ఆంధ్రప్రదేశ్ చిత్ర, శిల్పకారుల పరిచయాలతో ఆంధ్ర కళాదర్శిని (Art of Andhra Pradesh).
తెలుగు చిత్ర, శిల్పకళకు వేల సంవత్సరాల చరిత్ర వున్నట్లు ఆనాటి ఆనవాళ్ళు సాక్ష్యంగా నిలబడినా… అందుకు లభిస్తున్న చారిత్రక ఆధారాలు బహు తక్కువ.
ఒక జాతి సంస్కృతి, సంప్రదాయాలను ఒక తరం నుండి తర్వాత తరానికి అందించేవి వారి భాష, సాహిత్యం, కళలు మాత్రమే. అందులో చిత్ర, శిల్పకళలు ప్రధాన భూమికను పోషిస్తాయి. విద్య-విజ్ఞాన సముపార్జనకు తోడ్పడితే, కళ జీవితాన్ని సౌందర్యమయం చేస్తుంది. విద్యకు కళకు ఉన్న తేడా అదే….
ఆధునిక, సాంప్రదాయ చిత్రరీతుల్ని సమన్వయించి, ఆధునికాంధ్ర చిత్రళకు ప్రాణంపోసిన మహాచిత్రకారుడు దామెర్ల రామారావు రాజమహేంద్రవరంలో చిత్రకళాశాలను నెలకొల్పిన నాటి నుండి తెలుగు నేలపై చిత్రకళా పునరుజ్జీవనం ప్రారంభమయ్యిందని చెప్పవచ్చు.
వేల మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో ప్రారంభమవుతుంది అంటారు. అలా రెండు దశాబ్దాల క్రితం 2001, 2004 సంవత్సరాలలో ఆంధ్ర కళాదర్శిని పేరుతో ప్రచురించిన సమకాలీన చిత్ర, శిల్పకారుల పరిచయ గ్రంథం నేటికీ కళాకారుల కరదీపికగా నిలిచింది.
సమకాలీన చిత్ర, శిల్పకళను పదిలపరిచే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మరోసారి నివాస, ప్రవాస ఆంధ్రప్రదేశ్ కళాకారుల చిత్రాలు, పరిచయాలతో ప్రచురించనున్న ఈ రంగుల ‘ఆంధ్ర కళాదర్శిని‘ (Art of AP- Coffee Table Book) భావితరాలకూ మార్గదర్శకం కాగలదు. అందుకే ఈ ప్రయత్నం. దీనికి మీ అందరీ సహకారం కావాలి.
మీరు….………………………………..
చిత్రకారులు, గ్రాఫిక్ ఆర్టిస్టులు, శిల్పులు, ఇలస్ట్రేటర్లు / డిజిటల్ ఆర్టిస్టులు… అయితే….
ఈ పుస్తకంలో మీకో పేజీ ఉంటుంది…. మరి ఇంకెందుకాలశ్యం….?
వెంటనే 9885289995 నంబరులో సంప్రదించండి. లేదా మీ వివరాలు మెయిల్ చేయండి.
email: artistkalasagar@gmail.com
ఎవరు అర్హులు ?
30 ఏళ్ళు పైబడిన చిత్ర, శిల్పకళల్లో పరిణితి చెందిన కళాకారులందరూ.
ఉద్దేశ్యం: రాష్ట్రంలోని కళాకారుల మధ్య సత్సంబంధాలు మెరుగుపరచడానికి, రాష్ట్రంలో కళల అభివృద్దికి, ఆర్ట్ గ్యాలరీ నిర్మాణం, లలిత కళా అకాడెమీ పున:రుద్దరణ లాంటి విషయాలపై కృషిసల్పేందుకు.
కళలను కాపాడుకుందాం….! మన సంస్కృతిని పరిరక్షిద్దాం….!!
పుస్తకం విడుదల : 2023 సంవత్సరంలో…
మరిన్ని వివరాలకు క్రింది లింక్ లో వీడియో చూడండి…
https://www.youtube.com/watch?v=3gMcm5bmkAY
-కళాసాగర్, ఎడిటర్
మిత్రులు కళాసాగర్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతో మంది చిత్రకారులు చాలా ఉపయుక్తంగా ఉంటుంది… మీరు చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం సర్…
ప్రియమిత్రులు, గౌ. ఎడిటర్,64కళలు శ్రీ కళాసాగర్ గారికి నమస్తే! మీచేతినుండి వెలువడిన * కొంటెబొమ్మలబ్రహ్మలు *వలె ఇదిగూడా ఒక అద్భుతగ్రంధం గా చరిత్ర సృష్టించగలదు. శుభాకాంక్షలతో… బొమ్మన్