ఈరోజు దక్షిణ భారతదేశం గర్వించదగ్గ గొప్ప యువ చిత్రకారుణ్ని కోల్పోయింది. గత రెండు దశాబ్దాలుగా వీరి చిత్రాలను చూస్తున్నాం. గ్రామీణ దృశ్యాలను అత్యంత సహజ సుందరంగా చిత్రించడంలో సిద్దహస్తులు ఇలయరాజా స్వామినాథన్. బెంగలూరు చిత్ర సంత లోనూ, అమలాపురంలోనూ వీరిని రెండు సార్లు కలుసుకున్నాను. కరోనా ఎందరో కళాకారులను మనకు దూరం చేసింది. అలాగే మృత్యువుతో పోరాడిన ఇలయరాజా కూడా ఈ రోజు (7-6-2021) ఉదయం ఓడిపొయారు. వారికి నివాళిగా సమర్పిస్తున్న వ్యాసం…
ఇలయరాజా స్వామినాథన్ ఏప్రిల్ 19 న, 1979 లో తమిళనాడులో జన్మించారు. 2001 సం.లో కుంబకోణం ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నుండి బి.ఎఫ్.ఏ. డిగ్రీ చేసి, చెన్నైలోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నుండి పెయింటింగ్‌లో మాస్టర్స్ పట్టా పొందిన గ్రామీణ తమిళ వాస్తవిక చిత్రకారుడు. వివిధ మాధ్యమాలలో పనిచేయగలిగి నప్పటికీ, కాన్వాస్‌పై నూనె రంగులతో చిత్రీకరణ అతని బలమైన కోట. రాజా రవివర్మ వంటి గొప్ప మాస్టర్స్ నుండి ప్రేరణ పొందిన ఇలయరాజా తన చిత్ర రచనలలో భారతీయత మరియు గ్రామీణ జీవితం యొక్క సారాన్ని సంగ్రహించడానికి ప్రయత్నిస్తాడు. బొమ్మను వాస్తవిక శైలిలో చిత్రీకరించే అతని చిత్రం సున్నితమైన కాంతి మరియు నీడలతో సహజత్వం వుంటుంది. కథానాయకులు, ప్రధానంగా మహిళలు, కూర్పులో మిళితమైనట్లు కనిపిస్తారు, ఇంకా విభిన్నంగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తారు. అతన్ని సామాన్యులకు పరిచయం చేయడంలో తమిళ వారపత్రిక ‘ఆనంద వికటన్’ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది.
ఇలయరాజా జీవితంలో ప్రతి నిత్యం తనకు తారసపడే సాధారణ వ్యక్తుల ముఖాల్లోకి, జీవితాల్లోకి తొంగిచూశాడు. అందుకనే అతని చిత్రాలు సున్నితమైన అమాయక ఎక్స్ప్రెషన్స్, సున్నితమైన కాంతి మరియు సూక్ష్మ వివరాలతో మనల్ని వాస్తవికతతో కట్టిపడేస్తాయి. అతని ఆలోచనల ప్రతిబింబాలు అతని ప్రతి పెయింటింగ్ లోనూ దర్శనమిస్తాయి. ఇతని చిత్రాలు అనేక గ్యాలెరీలలో ప్రదర్శింపబడ్డాయి. 2009 లో ‘ద్రవిడియన్ వుమెన్ ‘ పేరుతో నిర్వహించిన ఒన్ మేన్ షో తో ఇతని ప్రతిభ రాష్ట్రాలను దాటి ప్రభవించింది. చిత్రకళలో ఎన్నో అవార్డులు ఆయన సొంతం చేసుకున్నారు. ఈయనకు భార్య. ముద్దులొలికేఓ కుమార్తె, కుమారుడు (సాయి కుమార్ ఇళయరాజా ) వున్నారు.
ఇలయరాజా చిత్రాలు మరి కొన్ని క్రింది లింక్ లో చూడవచ్చు….
http://www.elayarajaartgallery.n.nu/paintings
-కళాసాగర్
నిజంగా ఇళయరాజా గారి చిత్రాలు అత్యద్భుతం గా వున్నాయి. ఇలాంటి అద్భుత చిత్రకారుణ్ణి కోల్పోవడం చాలా బాధగా ఉంది. —బొమ్మన్ ఆర్టిస్ట్ &కార్టూనిస్ట్ విజయవాడ.
We loss Great artist
చాల చాలా విచారకరమైన వార్త ఇది దేశంగర్వించదగిన ఒక గొప్ప ఆణిముత్యం లాంటి చిత్రకారుని కోల్పోయింది .ఆమహా చిత్ర కారునికి అశ్రు నివాలి
చాలా విచారకరం, చిరంజీవ ఇళయరాజాకు ఇంత చిన్నవయసులో ఇలా జరుగడం బాధాకరం, ఒక మంచి కళాకారుణ్ణి కోల్పోయాం. వీరికి ముక్తి లభించాలని ఆ పెరుమాళ్ళ ను వేడుకొంటూ…..
బాధా తప్త హృదయం తో……
ఆనాటి రవివర్మ అనంతరం, సాంప్రదాయం, సంస్కృతి తన చిత్రకళ ద్వారా నిలబెడుతూ వచ్చిన ఇలయరాజా అప్పుడే కీర్తిశేషుడిగా మిగిలిపోవడం మన దురదృష్టం!
అతని ఆత్మకు శాంతి చేకూరుగాక!
ఈ వార్త నిజం కాకుండా ఉంటే బాగుండునని అన్ని గ్రూప్స్ పరిశీలించాను. 64 కళలు లో చూసాక నమ్మక తప్పలేదు. భారత దేశం చిత్రకళా రంగం లో వస్తున్న ఖ్యాతిని, ప్రపంచ వ్యాప్తం కాబోయే కీర్తిని కోల్పోయింది.
ఇది తీరని లోటు. ఇప్పటికే ఇళయరాజా స్థాయి నుండి చిత్ర కళా మహారాజు అనిపించుకున్న ఈ చిత్రకారుని కి అశ్రు నివాళి. గొప్ప ప్రతిభ కలిగిన మన చిత్రకారులు చిన్న వయసులోనే దివికి చేరుకోవడం మన దురదృష్టం. రాజాబాబు కి ఉన్నత గతులు ప్రాప్తింప చేయాలని ఆ దైవానికి నా ప్రార్థన.
గొప్ప కళాకారుడుని కోల్పోయాం. ఆయన చిత్రాలు సహజంగా ఉన్నాయి