రాజంపేటలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహం

తానా పూర్వాధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ మరియు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ సలహాదారు సమ్మెట విజయకుమార్ లు సెప్టెంబర్ 3వ తేదీన అన్నమాచార్య జన్మస్థలం తాళ్ళపాక గ్రామం సందర్శించి అన్నమయ్య నివసించిన గృహప్రదేశం, అన్నమయ్య వంశీకులు కొలిచిన ప్రక్కనే ఉన్న1200 సంవత్సరాలనాటి చెన్నకేశవ దేవాలయాన్ని, రాజంపేటలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నిర్మించిన 108 అడుగుల ఎత్తైన అన్నమయ్య విగ్రహాన్ని దర్శించి, పుష్పాంజలి ఘటించడం ఒక మధురానుభూతి అన్నారు.

108 అడుగుల ఠీవిగా ఉన్న అన్నమయ్య విగ్రహాన్ని నెలకొల్పడం, ఆ ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం ఎంతైనా అభినందనీయం.
ఇదే పర్యటనలో నందులూరు గ్రామంలో నెలకొనిఉన్న పురాతనమైన సౌమ్యనాథ దేవాలయాన్ని, ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి దేవాలయాన్ని దర్శించడం ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది అని సంతోషం వ్యక్తం చేశారు.

SA: