ఆంధ్రప్రదేశ్ కల్చరల్ కమిషన్ చైర్ పర్సన్ గా తేజస్వి పొడపాటి (ఒంగోలు) నియామకం! ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమి చైర్మన్ గా తిరిగి గుమ్మడి గోపాలకృష్ణ (పామర్రు) ను నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబుగారు. తేజస్వి చురుకైన కార్యకర్త. సోషల్ మీడియా ఇన్-ఫ్లూఎన్సర్ గా పార్టీకి అండగా చక్కని ఉపన్యాసాలు ఇస్తూ ఆకట్టుకుంది. టిడిపి క్లిష్ట సమయంలో తనదైన పోరాటం చేసి ఉనికి చాటుకుంది. జెఎన్టియు లో ఇంజనీరింగ్ పూర్తి చేసి టెక్ మహీంద్ర లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తూ వీకెండ్ లో జన్మభూనికి సేవలు అందించారు. భూమి ఫౌండేషన్ ద్వారా సేవలను విస్తృతం చేశారు. రాష్ట్ర విభజన సమయం నుంచి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. దశ దిశ తెలిసిన తేజస్వి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కళాకారులకు మంచి జరుగుతుందని ఆశిద్దాం. ఇవాళ తేజస్వి పుట్టినరోజు! పుట్టినరోజు కానుకగా సాంస్కృతిక సృజనాత్మక సమితి కీలక పదవి లభించింది. ఈ పదవి స్వీకరించిన సందర్భంగా తన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు ఆమె.
గుమ్మడి గోపాలకృష్ణ గతంలోనూ ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమి చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. మళ్ళీ అదే పదవి ఆయన్ని వరించింది. నాటక రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఆశిద్దాం. పద్య నాటకాన్ని అమెరికాలో ప్రాచుర్యం కల్పిస్తూ అక్కడ ఎందరో చిన్నారులకు పద్యం నేర్పించి నాటకాలు ప్రదర్శించే స్థాయికి చేర్చిన గుమ్మడి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ నాటక రంగం వికసించడం ఖాయం. మొదటి నుంచి తెలుగు దేశం పార్టీలో కార్యకర్తగా ఉండి పద్యాలు స్వయంగా రాసి పాడి, ప్రజల్లోకి పంపించి ప్రచారంలో సాంస్కృతిక కార్యక్రమాల పరంగా కీలక పాత్ర పోషించారు. గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్ ద్వారా పేద కళాకారులకు ఆర్ధిక సాయం అందిస్తూ విశేష సేవలు అందిస్తున్నారు. మొత్తానికి పార్టీకి పని చేసిన వారికి పదవులు వరించాయి. ఇరువురికి అభినందనలు.
అలాగే సంగీత, సాహిత్య తదితర అకాడెమీలను కూడా నియమిస్తే అయారంగాలకు కూడా ప్రయోజనకరంగా వుంటుందని ఆశిస్తున్నారు.