శ్రీ చిన్న శ్రీపతి (48) గారు, నివాసం శ్రీనగర్ కాలనీ, అమీర్ పేట, హైదరాబాద్.
వృత్తి-ప్రవృత్తి “చిత్రకళ”. కళ లోనే సర్వస్వం. తంజావూర్, కాన్వాస్ పేయింటింగ్స్, పెన్సిల్ మొదలగు మాద్యమాలతో సంపూర్ణంగా చిత్రించగల పనిమంతుడు. కళలో పట్టు, పరిపూర్ణత్వం కలిగిన కళాకారుడు. కేవలం పెన్సిల్ తోనే అద్భుత కళాఖండాలను తయారు చెయ్యవచ్చుంటున్నారు శ్రీపతి గారు.
రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. 236 సార్లు గ్రూప్ షోలు కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసారు. కాన్వాస్ పేయింటింగ్స్ దాదాపుగా 1400 లకు పైగానే సేల్ అయ్యాయని,
తంజావూర్ పేయింటింగ్స్ రమారమి ముప్పై వేలకు పైగానే అమ్ముడు పోయ్యానని, అందుకే ఈ రంగంలో ముఖ్యంగా నూటికి నూరు శాతం సంతృప్తిగానే వున్నదంటున్నారు. ప్రస్తుతం చేతిలో తొంభై వరకు ఆర్డర్స్ వున్నాయి, ఇప్పుడు ఆ పనిలోనే వున్నానని తెలిపారు. ఆర్డర్ పై తీసుకున్నవి 4-5 పూర్తయ్యాయి, అవి మాత్రమే నా దగ్గరున్నాయి. అలాగే దేనికీ సరైన సమయం చాలడం లేదని కించిత్ అసంతృప్తి కూడా వుందంటున్నారు శ్రీపతి గారు.
ఆర్టిస్టు అనేవాడు ప్రాట్టికల్ గా టైమ్ పెట్టుకొని వర్క్ చేస్తాడు. అలా చేయడం అది కమర్షియిల్ అవుతుంది. అందువల్ల అవుట్ పుట్ క్లియర్ గా రాదు. ఆర్టిస్టు సక్సస్ కాకపోవడానికి ముఖ్యమైన కారణం. చాలామంది ఏమి చేస్తుంటారంటే, ఎంతసేపు ఇంట్లోనే కూర్చొంటారు. హైదరాబాద్ లో అదే జరుగుతుంది. పేయింటింగ్స్ తో బయటకు వెళ్లరు. పేయింటింగ్స్ మాత్రం అమ్ముడు పోవాలి. కొంతమందయతే బయటకు వెళ్లకుండానే గుర్తింపు రావాలి. ఫేమస్ అయిపోవాలి. అన్నీ జరగాలంటారు బయటకు వెళ్లకుండానే.
ఉదా: నా విషయంలో, పోయిన సంవత్సరం ఢిల్లీలో ఓ ఎగ్జిబిషన్ లో నా వర్క్ తంజావూర్ పేయింటింగ్స్ లలో ఒకదానిని ఓ బయ్యర్ చూసి ఎంతని అడిగితే నేను ఓ రేట్ చెప్పాను. ఆయనా ఓ రేటుకు అడిగాడు. నేను ఇవ్వలేదు. బయ్యర్ రోజూ వచ్చి చూసి వెళుతున్నాడు. సేల్ అయ్యిందా…లేదా అని….లాస్ట్ డే రోజున కూడా వచ్చాడు. నేను చెప్పిన రేటుకే తీసుకొని వెళ్లాడు. అంటే ఆ బయ్యర్ కు ఆ పేయింటింగ్ బాగా నచ్చింది. అదే నేను ఢిల్లీకి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొంటే, అది సేల్ అయ్యేదా….. ఆ రేటు వచ్చేదా….
చాలామంది గురువు దగ్గర నేర్చుకోరు. ఇప్పుడు టచ్ స్క్రీన్ ఫోన్ లు వచ్చాక, ఎంతసేపూ ఫేస్ బుక్, యూట్యూబ్ లలో చూసేసి, కొత్త టెక్నిక్ నేర్చుకున్నామని చెప్పి, ప్రతీది కాపీ వర్క్ లే చేస్తున్నారు. పెద్దలు చెబుతారు “గురువు లేని విద్య గుడ్డి విద్య” అని. కొంతమంది వర్క్ షాపులో తంజావూర్ నేర్చుకుంటారు. కాని, దానికి వాడే బోర్డ్ ను ఎలా తయారు చేసుకోవాలనే దగ్గర నుండి నేర్పడం లేదు. నేర్చుకోవడంలేదు. నాకు అంతా వచ్చేసింది అంటారు. కలరింగ్ లోను, ఫినిషింగ్ లోను సరిగా రాదు. కొంతమంది నా దగ్గరకు వస్తుంటారు. నేనేదన్నా అడిగితే, “లేదు సార్ నాకు ఇంతవరకే చెప్పారంటారు”. మరి అలాంటప్పుడు నాకు అంతా వచ్చని ఎలా చెబుతారు. మరి నీకు బోర్డ్ ఎలా చెయ్యాలో తెలియాలి కదా…… అంటే బోర్డ్ తయారు చేసుకునే ప్రాసెస్ వీళ్లకు చెప్పడం లేదు. డ్రాయింగ్ లో పర్ఫెక్సెన్ లేదు. ప్రతివారి నోట అబ్ స్ట్రాక్ అంటున్నారు. అసలు అబ్ స్ట్రాక్ అంటే మీనింగ్ తెలియని వాళ్లున్నారు. మోడ్రన్ అంటే తెలియదు. మోడ్రన్ కు, అబ్ స్ట్రాక్ కు, రియల్స్టిక్ కు, ట్రెడిషనల్ కు చాలా వ్యత్యాసం ఉంటాయి. అవన్నీ తెలుసుకోకుండా కలర్స్, బ్రష్ లు కొనేయడం ఏదో వేసేయడం, వాటిని ఫేస్ బుక్ లో పెట్టేయడం, లైక్ లు చూసుకోవడంతోనే సరిపోతుంది. రోజులు గడిచిపోతుందే తప్ప గొప్ప కళాకారులు కాలేరు. అంతేకాదు, ఆర్టిస్టు ఏమి చేస్తున్నాడంటే, పని చేయడం మానేసి, పక్క పక్కన కూర్చొన్నా, మనిషితో మాట్లాడడం మానేసి, ఫేస్ బుక్ చూసుకోవడం ఉన్న టైమంతా అలా గడిచిపోతుంది. మనుషుల మధ్య కమ్యూనికేషన్ తగ్గిపోయింది. అంతా యూ ట్యూబ్ ఆర్టిస్టులుగా ప్రవర్తిస్తున్నారు. గతంలో పేరుగాంచిన కళాకారులు వూరకే ప్రసిద్ధి కాలేదు. వాళ్ల వెనక ఎంతో కష్టం వుంది. బయట ప్రపంచంలోకి వెళ్లేవారు. ఎందరెందరినో కలిసే వారు. వాళ్ళెవ్వరూ టెక్నాలజీ వాడలేదు. ఫేస్ బుక్, యూ ట్యూబ్ లు చూడలేదు. కాని తరతరాలుగా పేరు, ఖ్యాతి, కీర్తి సాధించారు ఆ నాటి కళాకారులు. అందుకే ఆనాటి కళాకారులకు ప్రత్యేక శైలితో ఏ నాటికైనా గుర్తుండిపోతారు.
నేను పడుకునే ముందు రెండు గంటలపాటు నాతో నేను మట్లాడుకుంటా. నేను చేసింది సరయినదా కాదా…..నాకు తెలిసినంతవరకు నాకు నేనే బెస్ట్ ఫ్రెండ్. నా గురించి తెలిసినంతగా ఎదుటి మనిషికి తెలియదు. అందుకే నాలో ఉన్న తప్పులు సరిదిద్దుకుంటాను. నా పనిలో నైపుణ్యాన్ని పెంచుకుంటాను.
ఇకపోతే “నేను ఓ ప్లాన్ చేస్తున్నాను. ముందు పెన్సిల్ డ్రాయింగ్ తో పర్ఫెక్షన్ దగ్గర నుంచి తంజావూర్ బోర్డ్ తయారు చేసే ప్రాసెస్ తో పాటు తంజావూర్ పేయింటింగ్స్ లో, 2/3 నెలలకు ట్రయినింగ్ ఇచ్చే ఆలోచనలో వున్నారని” తెలిపారు శ్రీపతి గారు.
చివరిగా మరో ముఖ్యమైన ఆలోచనలను ఈ సందర్భంగా తెలియజేసారు.
– తన పేయింటింగ్స్ ద్వారా రామాయణం సిరీస్ తో దాదాపుగా 45-50 ఫ్రేములుతో ఎగ్జిబిషన్ ను ఎప్పటికైనా ఏర్పాటు చేయ్యాలని.
– శనీశ్వరునికి తన సొంత చిత్రకళతో దేవాలయం కట్టాలని.
డా. దార్ల నాగేశ్వర రావు
Great…
Truthfully
Yes true