శ్రీ నక్కల జయశేఖర్ రాజు (42) గారు, పిల్లిజాన్ వీధి, ఐతానగర్, తెనాలి.
వీరు వృత్తి, ప్రవృత్తి చిత్రలేఖనం. చిన్నతనం నుండి డ్రాయింగ్-పేయింటి అంటే ఇష్టం. ఆ ఇష్టంతో పాఠశాల స్థాయిలోనే ఎన్నో బహుమతులు తెచ్చుకున్నారు. తల్లిదండ్రులు మొదట్లో వ్యతిరేకించినా, తర్వాత ప్రోత్సహించారు. ఆ తర్వాత డ్రాయింగ్ లోయ్యర్, హైయ్యర్ (చెన్నై) లో పూర్తి చేసారు. సోదరుడు, మరియు మిత్రుడు జీవన్ శ్రీ సహాయంతో ఫైన్ ఆర్ట్స్ గురించి తెలుసుకొని, హైదరాబాద్-JNTU, లో ఫైన్ ఆర్ట్స్ చేసారు. B.F.A. లో వాటర్ కలర్స్, అక్రిలిక్, నైఫ్ పేయింటింగ్, ఎగ్ టెంప్రా, క్రాస్ హాచింగ్, మ్యూరల్స్ మొదలగువాటిలలో తర్ఫీదు తీసుకున్నారు.
గంగానమ్మ పేటలో సరస్వతి విద్యానికేతన్ లో, “ఆంధ్ర ప్యారిస్ ఆర్ట్ సొసైటీ”ని ఏర్పాటు చేసి, ఆర్ట్ డైరక్టర్ గా వుంటూ, కళలు మానసిక వికాసానికి దోహదం చేస్తాయని, పిల్లల్లో ఏకాగ్రత, సృజనాత్మకత పెరుగుతుందని, ప్రతి సంవత్సరం సమ్మర్ ఆర్ట్ క్యాంపులను ఏర్పాటు చేసి, ఎంతోమంది విద్యార్ధులకు చిత్రలేఖనంపై ఆసక్తిని పెంపొందించేలా కృషి చేస్తున్నారు.
వాటర్ కలర్స్, ఆయిల్, అక్రిలిక్, నైఫ్ పేయింటింగ్, ఎగ్ టెంప్రా, మ్యూరల్స్, క్రాస్ హాచింగ్, వాష్ పేయింటింగ్, వివిధ రకాల పనులను చేస్తుంటారు. పిల్లలలు చదువుతో పాటు, చిత్రలేఖనం, సంగీతం, స్పోకెన్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, ఫోటోగ్రఫీలో తదితర అంశాలలో ఎన్నో మెలకువలు నేర్చుకోవచ్చునన్నారు.
డ్రాయింగ్, పేయింటింగ్, పొట్రయిట్ పేయింటింగ్, గ్లాస్ పేయింటింగ్, పాట్ & శాండ్ పేయింటింగ్, హ్యాండ్ రేటింగ్, అబాకస్, క్రాఫ్ట్స్, కాలీగ్రాఫీలో, పేపర్ జ్యూయలరీ, ఫొటోఫ్రేమ్, పూసలతో అలంకరణ వస్తువులు, రంగురంగు కాగితాలతో వైవిధ్యంగా, సామాజిక, సాంస్కృతిక, సాంప్రదాయ పైన ఆసక్తి పెరగాలంటే తల్లితండ్రులే ప్రోత్సహించాలి. ఇవి మానసికి ఆనందానికి ఉపయోగపడతాయని అన్నారు. పర్యావరణ పరిరక్షణ అంశంపైన, మరియు ఓటర్లలో చైతన్యం కోసం వీరి చిత్రాలు ఆలోచింప చేస్తుంటాయి.
వీరు అనేక వేలమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. వీరిలో చాలామంది ఉపాధి పొందుతున్నారు. అనేక గ్రూప్ ఎగ్జిబిషన్ లను ఏర్పాటు చేసారు.
ఆల్ ఇండియా యంగ్ ఆర్టిస్ట్ క్యాంప్ లోను, 53 వ ఆల్ ఇండియా ఆర్ట్ ఎగ్జిబిషన్ లోను పాల్గొన్నారు. కొండూరు వీర రాఘవాచార్య అవార్డ్, యునెస్కో బెస్ట్ ఆర్టిస్ట్, తెనాలి టైమ్స్ స్పూర్తి అవార్డ్, స్వరలయ సంస్థ ఉగాది పురస్కారములు ఇలా ఎన్నో అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం సోలో ఎగ్జిబిషన్ కొరకు పేయింటింగ్స్ లను వేస్తున్నారు.
చివరిగా “ఉపాధి బాగానే వుంది, ఏది చేసినా ఇష్టంగా చేసుకుంటూ వెలితేనే సంతృప్తి” అని వెల్లడించారు.
డా. దార్ల నాగేశ్వర రావు