
అశోక్ చిత్రాలలో వర్ణాలు, ఆ చిత్రాలలోని అంశాల అమరిక చూడగానే ఒక లయను స్ఫురింపచేస్తాయి. ప్రేక్షకుని ఒక విలక్షణమైన అనుభూతికి లోనుచేస్తాయి. ఈ చిత్రాలలో స్త్రీ పురుషులు ఇద్దరూ కనిపిస్తారు. వివిధ భంగిమల్లో ఆలోచనల్లో నిమగ్నమయి ఉంటారు. వారి ఆలోచనలు ఏమిటి? చిత్రకారుడు వ్యక్తం చేయదలచిన వారి అంతరంగం ఏమిటి? అని నిశితంగా పరిశీలించినపుడు మాత్రమే ప్రేక్షకునికి అవగతమవుతుంది. ఈ చిత్రాలలో అత్యధికం ప్రేమ, శృంగారం, విరహం, కోర్కెలతో పరుగులు తీయడం లాంటివే ఎక్కువగా కనిపిస్తాయి. చిత్రాలలో వస్తు ప్రాధాన్యతతో పాటు చిత్రీకరణలో అనుసరించిన టెక్నిక్, వర్ణ సమ్మేళనం చూపరులను ఆకట్టుకుంటుంది.
అశోక్ చిత్రాలలో చేపలు, శంఖువులు, ఆల్చిప్పలు, కలువలు, తామరలు లాంటి వాటితోపాటు జలాశ్వాలు, మత్స్యకన్యలు లాంటి వూహాజనిత అంశాలు ఎన్నో ఉంటాయి. అలాగే నెమళ్లు, చిలకలు లాంటి పక్షులు, గ్రామీణ దృశ్యాలు కూడ దర్శనమిస్తాయి. ఇంతకు ముందు చెప్పినట్లు వర్ణాలను వినియోగించుకున్న రీతిలోనే వీటిని కూడ దాదాపు ప్రతి చిత్రంలోను వినియోగించుకున్నాడు. వీటిలో అత్యధికం ప్రతిచిత్రంలోను కనిపిస్తాయి. కాని వాటిని రకరకాల పరిమాణాల్లో, ఒక్కో చిత్రంలో ఒక్కోరకంగా అమర్చడం ద్వారా వైవిధ్యాన్ని తీసుకురాగలిగారు అశోక్. ఆయన అనుసరించిన కన్ల విధానం చిత్ర విభాగాలను విడివిడిగా స్పష్టం చేయడమేకాకుండా, ఆయన చిత్రాలకు ఆధునిక స్వరూపాన్ని సంతరింపచేసింది.
చిన్నప్పటి నుండి డ్రాయింగ్ మరియు పెయింటింగ్ పట్ల ఆశక్తి వున్న కృష్ణ, పోర్ట్రెయిట్ చిత్రాలు వేసే మామయ్యను చూసి ఆకర్షించబడి, పెద్దయ్యాక ఆ అభిరుచినే వృత్తిగా చేసుకున్నాడు. అందుకే ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ తీసుకుని, గ్రాడ్యుయేషన్ తర్వాత ‘ఈనాడు తెలుగు దినపత్రిక’లో పద్యాలు, కథలకు బొమ్మలు గీసే చిత్రకారుడిగా తర్వాత ‘ఉదయం పత్రిక’లో ఇలస్ట్రేటర్ గా కొంత పనిచేశాడు. అప్పుడే తనకు స్వంతంగా ఏదైనా చేయాలన్న కాంక్ష వుండేది, అందుకే 90వ దశకం చివరిలో హైదరాబాద్ లో స్వంతంగా గ్రాఫిక్ డిజైనింగ్ మరియు పెయింటింగ్ స్టూడియోని ప్రారంభించాడు.

‘అద్వైత-అంతర్గత ఆత్మ’: “నేను ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక విక్రయం యొక్క ఆత్మ మరియు కోర్ని చేరుకోవడానికి ప్రయత్నించాను నా పెయింట్స్ ద్వారా. నేను ఎల్లప్పుడూ నా చిత్రాలలో కొన్ని థీమ్‌లను అనుసరిస్తూ ఉంటాను. ఆత్మను తాకడంలో నాకు సహాయపడేవి ఎగ్జిబిషన్లు. నా గత ఎగ్జిబిషన్‌కు ‘అద్వైతం’ అని పేరు పెట్టడానికి ప్రధాన కారణం నా ప్రతి చిత్రములోనూ కనపడుతుంది, వాటిలో ముఖ్యమైన పక్షి నిర్మాణం ఉంది, ఇది ఆత్మను వర్ణిస్తుంది, ఇది జెన్డర్‌తో సంబంధం లేకుండా మొత్తం శరీరానికి ఏకీకృత వివరణ ఇస్తుంది. నా మునుపటి చిత్రాలలో మ్యూజింగ్‌లు, విండోస్ అంతర్యామి వంటివి ఉన్నాయి, ఇవి ప్రముఖ కళాకారుల నుండి ప్రశంసలు అందుకున్నాయి” అంటాడు ఆశోక్.

“నా భవిష్యత్ మార్గాన్ని నేను ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. నేను జీవితం – ఆత్మ యొక్క అర్థం కోసం వెతుకుతున్నాను, నేను నా చిత్రాలలో సమాధానం మరియు శోధనను చిత్రించాలనుకుంటున్నాను. ఇది నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో నాకే తెలియదు, కానీ అది నన్ను సరైన ముగింపుకు తీసుకువెళుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, అప్పటి వరకు నేను పెయింటింగ్ చేస్తూనే ఉంటాను, జీవితాన్ని చిత్రీకరిస్తూనే ఉంటాను” అంటారు.
గుంటూరు జిల్లా, మంగళగిరిలో 1964లో జన్మించిన వి. కృష్ణ అశోక్ 2004 నుండి హైదరాబాదుతో పాటు, ఇతర దక్షిణ భారత నగరాలలో 40 పైగా సోలో ప్రదర్శనలు నిర్వహించారు. 1991 నుండి రాష్ట్రంతో పాటు, దేశ, విదేశాలలో అనేక గ్రూపు షోలలో తన చిత్రాలను ప్రదర్శించారు. హాంకాంగ్, అమెరికా, ఫ్రాన్స్, కెనడాలతో పాటు దేశంలోని అనేక సంస్థలు వ్యక్తుల వద్ద ఆయన చిత్రాల కలెక్షన్ ఉంది.
-కళాసాగర్


చాలా బావుందండీ.. అశోక్ గారి గురించిన వివరణ.
Nice paintings and article
Wonderful article about Krishna Ashok garu .Well explained about Artist inspiration, his subject and about composition.All works are So Beautiful.
Thanks a lot to Kala sagar sir…😊🙏🏻😊