వాగ్గేయకారులు అన్నమయ్య నిరంతర స్ఫూర్తి ప్రదాత. తరతరాలుగా ఆధ్యాత్మిక భక్తి భావాలను పెంపొందించే ఆయన కీర్తనలు వ్యక్తిత్వ వికాససానికి మూలాలు. అంతటి మహోన్నత మహిమాన్వితుడిని ఎన్నో సంస్థలు వివిధ రీతుల్లో అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తీసుకొచ్చాయి. అందులో ప్రయత్నంగా శనివారం (31-12-2022) సాయత్రం హైదరాబాద్, రవీంద్రభారతిలో అన్నమయ్య నృత్య స్వర నీరాజనం కార్యక్రమం జరిగింది. చిన్నారులతో రవీంద్రభారతి కిక్కిరిసిపోయింది. భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఎబిసి ఫౌండేషన్, సాంస్కృతిక టీవి ఈ అద్భుత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఎందరో నాట్య గురువులు, సంగీత గురువులు తమ శిష్య బృంద ప్రదర్శనలతో నీరాజనం సమర్పించారు.
తెలంగాణ బిసి సంక్షేమ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, డాక్టర్ మహ్మద్ రఫీ, ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు పసుమర్తి శేషుబాబు, నటి రాగిణి, టీవి నటి వనితా బృంద పాల్గొని గురువులను అభినందించింది, సత్కరించారు. డాక్టర్ రమణారావు, లయన్ లలిత సమన్వయకర్తలుగా వ్యవహరించారు.
- మహ్మద్ రఫీ
ఫోటోలు : శ్రీ కంచె శ్రీనివాస్