గ్రంథాలయాలు మన జాతి విజ్ఞాన సంపదలు. వాటిని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి విధిగా భావించిన ‘ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం’ ప్రప్రథమంగా 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రకాశం జిల్లా వేటపాలెంలోని ‘సారస్వతినికేతనమ్’ గ్రంథాలయ సందర్శన యాత్రతో ఈ యాత్రను ప్రారంభించింది..
అందులో భాగంగా ఈ ఏడు వేలాది పుస్తక సంపదను కలిగివున్న గుంటూరులోని ‘అన్నమయ్య గ్రంథాలయ సందర్శన యాత్ర’కు శ్రీకారం చుట్టింది. మే నెల 21వ తేది ఉదయం తెలుగు రాష్ట్రాలలోని రచయితలు, కవులతో గ్రంథాలయ సందర్శన యాత్రను ‘ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం’ ఏర్పాటుచేస్తున్నది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఘనకీర్తిని చాటేవిధంగా 77 మంది కవులతో తీర్చిదిద్దిన ‘మన ఆంధ్రప్రదేశ్’ కవితా సంకలనాన్ని ప్రఖ్యాత కవి, విమర్శకులు డా. పాపినేని శివశంకర్ ఆవిష్కరిస్తారు. డా. ఉప్పలధడియం వెంకటేశ్వర హైకూ సంపుటి ‘విత్తనం’ను ప్రముఖ కవి అడిగోపుల వెంకటరత్నం ఆవిష్కరిస్తారు. అన్నమయ్య గ్రంథాలయం వ్యవస్థాపకులు లంకా సూర్యనారాయణతోపాటు ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలువురు కవులు, రచయితలు పాల్గొంటారు. ఇతర రచయితల పుస్తకావిష్కరణలు కూడా ఇందులో ఉంటాయి. కనుక ఈ యాత్రను సందర్శించడానికి పాల్గొనదలచినవారు 9247475975 నెంబరుగల సెల్ నెంబరులో పేర్లు నమోదు చేసుకుంటే, విచ్చేసే ఔత్సాహికులకు ఉచిత భోజన ఏర్పాట్లు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం. జాతి ఔన్నత్యాన్ని తెలియజేసే ఈ యాత్రకి అందరూ సహకరించవలసిందిగా ‘ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం’ ఈ సందర్భంగా కోరుతున్నది.
- సోమేపల్లి వెంకట సుబ్బయ్య, అధ్యక్షులు
- చలపాక ప్రకాష్, ప్రధాన కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం