
కందుకూరి ప్రతిష్ఠాత్మక మరియు విశిష్ఠ పురస్కారాల కొరకు దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి చేసిన ధరఖాస్తులను స్వీకరించేందుకు గడువు తేదీ: ఏప్రిల్ 7, 2025
కందుకూరి వీరేశలింగం పంతులుగారి 177 వ జయంతిని పురస్కరించుకొని నాటక రంగంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న కళాకారులు, సాంకేతిక నిపుణులు, రచయితలు, దర్శకులకు తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయిలో కందుకూరి ప్రతిష్ఠాత్మక మరియు విశిష్ఠ పురస్కారాలను ఏప్రిల్ 16 న ప్రదానం చేయునున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ నాటకరంగ అభివ్రుద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు శుక్ల, ఐ.ఎ.ఎస్. తెలేయజేశారు. పూర్తి చేసిన ధరఖాస్తులను 2025, ఏప్రిల్ 7 లోపు విజయవాడ పండిట్ నెహ్రు బస్టాండ్ ఆవరణ 4 వ అంతస్తులోని సంస్థ చిరునామాకు మీమీ ధరఖాస్తుతో పాటు సంబందిత పత్రాలను నేరుగా అందించగలరు. ధరఖాస్తు ఫారం కొరకు మా సంస్థ వెబ్ సైట్ www.apsftvtdc.in ను సంప్రదించి డౌన్లోడ్ చేసుకోగలరు. గతంలో రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్న వారి ధరఖాస్తులను పరిగణలోకి తీసుకోరు. అదేవిధంగా గతంలో జిల్లా స్థాయి పురస్కారాలను అందుకున్న వారు రాష్ట్రస్థాయి పురస్కారాలకు అర్హులని మేనేజింగ్ డైరెక్టర్ తెలియజేశారు.