టూరిజం శాఖ ఆధ్వర్యంలో ‘పెయింటింగ్ పోటీలు’

ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ‘జయహో భారతీయం’ సంస్థ విజయవాడలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలలో భాగంగా ఈనెల 14 వ తేదీన పెయింటింగ్ పోటీలు నిర్వహించనున్నారు.
14 వ తేది ఉదయం పున్నమి ఘాట్ సమీపంలోని భవాని ఐలాండ్ లో ఈ పోటీలు జరుగుతాయి.
కలర్స్(ఆక్రలిక్), కాన్వాస్ మాత్రమే టూరిజం శాఖ అందిస్తుంది. పోటీలో పాల్గొనే అభ్యర్థులు కుంచెలు తదితర మెటీరియల్ ఎవరికి వారే తెచ్చుకోవాలి.

థీమ్ (Theme) – సంక్రాంతి పండుగ మరియు ఆంధ్రప్రదేశ్ లో టూరిజం ప్రాంతాలు(రెండు అంశాలను కలగలిపి చిత్రాన్ని గీయాల్సివుంటుంది).
అర్హత (Eligibility): 18 నుండి 40 సంవత్సరముల వయస్సు వారు పాల్గొనవచ్చు.
సమయం (Time duration): ఉదయం 10-00 గంటల నుండి మ. 2-00 గంటల వరకు.

మరిన్ని వివరాలకు కళాసాగర్– (Editor: 64kalalu.com) – 9885289995
శ్రీనివాసరెడ్డి (జయహో భారతీయం).

ప్రదర్శన: చిత్రాలను జనవరి 15, 16 తేదీలలో రెండురోజుల పాటు ప్రదర్శనలో ఉంచుతారు.
గెలుపొందినవారికి (జనవరి 16 న) ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు 5 కన్సోలేషన్ బహుమతులు అందజేస్తారు. పోటీలలో పాల్గొన్న చిత్రకారులందరికీ ప్రశంసా పత్రం (Merit Certificate) అందజేస్తారు.

  • ముందుగా పేర్లు నమోదు చేసుకున్న 40 మందికి మాత్రమే ఈ పోటీలో పాల్గొనే అవకాశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap