రాజాజీ 81వ జయంతి వేడుక 

          కళల కాణాచి అయిన రాజమహేంద్రవరంలో ఆధునిక ఆంద్ర చిత్ర కళకు పునాది వేసి  అచిర కాలంలోనే అనంత లోకాలకేగిన దామెర్ల రామారావు తర్వాత ఆ  కళా వారసత్వాన్ని చిరకాలం కొనసాగెందుకు  అలుపెరుగక  కృషి చేసిన  ఇద్దరు ప్రముఖులలో అచార్య వరదా వెంకట రత్నం మొదటి వారైతే  రెండోవ వ్యక్త్తి ఆచార్య మాడేటి రాజాజీ .ఇందులో మొదటి వారైన వెంకట రత్నం రామారావుకు మిత్రుడు మరియు శిష్యుడైతే రెండవ వాడైన రాజాజీ వరదావెంకటరత్నానికి శిష్యుడు ,ఇరువురు గురువు మాటకోసం తమ వ్యక్తిగత కళా ప్రయోజనాన్ని సైతం త్యాగం చేసి తమ జీవితాంతం రాజమహేన్ద్రిలోదామెర్ల రామారావు స్మారక చిత్రకళా శాల ద్వారా వేలాది చిత్రకారులను తీర్చిదిద్ది అజరామమైన ఆ కాళావారసత్వాన్ని నేటికి నిలిచేలా చేసిన మహనీయులు . వీరిలో రాజాజీ 81 వ జన్మ దినం  సందర్భంగా ఈ అక్టోబర్ 02 వ తేదీన  రాజాజీ మెమోరియల్ ఆర్ట్ అకాడమి  మరియు భాగీరధి ఆర్ట్ ఫౌండేషన్ ఆద్వార్యంలో స్వర్గీయ మాడేటి రాజాజీ  81 వ జన్మదిణ వేడుకలు ఘనంగా జరిగాయి  

  స్థానిక కందుకూరి పురమందిరం లో మంగళవారం  జరిగిన ఈ సభ కార్యక్రమాన్ని  24వ డివిజన్ కార్పొరేటర్ బెజవాడ రాజ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కందుకూరి వీరేశలింగం జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ అధ్యక్షులు జగన్నాధం వెంకట రెడ్డి రాజాజీ చిత్రపటానికి పూల మాల వేసి అంతర్జాతీయ స్థాయి లో తెలుగు కీర్తిని పరివ్యాప్తి చేసిన మహా చిత్రకారుడు మాదేటి రాజాజీ అని కొనియాడారు. జయంతి సభకు అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ  అధ్యక్షులు పడాల వీరభద్ర రావు అధ్యక్షత వహించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో చిత్రకళా వైభవానికి వన్నె తెచ్చిన దామెర్ల రామారావు మిత్రుడు శిష్యుడు అయిన వరద వెంకట రత్నం , మాదేటి  రాజాజీ ల నిలువెత్తు విగ్రహాలను గ్యాలరీలో నెలకొల్పాలని ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు. కార్పొరేటర్ బెజవాడ రాజకుమార్ , డా. ఎం.ఎస్.శర్మ గారు మాట్లాడుతూ రాజాజీ గారి కళా ప్రతిభను కొనియాడారు.

          మానవ వికాసానికి  సమాజ నిర్మానానికి కళలు అత్యంత ప్రధానమైనవని అందుకు  చిత్రకళ  ఒక తార్కాణంగా నిలుస్తుందని చెప్పడానికి మాదేటి రాజాజీ జీవితం నిదర్శమని వైఎస్సార్ సిపి కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజుగారు అన్నారు. చిత్రకళా తపస్వి మాదేటి రాజాజీ 81వ జయంతి వేడుకల ముఖ్య అతిధి గ ఆయన పాల్గొని మాట్లాడారు మాదేటి రాజాజీ మెమోరియల్ ఆర్ట్ అకాడమీ మరియు భగీరధి ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజాజీ స్మారక పురస్కారాన్ని విశ్రాంతి  చిత్రకళోపాధ్యాయులు శ్రీ కంపరపు నాగేశ్వరరావు గారికి వైకాపా నాయకులు ఆకుల వీర్రాజు , కార్పొరేటర్ బెజవాడ రాజకుమార్ , జూబ్లీ లైబ్రరీ అధ్యక్షులు వెంకట రెడ్డి  గారలు శాలువా కప్పి అవార్డును అందజేశారు.  అనంతరం నాగేశ్వరరావు గారు డ్రాయింగ్ హైయ్యర్ పరీక్ష కు చెందిన అంశమైన పర్స్పెక్టివ్ పేపర్ పై అవగాహన కలిగించారు.    

ఈ సందర్భంగా ఆదివారం నిర్వహిచిన బాలల చిత్ర కళా పోటీలో గెలుపొందిన  విజేతలకు 30 గోల్డ్ మెడల్స్, 30 కన్సోలేషన్ ప్రైజెస్, 40 మెరిట్ బహుమతులు, పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఇరు సంస్థల కార్యదర్సులైన మాదేటి రవి ప్రకాష్, ఎం.వి.పి .ఎస్.ఎస్ లక్ష్మి గారలు  , న్యాయ నిర్ణేతలు కరణం నూకరాజుగారు, రాజు, కే.మోహన్, నిజాముద్దీన్,  కాకినాడ నుండి బుచ్చిబాబు, వై.సుబ్బారావు, (చిత్రకారులు ) , ఇంకా పద్మావతి, రవి, రామలక్ష్మి మొదలైన చిత్ర కళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

  —-వెంటపల్లి సత్యనారాయణ (9491378313)
        

3 thoughts on “రాజాజీ 81వ జయంతి వేడుక 

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap