ఏ.పి.’స్టేట్ యూత్ ఫెస్టివల్’

విజయవాడ, కె.ఎల్. యూనివర్సిటీ లో జనవరి 7 నుండి 9 వ వరకు ‘స్టేట్ యూత్ ఫెస్టివల్’
____________________________________________________________________
కొండపల్లి – ఏటికొప్పాక బొమ్మలు, తోలు బొమ్మలు, కలంకారీ వస్తాలు, లీఫ్ ఆర్ట్, స్క్రాప్ శిల్పాల ప్రదర్శన

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న యువజనోత్సవాలు విజయవాడ లో మూడు రోజులపాటు జరుగనున్నాయి. యువతలో వున్న ప్రతిభ, కళా కౌశలాలు, మరియు ప్రాంతీయ సాంస్కృతికను ప్రదర్శించడానికి వేదికగా ‘స్టేట్ యూత్ ఫెస్టివల్’ నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవాలు యువతరం కు తమ అభివ్యక్తిని చూపించడానికి, విభిన్న కార్యక్రమాలలో పాల్గొనడానికి మరియు ప్రాంతీయ సాంస్కృతిక శ్రీముఖానికి ఒక వేదికగా నిలుస్తాయి.

విజయవాడ, వడ్డేశ్వరంలో వున్న కె.ఎల్. యూనివర్సిటీ క్యాంపస్ లో జనవరి 7 నుండి 9 వ తేదీ వరకు ‘స్టేట్ యూత్ ఫెస్టివల్’ జరుగుతుంది.

ఉత్సవంలో భాగంగా సృజన మరియు కళాత్మక కార్యక్రమాలు, యువ సమ్మేళనం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు వుంటాయి. ప్రదానంగా కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు పెయింటిగ్, ఫోక్ డాన్స్, సాంప్రదాయ నృత్యాలు(సోలో మరియు గ్రూప్), పోస్టర్ మేకింగ్, స్టోరీ రైటింగ్, ఫోటోగ్రఫీ వంటి 21 విభాగాలలో పోటీలు నిర్వహిస్తారు. ఇందులో ఫైనల్స్ కి సెలెక్ట్ అయిన విద్యార్థులు ఈ నెల 12 వ తేదీన జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు.

యువకృతిలో భాగంగా కొండపల్లి – ఏటికొప్పాక బొమ్మలు, తోలు బొమ్మలు, కలంకారీ వస్తాలు, లీఫ్ ఆర్ట్, స్క్రాప్ శిల్పాలు, క్లే మోడలింగ్ తో పాటు ఫ్యాషన్ షో ప్రదర్శన వుంటుంది.

వీటితో పాటు యోగథాన్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ (యూట్యాబ్, ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్) కి సత్కారాలు కూడా వుంటాయి.
…………………………………………………………………………………………………………
(పైన ఫోటో: ‘స్టేట్ యూత్ ఫెస్టివల్’ పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న కె.ఎల్. యూనివర్సిటీ ప్రిన్సిపల్ డా. సుబ్రమణ్యం గారు, జిజ్ఞాస భార్గవ్, ప్రోగ్రాం కోర్డినేటర్స్ గాయత్రి, కళాసాగర్, స్పూర్తి శ్రీనివాస్, స్వాతి.)

SA: