ఐదేళ్ళ తర్వాత ఏ.పి.లో నంది నాటకోత్సవాలు

నంది నాటక పరిషత్తు 1998 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించింది. నంది నాటకోత్సవం పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ప్రతి సంవత్సరం నంది నాటకోత్సవాల్ని నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సమాజాల నుండి ఎంట్రీలను స్వీకరించి ప్రాథమిక న్యాయ నిర్ణేతల ద్వారా స్క్రూటినీలు చూసి తుదిపోటీలకు 10 పద్యనాటకాలు, 10 సాంఘిక నాటకాలు, 12 సాంఘిక నాటికలు, 12 బాలల నాటికలను ఎంపిక చేస్తారు. వీటినుండి ఉత్తమ ప్రదర్శనకు – బంగారు నంది, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు – రజత నంది బహుమతులతో పాటుగా నగదు పురస్కారం కూడా ఇస్తారు. అయితే గత ఐదేళ్ళుగా నాటకోత్సవాలు నిర్వహించలేదు. చివరిగా గత ప్రభుత్వం 2017 సం.లో నాటకోత్సవాలు నిర్వహించింది.

తెలుగు నాటకానికి ఈ రోజు పండుగ రోజు. నంది నాటకోత్సవాలను నిర్వహించబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సినీ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి మరియు AP. FDC సంచాలకుడు ఈ రోజు ఒక పత్రిక విలేకర్ల సమావేశంలో ప్రకటించడం జరిగింది. చాలా మంది నాటక రంగ కళాకారులు ఈ వార్త తెలిసిన ఇప్పటికి నమ్మడం లేదు. కానీ నమ్మాలి. ఎందుకంటే ప్రభుత్వమే ప్రకటించింది కాబట్టి. నోటిఫికేషన్ కూడా విడుదల చేరు. కాబట్టి నాటక సమాజాలు, వాటి నిర్వాహకులు, రచయితలు, దర్శకులు, నటీనటులు తమ తమ నమ్మకాలు అపనమ్మకలు పక్కన పెట్టి స్క్రిప్ట్ లు సిద్ధం చేసుకోండి. నటీనటులను ఎంపిక చేసుకొని రిహార్సల్స్ ప్రారంభించండి. మీ నాటకంలోని సభ్యులందరిలోను క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం కలిగించండి. స్కృటిని తేదీ వచ్చేలోపు కనీసం రెండు సార్లయినా నాటకం కానీ, నాటిక గాని ఫైనల్ రన్ త్రు అయ్యేట్టు చూసుకోండి. ముఖ్యంగా మీ మీ నాటకాల్లో సాధ్యమైనంత ఎక్కువ మంది యువ నాటక రంగ కళాకారులకు అవకాశం ఇవ్వండి. రొట్టకొట్టుడు అంశాలతో కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను… ఉన్నతమైన జీవితాన్ని ప్రతిబింబించే, మానవత్వం మానవ విలువలను పెంపొందించే కొత్త కొత్త కథాంశాలతో కూడిన నాటకాలకు ప్రాధాన్యత నివ్వండి. నాటకాలు రూపుదిద్దే క్రమంలో స్థానికంగా ఉన్న మీ మీ బంధు మిత్రులను ఏదో ఒక రూపంలో భాగస్వాములను చేయండి. మీ నాటకం గురించి మీ ఊర్లో వారికి, పత్రికలకు, లోకల్ టీవి చానళ్లకు సోషల్ మీడియాలో వార్తలుగా సమాచారం ఇవ్వండి. వీలైతే దాతల నుండి విరాళాలను సేకరించండి. దాని వల్ల నాటకం పట్ల తెలిసిన వారికి తెలియని వారికీ నాటకం పట్ల పరిచయం, చైతన్యo కలుగుతుంది. వీటన్నిటికీ ముందు నంది నాటకోత్సవాల నోటిఫికేషన్ వెలువడగానే సకాలంలో పూర్తి వివరాలతో కూడిన అప్లికేషను పూర్తి చేసి గడువు లోపల పంపండి.. జై తెలుగు నాటకం.

SA:

View Comments (1)