చిత్రకళ మనసుకు మెడిటేషన్ వంటిది – మాధురి

శ్రీమతి.మాధురి బెండి గారు నివాసం విఠలరావు నగర్, మాదాపూర్, హైదరాబాద్.
కంప్యూటర్ అప్లికేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ం.ఛ్.ఆ) చేసారు. పెళ్ళయిన కొత్తలో కొన్ని సంవత్సరాలుపాటు భర్త చేస్తున్న ఆఫీస్ లో 2013 వరకు ఉద్యోగం చేశారు. తర్వాత ఇంటిపట్టున గృహిణిగా వుంటూనే, కళపై మక్కువ పెంచుకున్నారు. అది ఎలా అంటే, ఇప్పుడు వుంటున్న అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కనస్ట్రక్షన్ జరిగిన కొత్తలో, అన్ని గోడలు ఖాళీగా వుండేవి. గోడలపై ఏదన్నా పేయింటింగ్ లు, చిత్ర కళాఖండాలు తగిలిస్తే, అన్న ఆలోచన వచ్చినప్పుడు వాటిని తానే రూపొందిస్తే బాగుండును కదా అని మరో ఆలోచన కలిగింది.
స్వతహాగా చిన్నప్పటి నుండి కళ అంటే ఇష్టం. స్కూలు చదివే రోజులలోనే డ్రాయింగ్ వేయడం అలవాటుంది. కాలేజీ చదివేటప్పుడు, డ్రాయింగ్-పేయింటింగ్ చేసేవారు. అలా వేసిన వాటిని చాలావరకు గిఫ్ట్ గా ఇచ్చేసి వారంట. అదే స్ఫూర్తితో ఇప్పుడు తనింటికి డెకరేషన్ గా పేయింటింగ్స్ చేయ్యటానికి పూనుకోవడం జరిగింది. చేయగా చేయగా కళాకారిణిగా అభివృద్ధి చెందారు. ఇప్పుడు ప్రతి గదిలో, ప్రతి గోడలపైనా, ఎటుచూసినా, ఎక్కడ చూసినా, సెల్ఫ్ లలోను, అలమారలలోను మాధురి గారు రూపొందించిన చిత్రాలే. కళాఖండాలే కన్పిస్తున్నాయి.
పెన్సిల్, స్కెచెస్,చార్ కోల్, ఆయిల్ పేయింటింగ్స్, ల్యాండ్ స్కేప్, నైఫ్ పేయింటింగ్స్, అబ్ స్ట్రాక్ట్, సాండ్ పేయింటింగ్స్, టెక్చర్, మరియు క్లే వర్క్స్ మొదలగునవి వాటితో మాధురి గారి చిత్రాలు కళాభిమానులను రంజింపచేస్తాయి.ఎంచుకున్న చిత్రాలను సహజమైన పేయింటింగ్స్ వేయడం, సహజత్వానికి దగ్గరలో ఉన్న రంగులు ఉపయోగించడం తనకు ఇష్టమని మాధురి గారు చెప్పారు.
ఖాళీ సీసాలతోను, వివిధ రకాల ప్లేట్లుతోను, చెక్క పెట్టెలుతోను, సిరామిక్ ప్లేట్స్ తోను….. ఇలా వివిధ రకాల వస్తువులతో, నూతన పద్ధతులతో చేస్తుంటారు. కళారాధనే థ్యేయంగా, ఆత్మసంతృప్తి కోసమే తాను ఈ కళను ఎంచుకున్నానని చెప్పారు.
ముఖ్యంగా మాధురి గారు చేస్తున్న కళలో మండళ ఆర్ట్ నుండి ఆవిర్భవించిన నూతనంగా సృష్టించిన “డాట్ మండళ” ఆర్ట్ తో అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తున్నారు. అనుకున్న డ్రాయింగ్ ను అక్రిలిక్ పైన రెజీనా కోటింగ్ తో నూతన ప్రకియిగా, ప్రత్యేకతగా పేర్కొనవచ్చును.
ఒక సంవత్సరం నుండి ఆసక్తి కలిగిన పిల్లలకు-పెద్దలకు చిత్రకళలోను, క్రాఫ్ట్ పనులలో తరగతులు చెబుతున్నారు. టెక్చర్ పేయింటింగ్ లో వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు కూడా. భవిష్యత్ లో ఇంకా ఎక్కువుగా వర్క్ షాపులు నిర్వహించాలనే ఆలోచనతో వున్నారని తెలిపారు.
2014 నుండి పూర్తి టైమ్ ను కేటాయించి, సీరియస్ గానే కళలో ప్రయోగాలు చేస్తున్నారు. ఇంటిలోని వారంతా పూర్తి సహాయ-సహకారాలు అందించడంతో ఇప్పుడు గొప్ప కళాకారిణిగా రాణిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా అరవై పేయింటింగ్స్ చేసారు. పది వరకు సేల్ అయ్యాయని, మరి కొన్ని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఆర్డర్ పై కూడా చేస్తున్నారు.
గోవాలో రాంప్రతాప్ గారి కాళీపట్నపు అవార్డ్., కోనసీమ చిత్రకళా పరిషత్ అవార్డ్, అమలాపురం., అజంతా కళారామం తెనాలి., సిరి ఆర్ట్స్ పేయింటింగ్ ఇనిస్టిట్యూట్ నుండి., రాగా నుండి ఇలా దాదాపుగా 25 సార్లు గ్రూప్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసారు. అలాగే జాతీయ స్థాయిలో అవార్డులు, బహుమతులు, ప్రశంసలు అందుకున్నారు. ఈ రంగంలో పూర్తిగా సంతృప్తిగా వుందని అంటున్నారు. ప్రస్తుతం ఇండోర్, మధ్యప్రదేశ్ కు సంబంధించిన శ్రీ కృష్ణ యూనివర్సిటీ నుండి భ్Fఆ మొదటి సంవత్సరం (ఈFఆఆ ఇంటర్నేషనల్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ) చదువుతున్నారు.
చివరిగా “చిత్రకళలో కళాకారులుగ రాణిస్తున్న వారికి ఓ మంచి ఫ్లాట్ ఫారంను ఏర్పాటు చేసుకోవాలని, మనసుకు మెడిటేషన్ గా వుంటుందని” వివరించారు శ్రీమతి మాధురి బెండి గారు.

డా. దార్ల నాగేశ్వర రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap