జాతీయ స్థాయిలో గుర్తింపు కావాలి – నివేదిత

శ్రీమతి నివేదిత కిడాంబి  గారు, ఇక్రిశాట్ కాలనీ, చందానగర్, హైదరాబాద్.

నివేదిత గారు నాల్గో తరగతి చదువుతున్న వయసు నుండి తెల్ల పేపర్ కనిపిస్తే చాలు పెన్సిల్ తోనో, పెన్నులతోనో బొమ్మలు వేయడం అలవాటుగా మారింది. ఈమె తండ్రి కూడా ఆర్టిస్టుగా చేస్తుంటారు. తండ్రిని ఆదర్శంగా తీసుకొని, చిత్రకళపై ఆసక్తిని పెంచుకుంది.
ఇంటర్ లో చేరిన తర్వాత ఆర్ట్ ను అభివృద్ధి చేసుకునేందుకు కాన్వాస్ పై రంగుల మిశ్రమాలను పులమడం మొదలు పెట్టింది. ఇంటర్ తర్వాత M.Pharmacy లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయ్యడం, తర్వాత పెళ్ళి, ఓ పాప, ఇళ్లు, కుటుంబం ఏర్పడటం జరిగింది. కాని ఎక్కడా, ఏ సందర్భంలోను పెయింటింగ్ కు ఆటంకం లేకుండా కొనసాగిస్తూనే వుంది నివేదిత గారు. ముఖ్యంగా 7-8 సంవత్సరాల నుండి సీరియస్ గానే “కళ” కే అంకితమయ్యారు. 35-40 వరకు పేయింటింగులను చేసారు. ఆరు సార్లు గ్రూప్ షోలు కూడా ఏర్పాటు చేసారు. అలాగే అదే స్థాయిలో, సిరిఆర్ట్స్ వెల్ఫేర్ అషోసియేషన్స్ నుండి, 34 వ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఆర్ట్ హేవన్ నుండి, రాడార్ట్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ నుండి, డయిరా ఆర్ట్ గ్యాలరీ నుండి అవార్డులు కూడా అందుకున్నారు. అంతేకాదు, ముఖ్యంగ “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా” వారి బుక్ టైటిల్ నాల్గవ పేజీపై తను చేసిన చేసిన పేయింటింగ్ ను ప్రింటింగ్ చేయ్యడం మరువలేని విషయమని వివరించారు నివేదిత గారు.
ఈరోజుకి ఓ కళాకారిణిగా రాణించడానికి కారణం తన భర్త సహాయ, సహకారములతో ఈ రంగంలో రోజు రోజుకి ముందుకు వెళ్ల కలుగుతున్నానని సంతోషంతో వ్యక్తపరిచారు. అయినా ఇంకా జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలన్న ఆశయంతో వున్నానని తెలిపారు.
వాటర్ కలర్స్, ఆయల్ కలర్స్, అక్రిలిక్, చార్ కోల్, కలర్ పెన్సిల్లతోను భిన్నరీతిలో తనకంటూ ఓ గుర్తింపుగా రాణిస్తున్నారు నివేదిత. అందుకు కారణం ఇంటి పనులు పూర్తి చేసుకొన్నాక, మిగతా సమయం మొత్తం కళ కోసమే కేటాయించుకొని, ఈ పనులు చేస్తుంటానని చెప్పారు. అలాగే సంవత్సరానికి నలభై మంది స్కూల్ పిల్లలకు, కొంత మంది పెద్దలకు డ్రాయింగ్స్-పేయింటింగ్స్ లలో శిక్షణ ఇస్తున్నారు.
చివరిగా “కృషి చేస్తే ఏదైనా సాధించ వచ్చు” అని చెప్పారు శ్రీమతి నివేదిత గారు.

డా। దార్ల నాగేశ్వర రావు

1 thought on “జాతీయ స్థాయిలో గుర్తింపు కావాలి – నివేదిత

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link