
ప్రభుత్వం గతంలోలాగే కవులు, రచయితలు, కళాకారులకు ఉగాది, కళారత్న పురస్కారాలు ప్రదానం చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం స్థానిక దుర్గాపురంలోని ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఉప సంచాలకులు డి. పెంచలయ్యను కలిస రచయితలు సంఘ సభ్యులు వినతిపతం సమర్పించారు.
గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కవులు, రచయితలు, కళాకారులకు తెలుగునాట ప్రతిఉగాది పండుగరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున ఉగాది పురస్కారాలు, కళారత్న పురస్కారాలు ఇచ్చి గౌరవించేదని, కాని గత ఆరు సంవత్సరాలుగా ఈ పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం లేదని, కనుక ఈ కారణంగా కళాకారులు, కవులు, రచయితలలో ఓ విధమైన నిరుత్సాహం నెలకొని ఉందన్నారు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ విషయం పునరాలోచించి మళ్ళీ వచ్చే ఉగాది పండుగ రోజున ప్రభుత్వం అధ్వర్యంలో భాషా, సంస్కృతిక శాఖ ద్వారా ఈ పురస్కారాలిచ్చి ప్రోత్సహించే విధంగా ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం కవులు, రచయితల తరుపున విజ్ఞప్తి చేస్తున్నదన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని కవులు, రచయితలు, సాహిత్య, కళారంగ సంస్థల చిరునామాలతో భాషాసాంస్కృతిక శాఖ ఒక డైరక్టరీని తీసుకురావాలని, ఒక వెబ్సైట్ కూడా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం కోరుతున్నదని ఈ విజ్ఞపన పత్రంలో కోరారు. దీనివల్ల ప్రభుత్వం తరుపున భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించే ప్రతి కార్యక్రమం కవులు, రచయితల చెంతకు చేరుతుందని, తద్వారా వీరుకూడా పాలుపంచుకోవడంతోపాటు ప్రభుత్వం ఇచ్చే పురస్కారాలు (ఒకసారి ఇచ్చిన వారికే ఇవ్వకుండా) కొత్తవారికి చేరే ప్రయోజనం చేకూరుతుందని తెలియజేసారు. కనుక ఈ సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం విజ్ఞప్తి చేస్తున్నదని ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు సి.భవానీదేవి, ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్, కోశాధికారి నానా, శర్మ సి.హెచ్, పాణిగ్రాహి రాజశేఖర్, తదితరులు కోరారు.
అవును సార్.. ఇవ్వాలి. ముఖ్యంగా ఇచ్చిన వారికీ మళ్ళీ ఇవ్వకూడదు అనే మాట బావుంది.. అందరిని సమానంగా గుర్తించాలనే మీ సూచనకు ధన్యవాదములు 🌹🌹🌹🌹🌹🙏.. 🌹