రేపే వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డులు

ఆగస్ట్ 14న జరగాల్సిన వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డుల కార్యక్రమం రేపు(01-11-21) విజయవాడలో జరుగనుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొనే ఈ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా రానున్నారు.

వైయస్సార్ పార్టీ అధికారం లోకి వచ్చక గత రెండేళ్ళుగా కోవిడ్ కారణంగా ఉగాది పురస్కారాలు రద్దుచేశారు. అయితే ఉగాది పురస్కారాలు స్థానే వైయస్సార్ అవార్డులు ప్రకటించారా ? లేక అవి యదావిధిగా కొనసాగుతాయా అనేది తెలియాల్సివుంది. ఏమయినప్పటికీ ఈ అవార్డుల ప్రకటన కళాకారుల్లో కొంత ఉత్సాహాన్ని నింపిందనవచ్చు.

దివంగత ముఖ్యమంత్రి వైఎఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులతో పాటు ప్రతిభా అవార్డులను కూడా ప్రకటించింది. స్వచ్ఛంద సంస్థలు, రైతులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు, కొవిడ్ వారియర్స్ కు ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. మొత్తం 63 మందిని వైఎస్ఆర్ పురస్కారాలకు ఎంపిక చేసిన ప్రభుత్వం వారికి నగదు బహుమతితో పాటు ప్రశంశాపత్రం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ప్రాధాన్యం కల్పించింది. కళల్లో వీధీనాటకం, థింసా నృత్యం, చిత్రకళ, కొండపల్లి బొమ్మలు, హరికథ, బుర్రకథ, రంగస్థలంతో పాటు విపత్తు నిర్వహణకు కూడా స్థానం కల్పిస్తూ ధర్మాడి సత్యం బృందానికి అవార్డు ప్రకటించింది. కొవిడ్ వారియర్స్ కేటగిరీలో డాక్టర్లతో పాటు నర్సులు, ఆస్పత్రులు ఉన్నాయి.

సామాన్యుల్లో అసామాన్యులు
మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకే పురస్కారాలు అందజేస్తున్నామని, సామాన్యుల్లో అసామాన్యులను గుర్తించి వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్, అచీవ్మెంట్ అవార్డులకు ఎంపిక చేశామని పేర్కొన్నారు. తెలుగు వారు గ్రామస్థాయి నుండి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అనేక రంగాల్లో విశేష సేవలందిస్తున్నారని కృష్ణమోహన్ తెలిపారు. వైఎస్సార్, సీఎం జగన్లది పేదవాడికి మేలు చేయాలనే ఫిలాసఫీ అన్నారు. తెలుగువాడు అంటే నిండైన వ్యక్తిత్వం కలిగిన వారిలో ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తారని తెలిపారు. అలాంటి వ్యక్తి పేరిట ఇస్తున్న ఈ అవార్డులకు తగిన అర్హత కలిగిన వ్యక్తులు, సంస్థలను గుర్తించేందుకు రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ కొద్ది నెలలుగా విస్తృతమైన కసరత్తు చేసిందన్నారు. వైఎస్సార్ లైఫ్ టైం అచీమ్ మెంట్, అచీవ్ మెంట్ కింద 50 అవార్డులను ఇవ్వాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ, 62 అవారులను ఇస్తోందని చెప్పారు. వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకు రూ.10 లక్షలు నగదు, జ్ఞాపిక, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుకు రూ.5 లక్షలు నగదు, జ్ఞాపికను అందించనున్నట్లు తెలిపారు. ఈ అవార్డులను ఆగస్టు 14 లేదా 15వ తేదీన అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుం దని అయన పేర్కొన్నారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ) ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలిసారిగా ఈ అవార్డులను ఇస్తున్నారని, 6 కేటగిరీల కింద మొత్తం 62 అవార్డులను ప్రదానం చేయనున్నారని చెప్పారు.

వైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్ మెంట్ మరియు ఎచీవ్ మెంట్ అవార్డులు
సంస్థలు (అన్నింటికీ లైఫ్ టైమ్)
1) ఎంఎస్ఎన్ ఛారిటీస్ ట్రస్ట్ – కాకినాడ, తూర్పు గోదావరి
2) సీపీ బ్రౌన్ లైబ్రరీ – వైయస్సార్ జిల్లా
3) సారస్వత నికేతన్ లైబ్రరీ – వేటపాలెం, ప్రకాశం
4) శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ – అనంతపురం
5) ఆర్ సీ రెడ్డి స్టడీ సర్కిల్ – వైయస్సార్ జిల్లా
6) రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ – అనంతపురం
7) శ్రీ గౌతమి రీజినల్ లైబ్రరీ – రాజమండ్రి, తూర్పుగోదావరి
8) మహారాజాస్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ మ్యూజిక్ – విజయనగరం
……………………………………………………………………..

రైతులు
1) స్వర్గీయ పల్లా వెంకన్న (లైఫ్ టైమ్) – కడియం నర్సరీల వ్యవస్థాపకుడు
2) మాతోట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ – శ్రీకాకుళం
3) శ్రీ ఎం.సి.రామకృష్ణారెడ్డి – అనంతపురం
4) శ్రీ కొట్యాడ శ్రీనివాసరావు – విజయనగరం
5) శ్రీ విఘ్నేశ్వర ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ – కృష్ణా
6) శ్రీ ఎం.బలరామిరెడ్డి – వైయస్సార్ జిల్లా
7) శ్రీ ఎస్.రాఘవేంద్ర – చిత్తూరు
8) శ్రీ సెగైకొండల్ రావు – విశాఖపట్నం
9) ఆంధ్ర కశ్మీర్ ట్రైబల్ ఫార్మింగ్ అండ్ మార్కెటింగ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ – విశాఖపట్నం
10) శ్రీ వల్లూరు రవికుమార్ – కృష్ణా
11) శ్రీ శివ అభిరామరెడ్డి – నెల్లూరు
…………………………………………………………………..

Savara Raju – Savara Tribal art

కళాకారులు
1) పొందూరు వస్త్రాలు– ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మికాభ్యుదయ సంఘం-లైఫ్ టైం- శ్రీకాకుళం
2) జానపద గేయం– స్వర్గీయ వంగపండు ప్రసాదరావు-లైఫ్ టైంవిజయనగరం
3) బొబ్బిలి వీణ– శ్రీ బొబ్బిలివీణ కేంద్రం (శ్రీ అచ్చుత నారాయణ)-లైఫ్ టైం- విజయనగరం
4) ధింసా నృత్యం– కిల్లు జానకమ్మ థింసా నృత్య బృందం – విశాఖపట్నం
5) రంగస్థలం– శ్రీ పొన్నాల రామసుబ్బారెడ్డి – లైఫ్ టైం – నెల్లూరు
6) సురభి నాటకం– (శ్రీ వినాయక నాట్య మండలి) – సురభి
డ్రామా- లైఫ్ టైం – వైయస్సార్ జిల్లా
7) సవర పెయింటింగ్స్ – శ్రీ సవర రాజు – శ్రీకాకుళం
8) వీధి నాటకం– శ్రీ మజ్జి శ్రీనివాసరావు – విశాఖపట్నం
10) డిజాస్టర్ మేనేజ్ మెంట్– శ్రీ ధర్మాడి సత్యం – తూర్పు గోదావరి
11) హరికథ– శ్రీ సర్వారాయ హరికథా పాఠశాల (మహిళ) – తూర్పు గోదావరి
12) బుర్రకథ– శ్రీ మిరియాల అప్పారావు – పశ్చిమ గోదావరి
13) కొండపల్లి బొమ్మలు – శ్రీ కూరెళ్ల వెంకటాచారి – కృష్ణా
14) డప్పు కళాకారుడు– శ్రీ గోచిపాత గాలేబు – కృష్ణా
15) వెంకటగిరి జమదానీ చీరలు– శ్రీ జి.రమణయ్య- నెల్లూరు
16) కలంకారీ పెయింటింగ్స్– శ్రీ శివప్రసాదరెడ్డి – కర్నూలు
17) ఉడ్ కార్వింగ్స్– శ్రీ బాలాజీ ఉడ్ కార్వింగ్ ఆర్టిజన్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్- చిత్తూరు
18) లెదర్ పప్పెట్రీ(తోలుబొమ్మలాట)- శ్రీ దాలవాయి చలపతి- లైఫ్ టైం- అనంతపురం
19) నాదస్వరం– డాక్టర్ వి.సత్యనారాయణ – చిత్తూరు
20) కేలిగ్రఫీ– పూసపాటి పరమేశ్వరరాజు – విజయనగరం
21) కూచిపూడి నాట్యం – సిద్ధేంద్రయోగి కళా క్షేత్రం-లైఫ్ టైంకూచిపూడి – కృష్ణా జిల్లా

…………………………………………………………..

రచయితలు (అందరికీ లైఫ్ టైం)
1) స్వర్గీయ కాళీపట్నం రామారావు (కారా మాస్టర్) – శ్రీకాకుళం
2) శ్రీ కత్తి పద్మారావు – అభ్యుదయ సాహిత్యం – గుంటూరు
3) శ్రీ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి- సాహిత్యం – వైయస్సార్ జిల్లా
4) శ్రీ బండి నారాయణస్వామి – సాహిత్యం – అనంతపురం
5) శ్రీ కేతు విశ్వనాథరెడ్డి – సాహిత్యం – వైయస్సార్ జిల్లా
6) శ్రీ కొనకలూరి ఇనాక్ – సాహిత్యం – గుంటూరు
7) శ్రీమతి లలితకుమారి (ఓల్గా) – సాహిత్యం – గుంటూరు
……………………………………………………………………..

పాత్రికేయులు (అందరికీ లైఫ్ టైం)
1) శ్రీ పాలగుమ్మి సాయినాథ్ – చెన్నై
2) శ్రీ ఏబీకే ప్రసాద్ – కృష్ణా
3) స్వర్గీయ పొత్తూరి వెంకటేశ్వరరావు – గుంటూరు
4) స్వర్గీయ షేక్ ఖాజా హుస్సేన్ (దేవీప్రియ) – గుంటూరు
5) స్వర్గీయ కె.అమర్‌నాథ్ – పశ్చిమ గోదావరి
6) శ్రీ సురేంద్ర -కార్టూనిస్ట్ – కడప
7) శ్రీ తెలకపల్లి రవి – కర్నూలు
8) శ్రీ ఇమామ్ – అనంతపురం
…………………………………………………………………………

కోవిడ్ వారియర్స్
1) డాక్టర్ నీతిచంద్ర – ప్రొఫెసర్ పల్మనాలజీ – నెల్లూరు
2) డాక్టర్ కె.కృష్ణకిషోర్ – ప్రొఫెసర్ ఈఎనీ – కాకినాడ
3) శ్రీమతి లక్ష్మి – స్టాఫ్ నర్స్ – జీజీ హెచ్. విజయవాడ
4) కె.జ్యోతిర్మయి – స్టాఫ్ నర్స్ – అనంతపురం
5) తురుబిల్లి తేజస్వి – స్టాఫ్ నర్స్ – విశాఖపట్నం
6) ఎం.యోబు – మేల్ నర్సింగ్ – నెల్లూరు
7) అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ – గుంటూరు
8) ఆర్తి హోమ్స్ – వైయస్సార్ కడప
మొత్తంగా 63 అవార్డులు..
………………………………………………………………………………………….
తిరస్కరించిన పాలగుమ్మి సాయినాథ్‌
ఈ పురస్కారాన్ని గౌరవంగా తిరస్కరిస్తున్నట్లు పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌ ట్వీట్‌ చేశారు. ‘పాత్రికేయులు తాము వార్తలు రాసే, విమర్శించే ప్రభుత్వాల నుంచి అవార్డులను అంగీకరించకూడదు. 40 ఏళ్లుగా నేను ప్రభుత్వాల నుంచి ఏ అవార్డు వచ్చినా ఇలాగే తిరస్కరించాను’ అని వివరించారు.
-కళాసాగర్

4 thoughts on “రేపే వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డులు

  1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘వైయస్ఆర్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్’ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ సురేంద్రగారికి అభినందనలు. తెలుగు కార్టూనిస్టు ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింపచేసిన మీరు మరిన్ని గౌరవ పురస్కారాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  2. ఈ అవార్డుల్లో కార్టానిస్టు ఉండటం సంతోషం. శ్రీ సురేంద్ర గారికి అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap