డిజిటల్ కార్పోరేషన్ వైస్-చైర్మన్ గా వాసుదేవరెడ్డి

రాయలసీమకు చెందిన ప్రముఖ నిర్మాత చిన్నా వాసుదేవరెడ్డిని ఏపీ డిజిటల్ కార్పోరేషన్ వైస్-చైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఏపీ కంటెంట్ కార్పోరేషన్‌ను ఏపీ డిజిటల్ కార్పోరేషన్‌గా పేరు మార్చి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ ఈ జీవోలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ వైస్-ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్‌గా చిన్న వాసుదేవరెడ్డి నియమితులయ్యారు. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన వాసుదేవరెడ్డి న్యూయార్క్ లో స్థిరపడ్డారు. ఐ డ్రీమ్ మీడియా సంస్థను ఏడేళ్ళ క్రితం స్థాపించి స్థాపించి తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులర్ యూటూబ్ చానల్గా తీర్చిదిద్దారు. రెండు చిన్న సినీమాలను నిర్మించారు. సౌమ్యుడు మంచి స్నేహశీలిగా పేరు గడించిన వాసుదేవరెడ్డి నియామకం పట్ల పలువు అభినందనలు తెలియజేసారు.

ఎవరీ వాసుదేవరెడ్డి ?
మదనపల్లెకు చెందిన వాసుదేవరెడ్డి ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వచ్చారు. 1994 -96లో కంప్యూటర్ సైన్స్ లో ఎంఎస్ పూర్తి చేసిన తరువాత సిలికాన్ వ్యాలీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఓ స్టార్టప్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. తరువాత 1998-2005లో న్యూయాకు చెందిన యునైటెడ్ ఆన్లైన్ సర్వీసెస్లో ప్రిన్సిపల్ ఇంజనీర్ గా చేరారు. అక్కడ నుంచి సినిమారంగంపై ఉన్న ఆసక్తితో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్‌గా మారారు. కెఎడి ఎంటర్టైన్మెంట్స్ తరపున 2002 నుంచి 2009 వరకు చాలా సినిమాలను ఆయన ఓవర్సీస్లో రిలీజ్ చేశారు. దాదాపుగా 100 సినిమాలకు పైగా ఆయన ఓవర్సీస్లో రిలీజ్ చేయడం విశేషం. టాగోర్, శ్రీరామసముద్రం, జానీ, సైనికుడు. హ్యాపీ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, జై చిరంజీవ, ఆనంద్, గోదావరి వంటి సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి. దాంతోపాటు 1000కిపైగా డీవీడిలను కూడా ఆయన రిలీజ్ చేశారు. అతడు, పోకిరి, బొమ్మరిల్లు, ఆనంద్, గోదావరి, పరుగు వంటి చిత్రాల డీవిడిలను రిలీజ్ చేశారు. న్యూజెర్సీలో 2006లో మహేష్బాబు సినిమా సైనికుడు ప్రీమియర్ షోలను న్యూజెర్సీ, డిట్రాయిట్, శాససె, లాస్ఏంజెల్స్ లో రిలీజ్ చేశారు. ఈ ప్రీమియర్ షోలకు మహేష్, నమ్రత, అశ్వినీదత్, స్వప్నదత్, గుణశేఖర్, హారీస్ జైరాజ్ వంటివారు హాజరయ్యారు. కెఎడి ఎంటర్టైన్మెంట్స్ తరఫున మణిశర్మ మ్యూజికల్ షోను ఆయన 2005 నుంచి 2013 వరకు నిర్వహించారు. 2013లో న్యూజెర్సీలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీత విభావరిని ఏర్పాటు చేశారు. అమెరికాలో పలు రకాలైన వ్యాపారాలు, షోలతో బిజీగా ఉన్న వాసుదేవ రెడ్డి చిన్న మాతృభూమిపై ఉన్న మమకారంతో తాను పుట్టిన మదనపల్లెకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2007-2009 ఎన్నికల్లో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం తరపున మదనపల్లె నుంచి పోటీ చేశారు.
గెలవకపోయినా దాదాపు 35,000 ఓట్లను ఆయన రాబట్టుకోవడం విశేషం. ఓ ఎన్నారైగా ఉండి. సొంతూరులో ఇన్ని ఓట్లను పొందడం ఆయనకు ఇక్కడి ప్రజల్లో ఉన్న ఇమేజ్ఞు తెలియజేసింది.
2013లో ఐ డ్రీమ్ మీడియా సంస్థను ఏర్పాటు చేశారు. డిజిటల్ ప్లాట్ ఫామ్ గా దీనిని తీర్చిదిద్దారు. మూవీ లైబ్రరీగా, మూవీ కంటెంట్ ఛానల్ గా యూ ట్యూబ్ ద్వారా దీనిని ఆయన ప్రవేశపెట్టారు. హైదరాబాద్లోనూ, న్యూజెర్సీలోనూ సొంతంగా స్టూడియోలను నెలకొల్పి వ్యాపారాన్ని మరింతగా పెంచుకున్నారు. ఐ డ్రీమ్ మీడియా ప్రసారాలను ప్రతిరోజూ దాదాపు కోటీ 10 లక్షల మందికిపైగా ప్రేక్షకులు యూ ట్యూబ్ ద్వారా చూస్తున్నారు. తెలుగు కమ్యూనిటీకి మరింత దగ్గరవ్వాలన్న ఉద్దేశ్యంతో జెర్సి తెలుగు అసోసియేషను ఆయన ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఐ డ్రీమ్ మీడియాను వస్టాప్ షాప్ గా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. ఈ పదవితో మళ్ళీ యాట్టివ్ పొలిటిసీన్ కాబోతున్నాడా? లెట్స్ సీ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap