“డావిన్సీ” నాకు స్ఫూర్తి – చిత్రకారిణి హరిణి

శ్రీమతి రాచమడుగు హరిణి గారు గొప్ప కళాకారిణి. నివాసం సుచిత్ర రెసిడెన్సీ, బాగ్ అంబర్ పేట, హైదరాబాద్ .

వీరు M.C.A., Fine Arts చేసారు. వృత్తి పరంగా వీరికి సొంతంగా డెంటల్ క్లినిక్ ను చూసుకుంటుంటారు. ఎందరో మనుషులు వస్తుంటారు. వారి వారి అభిరుచులను, మనోభావాలను తెలుసుకునే అవకాశముంటుందని, అందువల్ల కొన్ని సంఘటనలను, చిత్రకళ ద్వారా కొన్ని రూపాలను, భావాలను ప్రాక్టీసుగా పెన్సిల్ తోను లేదా స్కెచ్ పెన్నులతో రూపొందించుకుంటాను. అదీకాక ఆరో తరగతి చదువుతున్నప్పటి నుండి ఆసక్తి వుంది కూడా అన్నారు.

ఇంటిలో వుంటే గృహిణిగాను, క్లినిక్ లో వుంటే డాక్టర్ గాను, బ్రష్ పడితే చిత్రకారిణి గాను మారిపోతాను. ముఖ్యంగా చిత్రకళా రంగంలో 4-5 సంవత్సరముల నుండి సీరియస్ గానే పేయింటింగ్ ను చేస్తున్నానని, ప్రస్తుతం దాదాపుగా 45-50 దాకా పేయింటింగ్ చేసిన ఫ్రేములున్నాయని, చాలా వరకు బహుమతులుగ ఇచ్చేసానని, ఇప్పుడుప్పుడే ఒక్కొక్కటి సేల్ అవుతున్నాని వివరించారు హరిణి.

గ్రూప్ షోలు రెండు మూడు పెట్టానని, సోలోగా ప్రదర్శన పెట్టే అవకాశము రాలేదని చెప్పారు శ్రీమతి రాచమడుగు హరిణి.

“బేబి పుట్టినప్పుడు ఎంత సంతోషంగా వుంటుందో, అనుకున్న పేయింటింగ్ పూర్తయినప్పుడు నాకు అదే ఆనందంగా వుంటుందని” వైద్య భాషలో చెబుతున్నప్పుడు, నేనున్నది క్లినిక్ లో కదా అని నాకు గుర్తుకొచ్చి, నాలో నేనే నవ్వుకున్నాను.

ఇష్టంతో పేయింటింగ్ వేస్తూ వుంటే సంతృప్తిగా వుంటుంది. మనసూ బాగుంటుంది. అంతే కాదు కోపతాపాలు, బాధ, విచారం, విసుగు లాంటిది ఏదైనా ఈ పేయింటింగ్ వల్ల అన్నీ పోతాయి. ఈ చిత్రకళలో అంతటి మహత్యం ఉందన్నారు హరిణి గారు. చివరిగా బ్రష్ పట్టి కళాకారిణిగా మారటానికి ఓ కారణం చెప్పారు. “మోనాలిసా “ చిత్రం వేసిన “లియోనార్డో డావిన్సీ” గారి స్ఫూర్తితో చిత్రలేఖనం పై ముందు ఆసక్తి, ఆ తర్వాత అవగాహన ఏర్పడిందని హరిణి గారి కళారహస్యాన్ని చెప్పారు.

-డా. దార్ల నాగేశ్వర రావు  

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link