ప్రముఖ చిత్రకారులు, కార్టూనిస్ట్ చంద్ర గారి 74 వ జన్మదిన సందర్భంగా వారిపై వున్న ఆరాధనా భావంతో చిత్రకారుడు ‘చిత్ర’ తన గీతలతో, రాతలతో చంద్ర గారి జీవితాన్ని ఆవిష్కరించారు…
అజ్ఞానాన్ని పోగొట్టుకుంటూ..
సంస్కారంతో ఎదిగే మహోన్నత చిత్రకారులు అరుదుగా పుడతారు.
అందులో మన ‘చంద్ర’ గారు ఒకరు…
ఒక మంచి భావం ఏవైపు ఉండాలో తెలుసు..
ఒక మంచి బొమ్మ ఎందరి హృదయాలను దోచగలదో కూడా తనకు తెలుసు…
అందుకే.. ఇందరి అభిమానాన్ని పొందగలిగాడు.
స్నేహశీలి, ఓ మంచి ఆలంబనకు ఆయన సదా దాసి..
బొమ్మలు వేయడానికే తప్ప .. ఇంకెవ్వరికీ లొంగని మనిషి చూస్తే గంభీరంగా ఉంటాడు…
మనసు తెలిస్తే చిన్నపిల్లోడిలా కనిపిస్తాడు తనది కపటం తెలియని కళాహృదయం.
అందుకేనేమో..
రాజీపడటం ఇషం లేక చాలా సార్లు నష్టపోవడానికే సిద్ధంగా ఉంటాడు
ఒక బొమ్మ వేయడానికి ఎన్ని రంగులు కలుపుతాడో..
ఒక మంచి భావం కలిగించడానికి అంతకుమించి మధనపడతాడు అందుకే..
ఈ కళా జగత్తులో చెరగని సంతకం ఆయనది.
సహజత్వాన్ని ప్రేమించడంకోసం ప్రయోజనాలనే దూరం చేసుకున్న గొప్ప చిత్రకారుడు.
అపారమైన జీవిత అనుభవాల
చేదు, తీపి రుచులను ఎరిగినవాడు
అందుకే.. చిత్రకారుడే కాదు
తనలో ఓ మంచి రచయిత కూడా ఉన్నాడు.
ఆయన బొమ్మల్ని డబ్బులకన్నా భద్రంగా దాచుకునే అభిమానులు కోకొల్లలుగా ఉన్నారు.
అంతకన్నా సక్సెస్ జీవితానికి ఇంకేముంది.
ఆయన గీసిన గీతల వెంట చూపులు వెళితే..! పద్మవ్యూహంలో చిక్కుకుపోతాం…
మనసు పరితపించే ఊహలలో కాసేపైనా ఉండిపోతాం.
తన కుంచె మహిమను చూసి ఎందరో అబ్బురపడతారు ఇంకొందరైతే.. మరీ మరీ సిగ్గుపడతారు.
మనందరినీ విడిచి తను ఎక్కడో దూరానా ఉంటున్నా..
తన బొమ్మలైనా చూసే భాగ్యం కలిగించమని కోరుతున్నాను.
నిజమైన కళాకారులెప్పుడూ స్వేచ్ఛను కోరుకుంటారు అందుకేనేమో..
నిబంధనల్ని దాటి వచ్చినప్పుడల్లా విమర్శల్ని తెచ్చుకుంటారు.
చంద్రగారు ఎన్నిసార్లు మనసు వికలం చేసుకున్నారో..!
అందుకే.. అంత గొప్ప చిత్రకారులు కాగలిగారు.
బహుశా లౌక్యం తెలియకనే ఎన్నీటినో పోగొట్టుకున్న…
నాకిష్టమైన చిత్రకారుల్లో చంద్రసారు ఒకరు.
తను మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మనసారా కోరుతూ…
ప్రేమతో…
-చిత్ర
నా అభిమాన చిత్రకారుడు శ్రీ చంద్ర గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను… ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా సాగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను..
Nice interduce about Chandra Garu
చంద్ర గారికి హార్దిక శుభాభినందనలు. శతమానం భవతి!
చంద్ర గారు… మనసు చూస్తే చిన్న పిల్లవాడు..
అన్నారు. ఇది ఎంతో నిజం.. వారి బొమ్మ చూస్తే..మహానందభరితం. కథా చిత్రాలు (illustrations) ఎందరో చిత్రించారు. కానీ యువతిని గీసినంత అందంగా యువకుడిని గీసినట్లు నాకు తోచదు. వీరి చిత్రాల్లో ఏ లోటూ కనిపించదు. పైగా మనోహరంగా.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటాయి.
చిత్రగారు చంద్రా గారి గురించి జన్మదిన సందర్భంగా ఆత్మీయంగా అందించిన అభినందన ప్రశంసనీయం.
చంద్రాగారు ఎక్కడ ఉన్నారో ..వారి ఫోన్ నంబర్ కూడా ప్రచురించాలని కోరుతున్నాను.
అందరినీ ఆత్మీయంగా పలకరించే చంద్రా గారు శతాధిక పుట్టిన రోజులు ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందాలతో జరుపుకోవాలని హృదయ పూర్వక శుభాకాంక్షలు. నిజంగా చంద్రా గారి జన్మ దినం మా అభిమానులకు పండుగే.
– పద్మ (NVPSSL)
రాజమండ్రి.
Happy birthday Chandra garu
విరసం మొదటి రోజుల్లో విప్లవ కవితలకు చంద్ర వేసిన అద్భుతమైన చిత్రాల గురించి ఈ తరం వారికి తెలియదు ఆయన కథకుడు కూడా.చంద్ర కథలు పుస్తక రూపంలో కూడా వచ్చాయి అనారోగ్యం నుంచి కోలుకుని మరల చిత్ర లోకంలో కి ప్రవేశించాలని ఈ 74 జన్మ దినోత్సవ సందర్భంగా కోరుతూ