్రహ్మానందం ట్రాక్ ని లన్ స్పైర్ చేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అక్కినేని నాగేశ్వరరావు తనకి గుండెకి సంబంధించిన ఇబ్బంది ఉందని గుర్తించారు. లత బోటు చివరన కూర్చుని ఉంటే అక్కినేని నీళ్ళల్లో దూకుతారు. ఈదుతున్నప్పుడు..గుండె బరువుగా అన్పించడంతో అక్కినేని తర్వాత పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స చేయించుకున్నారట.

మొదట విడుదలయినప్పుడు ఈ సినిమా అంతగా ఆదరణ పొండలేదు. బాపు రమణలు వాళ్ళ మీద వాళ్ళే తిరగబడ్డ బోటు బొమ్మతో కార్టూన్లు వేసుకుని సినిమా పట్ల సిటీ చేశారు. విడుదలయిన చాలా రోజుల తర్వాత సినిమా పికప్ అయింది చాలా సెంటర్లలో వందరోజులు ఆడింది. అందాలరాముడు సినిమా కథ సినిమా నవలగా కూడా అప్పట్లో వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ లత.. హీరో అక్కినేని కులు వెదుక్కుంటూ వచ్చే సీన్ ముళ్ళపూడి జీవితంలో జరిగిన యదార్థ సంఘటన, దాగుడు మూతలు సినిమాతో ముళ్ళపూడి వెంకటరమణకి రచయితగా తొలి అవకాశం ఇచ్చిన ముళ్ళపూడి రచయితగా విడుదల అయిన మొదటి సినిమా రక్తసంబంధం నిర్మాత డి.బి. నారాయణ.. ముళ్ళపూడి వెంకట రమణని వెదుక్కుంటూ వచ్చిన సంఘటనే అక్కినేని.. లతల మధ్య వచ్చిన సన్నివేశం అయింది. ముళ్ళపూడి సృష్టించిన అప్పుల అప్పారావు పాత్ర వెండి తెరపై తగుక్కుమంది ఈ సినిమాలోనే. రాజబాబు అప్పుల అప్పారావు పాత్రని అద్భుతంగా ఆవిష్కరించారు. అలాగే అద్భుతమైన నటుడు. స్వర్గీయ నూతన్ ప్రసాద్ తొలిసారి నటించింది కూడా అందాల రాముడు సినిమాలోనే స్క్రీన్ పై వరపరసాద్ గా పేరు కనబడుతుంది. ఆ తర్వాత ఆయన నూతన్ ప్రసాద్ గా పేరు మార్చుకున్నారు.. అక్కినేని.. లతలతో నాగభూషణం. .రాజబాబు.. ధూళిపాడ.. వరప్రసాద్(నూతన్ ప్రసాద్), సూర్యకాంతం.. రావికొండలరావు.. రాధా కుమారి.. కె.వివేకానందమూర్తి నటించారు. అందాల రాముడు సినిమా కాలం గడిచే కొద్దీ క్లాసిక్ సినిమాల్లో ఒకటి గా నిలిచింది.

SA: