వైభవంగా అక్కినేని శతజయంతి వేడుకలు

కనుల పండువగా అక్కినేని మీడియా ఎక్స్ లెన్స్ పురస్కారాల ప్రదానోత్సవం

పద్మవిభూషణ్ డా. అక్కినేని నాగేశ్వరరావు కారణ జన్ములని, చివరి శ్వాస వరకు నటిస్తూనే ఎందరికో స్ఫూర్తినిచ్చారని తెలంగాణ ప్రభుత్వ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి కొనియాడారు. అక్కినేని పేరిట పాత్రికేయులకు పురస్కారాలు ఇవ్వడం స్ఫూర్తిదాయకం అన్నారు. శనివారం (28-9-2024) హైదరాబాద్ త్యాగరాయ గానసభలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సీల్వెల్ కార్పొరేషన్, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, ఆదర్శ ఫౌండేషన్, ఆర్.ఆర్. ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు కనుల పండువగా జరిగాయి. మీడియాలో వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్న పాత్రికేయులను అక్కినేని మీడియా ఎక్స్ లెన్స్ పురస్కారాలతో ఘనంగా సత్కరించారు.

ముఖ్య అతిధిగా విచ్చేసిన జి. చిన్నారెడ్డి మాట్లాడుతూ నాలుగో తరగతి మాత్రమే చదువుకున్న అక్కినేని ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్ అయ్యారని, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే వారని, విలువలతో జీవించిన ధన్యజీవి అని కొనియాడారు. అవార్డ్స్ కమిటీ చైర్మన్ డా. మహ్మద్ రఫీ స్వాగతోపన్యాసం చేస్తూ 23 ఏళ్ల క్రితం అక్కినేని చేతుల మీదుగా శృతిలయ మీడియా ఎక్స్ లెన్స్ పురస్కారాలు ప్రారంభమైనట్లు తెలిపారు. వ్యాపారమయమైన పాత్రికేయ రంగంలో ఇంకా విలువలు నిబద్ధత కలిగిన జర్నలిస్టులు ఉన్నారని నేటి తరానికి గుర్తు చేసేందుకు మీడియా పురస్కారాలను ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ కొలేటి దామోదర్ గుప్తా అధ్యక్షత వహించిన సభలో శృతిలయ చైర్మన్ డా.బి.భీంరెడ్డి, ఆర్.ఆర్.ఫౌండేషన్ చైర్మన్ పన్నాల బాలిరెడ్డి, డా. వంశీ రామరాజు, ఆదర్శ ఫౌండేషన్ చైర్మన్ డా.కుసుమ భోగరాజు, తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం అధ్యక్షులు ఆర్. రామచంద్రరావు, ఎల్.ఐ.సి. జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
పురస్కార గ్రహీతలు వీరే!

అక్కినేని మీడియా జీవన సాఫల్య పురస్కారాలతో నేటి నిజం దిన పత్రిక ఎడిటర్ బైసా దేవదాస్, ఆంధ్రజ్యోతి సినిమా చీఫ్ రిపోర్టర్ యు.వినాయకరావు, హిందీ సమయ్ దిన పత్రిక ఎడిటర్, సీనియర్ న్యూస్ రీడర్ మహ్మద్ షరీఫ్, దూరదర్శన్ రిటైర్డ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఎన్.వి. హనుమంతరావు, సోషల్ పోస్ట్ ఎడిటర్, సినీ దర్శకుడు ఇమంది రామారావు, సీనియర్ సినీ టివి నటి మణి మహేష్ లను ఘనంగా సత్కరించారు.

అక్కినేని మీడియా ఎక్స్ లెన్స్ పురస్కారాలను సీనియర్ పాత్రికేయులు, జెఎంజె సొసైటీ డైరెక్టర్ పి.వి. రమణారావు, మతుకుమల్లి మనోహర్, నవభూమి ఎడిటర్ షేక్ అబ్దుల్ అజీద్, ప్రెస్ క్లబ్ ట్రెజరర్ ఎ.రాజేష్, ప్రజాతంత్ర చీఫ్ సబ్ ఎడిటర్ ఎం.డి. అబ్దుల్, సీనియర్ సినీ ఫోటో జర్నలిస్ట్ మడిపల్లి బి. వరప్రసాద్, బిగ్ టివి చీఫ్ న్యూస్ ప్రెజెంటర్ ఎం.నాగరాజు, ఆకాశవాణి న్యూస్ రీడర్, రచయిత్రి, కవయిత్రి శాంతి మంగిశెట్టి, డబ్బింగ్ ఆర్టిస్ట్, రచయిత్రి, కవయిత్రి నడాదూర్ కృష్ణవేణి శఠకోపన్, సీనియర్ టివి నటి బి.భవాని, TV9 ఎజిఎం జువ్వాది సుష్మ, N-tv, వనిత టివి సీనియర్ ప్రోగ్రామింగ్ ప్రొడ్యూసర్ కె. ఈశ్వరి నాయుడు, తెలుగు సినిమా పీఆర్వో తేజస్వి సజ్జా స్వీకరించారు.


అక్కినేని స్ఫూర్తి పురస్కారాలతో మేడ్చల్ జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు రమేష్ గుప్తా, సర్పంచ్ అనిల్ కుమార్, తెలంగాణ సెర్వి సమాజ్ అధ్యక్షులు మోహన్ లాల్ చౌదరిలను సన్మానించారు. అక్కినేని సాంస్కృతిక సేవా పురస్కారాలతో రాగసప్త స్వరం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, అభినందన అధ్యక్షురాలు ఇ. భవాని, మధుర గాయకుడు బి. త్రినాథరావు, ప్రముఖ వ్యాఖ్యాత్రి సుధామయిలను సత్కరించారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి 7 గంటల పాటు నవరస గాయని ఆమని ఆధ్వర్యంలో జరిగిన సినీ సంగీత విభావరిలో అక్కినేని సినిమాల్లోని ఆణిముత్యాల్లాంటి పాటలు ఆద్యంతం అలరించాయి. ప్రముఖ గాయకులు డి.ఎ.మిత్ర, పి. సుభాష్, రాజన్ ఫాల్గుణ, శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, అనూష, అరుణ, రాధారాణి తదితరులు పాటలతో ఆకట్టుకున్నారు. పి.ఎం.కె.గాంధీ వ్యాఖ్యానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

డా. మహ్మద్ రఫీ
ఫోటోలు : గిరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap