క‌ళాకారులకు ప్ర‌భుత్వ గుర్తింపు కార్డులు

తెలంగాణ క‌ళాకారులకు ప్ర‌భుత్వ గుర్తింపు కార్డులు –
Artist ID Cards by Govt of Telangana

క‌ళ‌ల ఖ‌జానాగా పేరొందిన తెలంగాణ‌లోని క‌ళాకారుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం గుర్తింపు కార్డులు అంద‌జేసే ప్ర‌క్రియ అందుబాటులోకి తెచ్చింది. టీటా డిజిథాన్ భాగ‌స్వామ్యంతో అందజేసే ఈ త‌ర‌హా గుర్తింపు కార్డులు దేశంలోనే మొద‌టిసారి కావ‌డం గ‌మ‌నార్హం. Tculture (టి క‌ల్చ‌ర్) పేరుతో రూపొందించిన ఈ యాప్ ద్వారా క‌ళాకారులు గుర్తింపు కార్డుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. కార్డుల జారీ ప్ర‌క్రియ‌లో మ‌ధ్య‌‌వ‌ర్తుల ప్ర‌మేయం లేకుండా ఉండేందుకు, ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్త‌యేందుకు ఆన్‌లైన్ విధానం ప్ర‌వేశ‌పెట్టింది. స్మార్ట్ ఫోన్ లేని క‌ళాకారులు మీసేవా నుంచి ద‌ర‌ఖాస్తు చేసుకొని కార్డు పొంద‌వ‌చ్చు. ఐడీ కార్డుకు ద‌ర‌ఖాస్తు చేసుకున్న త‌ర్వాత త‌గు ప్ర‌క్రియ‌లు పూర్త‌యి 30 రోజులలో ఆన్‌లైన్‌లో కార్డు రానుంది.

గుర్తింపు కార్డు పొందే విధానం:

  1. DOWNLOAD App using link bit.ly/tsculture
  2. FILL Artists ID Card Form & SUBMIT
    (or) Visit nearest MeeSeva Center
    NOTE: Government decided Rs.50 as Application fee

క‌ళాకారుల డేటాబేస్ త‌యారీ కోసం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ‌ ఇప్ప‌టికే ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించింది. ఈ డేటాబేస్ వ‌ల్ల క‌ళాకారుల వ‌య‌సు, జ‌న్మ‌స్థ‌లం, కళారూపం, నైపుణ్యాలు ఒక్క‌చోటే ల‌భిస్తాయి. త‌ద్వారా క‌ళాకారుల‌కు ల‌భించే స్కీములు, వారికి చేకూర్చే ప్ర‌యోజ‌నాలు అందించ‌డం ప్ర‌భుత్వానికి సుల‌భం అవుతుంది. ఈ ప్రాజెక్ట్‌ స్కోచ్ అవార్డు సైతం సొంతం చేసుకుంది.

  • భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్ర‌భుత్వం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap