కళా సంబరం లా ‘కాళ్ళ ‘ సంస్మరణ సభ

ప్రముఖ చిత్రకారుడు కాళ్ళ సత్యనారాయణ దివంగతుడై  నవంబర్ 24 కి ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ఆయన ప్రధమ వర్ధంతి సభను కాళ్ళ కుమారుడు పైడి రాజు మరియు కాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ మరియు ఫ్ఘ్ కళాశాలలో గనంగా నిర్వహించడం జరిగింది. ఉదయం నిర్వహించిన కాళ్ళ సంస్మరణ సభలో ముఖ్య అతిధులుగా హాజరయిన తెలంగాణా బి. సి. కమీషన్ సభ్యులు జూలూరి గౌరీ శంకర్ , హార్వెస్ట్ స్కూల్ కరస్పొండేన్ట్ రవి మారూత్ లు మాట్లాడుతూ కాళ్ళ యొక్క చిత్రకళా సేవలను కొనియాడారు .
ఈ సందర్భంగా ఖమ్మం పట్టణం నందలి ప్రభుత్వ మరియు పైవేటు  పాటశాల స్థాయి నుండి డిగ్రీ స్థాయి వరకు గల విద్యార్దులకు ఉదయం నుండి మధ్యాహ్నం 01 గంట వరకు చిత్రకళా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు హాజరయిన సుమారు 400 మంది విధ్యార్ధులను మూడు గ్రూపులుగా విభజించి వారి విభాగాల వారీగా  పర్యావరణపరిరక్షణ, మై సిటీ, మై విలేజ్, ఫ్రీ సబ్జెక్టు ఇలా అప్పటికప్పుడు అంశాన్నిపిల్లలకు ఇవ్వడం జరిగింది. కన్నులపండుగలా జరిగిన ఈ కార్యక్రమంలో పాటశాల స్థాయి నుండి డిగ్రీ వరకు హాజరైన విధ్యార్ధీని విధ్యారులు తమ తమ ఆలోచనలకు కళాకౌశాలాన్ని  చక్కట్టి ప్రతిభను జోడించి రంగులతో రూపు కట్టిన చిత్రాలు అందరిని అలరించాయి. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా బెంగుళూరు నుండి వచ్చిన కాళ్ళ పైడి రాజు గారి మిత్రులు ప్రముఖ చిత్రకారులు కే.వి.(కే .వెంకటేశ్వరావు, లంకా వెంకట భరత్ ,మరియు స్థానిక చిత్రకారులు హరీ నవీన్, బీర శ్రీనివాస్లు వ్యవహరించారు .

అనంతరం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు జరిగిన సభకు ప్రముఖ కవి కాళ్ళ మిత్రులు మరియు తెలుగు ఆచార్యులు అయిన డాక్టర్  సీతారం పర్యవేక్షణలో మరో ప్రముఖ కవి మువ్వ శ్రీనివాసరావు ముఖ్య అతిదిగా హాజరహాజరైన ఈ సభలో అతిధులుగా చిత్రకారుడు చిత్రకళా విమర్శకుడు ఖజానా అధికారి అయిన వెంటపల్లి సత్యనారాయణ, చిత్రకారులు బీర శ్రీనివాస్, హారి నవీన్, కాళ్ళ కుమారుడు పైడి రాజు బెంగులూర్ నుండి వొచ్చిన చిత్రకారుడు కే. వి., ఫోటో గ్రాఫర్ భరత్ తదితరుల సమక్షంలో పశ్చిమ గోదావరి జిల్లా నందలి కాళ్ళ మిత్రులు ప్రచురించిన ” కాళ్ళ గుర్తులు “ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అనంతరం కాళ్ళ గురించి వారి చిత్రకళా విశేషాలను, వారితో గల అనుభవాలను మరియు పోటీలలో పాల్గొని వేసిన వారి చిత్రాలలోని విశేషాల గురించి  చిత్రకారుడు వెంటపల్లి, బీర శ్రీనివాస్, హరీ నవీణ్ తదితరులు మాట్లాడడం జరిగింది. అనంతరం విజేతలకు చక్కటి కలాత్మకతో రూపొందించిన మేమొంటో, ప్రశంసా పత్రం మరియు కాళ్ళ పుస్తకం బహుమతులుగా ఇవ్వడం జరిగింది.
చివరిగా కాళ్ళ గారి అబ్బాయి చిత్రకారుడు అయిన  పైడి రాజు గారు అతిధులందరికి చక్కటి జ్ఞాపికలను బహుమతులుగా ఇవ్వడం జరిగింది. ఆద్యంతం ఎంతో కన్నులపండుగా జరిగినా ఈ కార్యక్రమంలో విధ్యార్డులతల్లి తాడ్రులతో పాటు ఏలూరు తదితర ప్రాంతాలనుండి వొచ్చిన కాళ్ళ బంధు వర్గం స్నేహితులు. డిగ్రీ కళాశాల అధ్యాపక విద్యార్ధి బృందం హాజరయ్యి కార్యక్రమం విజవంతం కావడంలో తమ సహకారాన్ని అందించారు.

ఏలూరులో కూడా అయన మిత్రులు, అభిమానులు కాళ్ళ సంస్మరణ సభను నిర్వహించారు.

-వెంటపల్లి సత్యనారాయణ (9491378313)

SA:

View Comments (1)